ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
136.నిజమైన ఆనందం:-బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 25, 2020 • T. VEDANTA SURY • Memories

పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగించడానికి చేసే ప్రయత్నం"ఆనందం"గేయం!పిల్లలకు లోకంలో అమ్మానాన్నలే మిన్న.ఆ 
విషయం చెప్పడానికే ఈ గేయం రాశాను.//బడిలోన పోటీలు/బహుళముగ పెట్టారు/
బహుమతులు పొందంగ/బరిలోకి దిగినాను//
పద్య పఠనం లోను/ప్రథముడను అయ్యాను/
గద్య పఠనం లోను/ఆద్యుడను అయ్యాను//
వ్యాసరచనను నేను/వదలుకోలేదండి/వ్యాసమును రాసిచ్చి/బహుమతిని పొందాను//
సభ చేసి బహుమతులు/పంచి పెట్టితిరండి/
పెక్కు బహుమతులేమొ/నాకె,వచ్చినవండి/
ఆటపాటల లోను/అగ్రాన నిలిచాను/అగ్ర 
బహుమతులన్ని/అందుకో గలిగాను//
బహుమతులు అందుకొని/ఇల్లు చేరితినండి/
బల్లపై బహుమతులు/పేర్చి పెట్టితినండి//
నాన్నారు అవి చూచి/మెచ్చుకున్నారండి/
అమ్మేమొ దరికొచ్చి/ముద్దు పెట్టిందండి//
బడిలోని పొందేటి/బహుమతులు కంటెనూ/
అమ్మనాన్నల మెప్పు/ఆనందమే అయ్యె//
ఈ గేయం 2007 ఆగస్టు 18న ఆంధ్ర భూమి
దినపత్రికలో ప్రచురించారు.మరొక గేయం
"బాలవాక్కు"! ఇందులో బడిలోకి కొత్తగా వచ్చిన
ఒక మాష్టారు పిల్లల మనసులను చూరగొంటాడు.
ఒక అబ్బాయి కొత్త మాష్టారు గురించి చెబుతూ
పిల్లలను బడికి రమ్మని కోరతాడు. ఈ గేయం లో
పిల్లలు ఎలాంటి మాష్టారును ఇష్టపడతారో తెలిపాను.ఆ గేయం://బడిలోకి మాష్టారు/కొత్తగా వచ్చారు/గుడి లోన దేవుడే/ మా మంచి మాష్టారు//చక్కంగ పాఠాలు/చెప్పుచున్నారండి/
నీతులెన్నో మాకు /నేర్పు చున్నారండి//ఆటపాటల తోనే/పాఠాలు చెబుతారు/విసుగు
ఎన్నడు మాకు/కలిగించ నేరరూ//అల్లారుముద్దుగా/పేరుతో పిలిచెదరు/అమ్మనాన్నల ప్రేమ మరిపించుతుంటారు//ఏ
పనులు మంచివో/ఏ పనులు చెడ్డవో/విడమరచి
చెపుతారు/వివేచన నిస్తారు//కోపమే ఎరుగరూ/
మా మాష్టారు గారు/ప్రేమతో మాటలను/కురిపించుతుంటారు//బాధతో ఎవరున్న/బేజారు
పడతారు/హాయిగా మేముంటే/ఉల్లాస పడతారు//బడిలోకి రారండి/పిల్లలూ మీరెల్ల/
మాష్టారి దీవెనలు/పొందాలి మనమెల్ల//ఈ గేయం
2007 అక్టోబర్ 6న ఆంధ్రభూమి దినపత్రికలో
వచ్చింది. ఇంకో గేయం "పఠనాలయం"!పిల్లలకు
పఠనాలయానికి వెళ్ళే అలవాటు చేయాలి.దాని
ప్రాముఖ్యత వారికి తెలియపరచాలి.పాఠశాల
గ్రంథాలయాలను పౌరగ్రంథాలయాలను ఉపయోగించుకొనేటట్టు పిల్లలను ప్రోత్సహించాలి.
ఆ గేయం://గ్రంథాలకు కొలువండి/జ్ఞానానికి నెలవండీ/బాలలెల్ల మేలు పొందు/గ్రంథాలయమదేనండి//బొమ్మలతో కూడి ఉన్న/
పొత్తములూ అట ఉండును/చేతపట్టి చూచితిమా/చివర వరకు చదివించును//చిట్టిపొట్టి కథలనెన్నో/చదవవచ్చు మనమక్కడ/మంచి పెంచు నీతులెన్నో/తెలియవచ్చు మనకక్కడ//ఆనందం కలుగునండి/విజ్ఞానంపెంచునండి/పిల్లలార రండి రండి/భవిష్యత్ ను
దిద్దుకోండి// ఈ గేయం 2007 నవంబరు 24నఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.(సశేషం)