ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
137.జగతికి అందం బాలలోయ్:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 26, 2020 • T. VEDANTA SURY • Memories

2006వ సంవత్సరం లో విజయనగరం నుంచి ప్రఖ్యాత పబ్లిషర్ శ్రీ ఎన్.కె.బాబు గారు తన సంపాదకత్వంలో "నాని" అనే పత్రిక తీసుకు
వచ్చారు. పత్రిక పేరులోనే బాలతనముంది.బాలలమనోల్లాసానికి మానసిక వికాసానికి ఆ పత్రికఒక ప్రతీకగా మారి తెలుగు నేల ప్రాచుర్యం 
పొందుతూంది.ఆ పత్రికలో"జగతికి అందం"అనే గేయం 2008 జనవరి లోను   "మా పాప"అనే గేయం 2008  ఆగస్టు లోను వచ్చాయి. జగతికి అందం గేయం://బోసి నవ్వులు నవ్వే పిల్లలు/బుడి బుడి నడకలు నడిచే పిల్లలు/కావాలండోయ్ కావాలోయ్/జగతికి అందం తేవాలోయ్//అల్లరితోఅలరించే పిల్లలు/కల్లాకపటం ఎరుగని పిల్లలు/కావాలండోయ్ కావాలోయ్/జగతికి అందం తేవాలోయ్//చదువుల గుడికి వెళ్ళే పిల్లలు/పాఠాల్ శ్రద్ధగ నేర్చే పిల్లలు/కావాలండోయ్ కావాలోయ్/జగతికి అందం తేవాలోయ్//అందరిప్రేమ పొందే పిల్లలు/ఆదర్శంగా నిలిచే పిల్లలు/కావాలండోయ్ కావాలోయ్/జగతికి అందం తేవాలోయ్//... పిల్లలు ఇంటికందం.జగతికందం.ఎవరూ కాదనలేని సత్యమిది!మరో గేయం"మా పాప"! మా ఇంట్లో మా పెద్ద మనవరాలు"పూర్వి"  ఆరేడు నెలల ప్రాయంలో ఊసులతో చిరునవ్వుతో అలరించుతుండేది.మరో సంవత్సరం దాటేక ఆమె మాట,నవ్వు, నడక ఊహించుకుంటూ ఆనందం లో రాసిన పాట ఇది!//పంచదార కన్న/జుంటి తేనె కన్న/పాప మాట తీపి/ఓ చందమామా!//రాజహంస కన్న/నెమలి పిట్ట కన్న/పాప నడక హొయలు/ఓ చందమామా!//మల్లె పువ్వు కన్న/సన్నజాజి కన్న/పాప నవ్వు తెలుపు/ఓ చందమామా!//...మరొక పాట పుట్టుక గురించి చెబుతాను. ఆ పాట పేరు
"తీపి!"నేను ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మాష్టర్ రిసోర్స్స సెంటర్ లోమోడల్ లెసన్ జరుగుతుంది. ఒక మాష్టారు 
ఒకటవ తరగతో రెండవ తరగతో పాఠం చెబుతున్నారు.నల్లబల్లపై తల్లి,పిల్లి,నల్లి,బల్లి,చెల్లి లాంటి పేర్లు రాసి ఉన్నాయి. మాష్టారు పిల్లలచే పేర్లు చదివించుతున్నారు. ఆ పేర్లతో ఒక గేయం తయారు చేసి  మాష్టారు కందించాను.పాఠం చివరిలో మాష్టారు పాడి పిల్లలచే పాడించారు.ఆ గేయం://గోడ మీద ఎర్రచీమ/బల్లికిష్టము//కలుగులోన ఎలుక పిల్ల/పిల్లికిష్టము//ఎర్రనైన మన రక్తం/నల్లికిష్టము//
తియ్యనైన జిలేబి/చెల్లికిష్టము//ప్రేమతోటి పెంచడం తల్లికిష్టము//పిల్లలు అతి సులభంగా నేర్చదగిన గేయమిది!...ఈ గేయం 2008 మార్చి8 ఆంధ్ర భూమి దినపత్రికలో వచ్చింది.(సశేషం)