ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
138.బుడుగు శతక పద్యాలు:: --బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 27, 2020 • T. VEDANTA SURY • Memories

2008 జనవరి నెలలో సంక్రాంతి పండుగ ముందు2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 11 రోజులు ఆంధ్రప్రదేశ్ రాజీవ్ విద్యా మిషన్,హైదరాబాద్వారు ఎడిటింగ్ ఆఫ్ చిల్డ్రన్ లిటరేచర్ డెవెలప్ డు  ఇన్ డిస్ట్రిక్ట్స్ వర్క్ షాప్ నిర్వహించారు.
ఆ యా జిల్లాలలో రూపొందించిన బాలసాహిత్యానికి తుది రూపం ఇవ్వడానికిబాలసాహిత్య రచయితలను,ఉపాధ్యాయులను
హైదరాబాద్ పిలిచారు.సర్వశ్రీ కలువకొలను సదానంద,డా.గంగిశెట్టి శివకుమార్, శాఖమూరిశ్రీనివాస్, డి.కె.చదువులబాబు,బెలగాం భీమేశ్వరరావు, బెహరా ఉమామహేశ్వరరావు, డా.జి.సతీష్ కుమార్, పెండెం జగదీశ్వర్, డా.గుడిసేవవిష్ణు ప్రసాద్ ...30 మంది హాజరయ్యారు.జీవితంలో ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో ఊహించలేం!కొందరు కలిస్తే నిరుత్సాహం! కొందరు కలిస్తే ప్రోత్సాహం!నాకు కేటాయించిన గదిలోకివెళ్ళేసరికి అక్కడ డా.గుడిసేవ విష్ణుప్రసాద్గారున్నారు.కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుపండితునిగా పని చేస్తున్నారు. నా పేరు వినిచాలా ఆనందించారు. మీ గేయాలు పత్రికలలోచూస్తున్నాను,బాగుంటాయని కితాబిచ్చారు.ఒకరోజు భోజనాలయ్యాక గదికి చేరుకున్నాం.పద్య ప్రక్రియ చేపట్టారా అని అడిగారు.లేదన్నాను.ఆటవెలది లాంటిది ప్రయత్నించారా మరోసారి
అడిగారు.లేదనే నా సమాధానం. పెద్ద నవ్వునవ్వారు."మీ గేయాలు లయప్రధానంగానే ఉంటాయి.మీరు ప్రయత్నిస్తే శతకం రాయగలరు"
అన్నారు.నేను నవ్వి వూరుకుంటే ఆయన ఊరుకోలేదు.ఇప్పుడే ఇక్కడే మీచే పద్యం రాయిస్తానుఅన్నారు. ఒక కాగితం మీద ఆటవెలది ఛందస్సురాసి వేమన పద్యమొకటి గుర్తు తెచ్చుకొని ఒకపద్యం రాయండి అన్నారు. ఇదేమిటి ఈ బలవంతం?మనస్సులో మొదట అనుకున్నాను.నాచే పద్యం రాయించడానికే కదా ఆయన ఆరాటం అనుకొని ప్రారంభించాను.ఆ సమయంలో 1992లో బొబ్బిలి విజ్ఞాన వివర్ధినివారి పురస్కార సభలో శ్రీ చాసో గారు అనిన మాటలు గుర్తు వచ్చాయి.ఆయన తన గురించినేనేమీ గొప్ప రచయితనని అనుకోను నేనుమాటలు పేర్చే మేస్త్రీని మాత్రమే అని తన నిరాడంబరతను బయట పెట్టారు. ఆ మాటలుపద్యరచన చేయడానికి ముందుకు నెట్టాయి.మొదటి పద్యం విష్ణుప్రసాద్ గారి ముందేరాశాను.ఆ పద్యం://ఇటుక ఇటుక పేర్చి ఇల్లుకట్టెడి భంగి/పదము పదము పేర్చి పద్యమల్లు/పద్య రచన తెలుగు భాష యిచ్చెడి కాన్క/
తెలిసి మసలు కొనుము తెలుగు బుడుగ!//
రెండవ పద్యం తెలుగు భాష మీద రాశాను.
//తెలుగు భాష పలుక తేనెలొలుకు చుండు/
అలతి యలతి పదములందు గలవు/తరచి
తరచి చదువ తళుకులీనును గదా/తెలిసి
మసలు కొనుము తెలుగు బుడుగ!//మూడవ
పద్యం అమ్మ మీద రాశాను.//అమ్మ పలుకు మాట ఆణి ముత్యపు మూట/అమ్మ లాలి పాట అమృత
సమము/అమ్మ పెట్టు బువ్వ అపురూప వరమురా/తెలిసి మసలు కొనుము తెలుగు
బుడుగ//నేను రాసినవి రెండు మూడు చోట్ల
సరిచేశారు.ఆటవెలది రాసే విధానం కొంత
అవగతమయింది."పది పద్యాలు వరకు మీరు
కుస్తీ పట్టాలి,ఆ తరువాత అవే మిమ్మల్నితీసుకుపోతాయి"అని ఆత్మ విశ్వాసం కలిగించారుడా.గుడిసేవ విష్ణు ప్రసాద్ గారు!ఇంటికి వచ్చాక మిగిలిన ప్రక్రియలతో పాటు పద్యం మీద కూడా మనసు పెట్టాను.జేబులో చిన్న నోట్ బుక్ ఉంచే
వాడిని! ఆలోచన రాగానే వెంటనే ఆ పాదం రాసుకొనే వాడిని!తరువాత సరిచేసుకొనేవాడిని!రాసిన పద్యాలను విజ్ఞానసుధ,నాని,ధ్యానమాలిక,భక్తి సమాచారం మొదలైన పత్రికలకు పంపేవాడిని. జట్టు ప్రచురణలు తలపెట్టిన
బొమ్మల శతకానికి కూడా కొన్ని పద్యాలు రాసిచ్చాను.మూడు నాలుగు సంవత్సరాలలోశతకానికి సరిపోయే పద్యాలు రాశాను.పద్యాలకు
ముందు మాట డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ గారురాశారు.డి.టి.పి.చేసిన ప్రతిని డా.సి.నారాయణరెడ్డి గారికి పంపేను.ఆయన
అభినందనల పేరుతో ఒక లేఖ పంపించారు.అన్ని బాలసాహిత్య ప్రక్రియలు చేయాలని నాసంకల్పం!పద్య రచన ప్రక్రియ చేశానన్న తృప్తిఆ విధంగా కలిగింది!ఈ సందర్భంగా డా.గుడిసేవవిష్ణు ప్రసాద్ గారికి కృతజ్ఞతలు!(సశేషం)