ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
139.బుడుగు శతకంలో కొన్ని పద్యాలు:--బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 28, 2020 • T. VEDANTA SURY • Memories

మాతృభాష గురించి://భాషలెల్ల నేర్చి ఫలమునొందగ వచ్చు/మాతృభాష నెపుడు మరువ రాదు/అమ్మ భాష నీకు ఆలోచనలు నేర్పె/
తెలిసి మసలు కొనుము తెలుగు బుడుగ//ఆత్మవిశ్వాసం మీద://ఆత్మవిశ్వాసంబు అందలంబెక్కించు/ఆత్మన్యూనతంబు అణగ ద్రొక్కు/అందుకొనుము ఖ్యాతి ముందు కడుగు
వేసి/తెలిసి మసలుకొనుము తెలుగు బుడుగ//
సాధన విలువ మీద:/కోరుకున్నవన్ని కోరి మీద
పడవు/సాధనంబు చేసి సాధ్యపరచు/సాధనమును మించు జపము లేదిలనురా/
తెలిసి మసలు కొనుము తెలుగు బుడుగ//
విద్య మీద://విద్య యిచ్చు మనకు విలువ సంఘ
మునందు/విద్య తోటి సమము విలువ లేదిల లోన/తెలిసి మసలు కొనుము తెలుగు బుడుగ//
గుండె దిటవు మీద://బాధ పడిన పోవు బాధలు
ధరలోన/మీదు మిక్కిలవియు అదుము నిన్ను/
గుండె దిటవు తోడ మొండిగా పోరాడు/తెలిసి
మసలుకొనుము తెలుగు బుడుగ//మితిమీరిన
వేగం మీద://వాహనంబు మీద వాయు వేగము
వద్దు/కుదురు తప్పి బండి అదుపు తప్పు/మరణ
మిచ్చు రయము మనకు ముఖ్యము గాదు/తెలిసి
మసలు కొనుము తెలుగు బుడుగ//నడక మీద:
నడక మేలు చేయు నరజాతి కెంతేని/నడక మరచు నరులు నష్టపోవు/ఉదయవేళ నడక ఉద్ధరించు మనను/తెలిసి మసలు కొనుము
తెలుగు బుడుగ//       ఆకతాయి పనుల మీద:
//ఆకతాయి పనులు అందముగ నున్నను/
హద్దు మీరి జేయ హాని దెచ్చు/ముద్దు పెట్ట గలమ
మురిపించు దివ్వెను/తెలిసి మసలు కొనుము
తెలుగు బుడుగ//      తల్లిదండ్రులు మీద:
//తల్లి తిట్టెననియు తండ్రి కొట్టెననియు/పగను
పెంచుకొనుట తగదు నీకు/జగతియందు వారు
సరిదిద్దు గురువులు/తెలిసి మసలు కొనుము
తెలుగు బుడుగ//మతసహనం మీద://మతము
పేరు తోడ మనిషిని జంపకు/మనిషి నీకు తోటి
మనిషి గాదె/తోటి జాతినెపుడు తునమదు 
జంతువు/తెలిసి మసలుకొనుము తెలుగు బుడుగ//అప్పు మీద://అప్పు చేసి నీవు పప్పు
కూడు తినకు/అప్పు తెచ్చు మనకు ముప్పు
ఎపుడు/ముప్పు తెచ్చు అప్పు తప్పురా చేయుట/
తెలిసి మసలు కొనుము తెలుగు బుడుగ//
మతం గూర్చి://మానవతను చాటు మతము
నెంచగ గొప్ప/వెతను గూర్చు మతము హితము
కాదు/దయను చూపు మతము ధరను గొప్ప
మతము/తెలిసి మసలుకొనుము తెలుగు
బుడుగ//ఇలా సాగాయి పద్యాలు.(సశేషం)