ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
143.పిల్లల కోరికలు:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 1, 2020 • T. VEDANTA SURY • Memories

బాలల లోకం చీకూ చింతలు లేని లోకం.వాళ్ళకుకులాలు, మతాలు, భాషలు,ఆచారాలు ఏవీవాళ్ళ కలుపుగోలుతనానికి అడ్డురావు.తోటి 
పిల్లలు కనిపిస్తే చాలు ఇట్టే కలిసిపోతారు.పెద్దలకుపరోక్షంగా సందేశం ఇవ్వగలరు.అలాంటి భావాలతో రాసే గేయమే"బాల సందేశం"!
//రివ్వున ఎగిరే పిట్టలమండీ/స్వేచ్ఛగ తిరిగేపిల్లలమండీ//మతాలు, భాషలు వేరుగ ఉన్నా/అందరు మాకూ ఒకటే నండీ//ఆచారాలు ఎన్ని
ఉన్ననూ/మంచి వాటికే ఆదరణండీ//పల్లె పల్లెకుపోవుదుమండీ/నగరాలన్నీ చుట్టెదమండీ//శాంతివచనాలు చెప్పెదమండీ/సమైక్యతను చాటెదమండీ//కలిసుంటేనే కలదు సుఖమనీ/వాడ వాడనా చాటెదమండీ//...ఈ గేయం2009 ఆగష్టు 30వ తేదీ సూర్య దినపత్రికలో
వచ్చింది. మరో గేయం "సరదాబడి"!పిల్లలు తాము చదువుకొనే బడి ఎలా ఉండాలి అక్కడచదువు ఎలా ఉండాలి గురువులు ఎలా ఉండాలిపాఠాలెలా ఉండాలి ఒక విద్యార్థి తన మనసు లోనిది చెప్పే గేయమిది!//ఆడుకుంటానమ్మఆడుకుంటానే/ఆడుకుంటూ నేను పాడుకుంటానే//పాడుకుంటానమ్మ పాడుకుంటానే/పాడుకుంటూ నేను చదువుకుంటానే//చదువుకుంటానమ్మ చదువుకుంటానే/ చదువుకుంటూ నేను బాగు పడతానే//బందిఖానలాగ బడి ఉండరాదే/బెత్తాల గురువులు అసలుండరాదే//తాతయ్య కథ లాగ పాఠాలు
చెప్పాలి/నాన్నమ్మ పాటలా సరదాగ ఉండాలి//ఈ గేయం 2009 సెప్టెంబర్ 29 సూర్య దినపత్రికలో వచ్చింది.ఇంకో గేయం "చిన్న కలక్టరు"
ఈ గేయంలో ఒక బాలకార్మికుడు బడికి పంపించమని తల్లిని వేడుకుంటాడు.//బడి వద్దు అని నీవు/బడి మానిపించావే/దొర గారి ఇంటిలో/
పనికి చేర్పించావే//నా చిట్టి చేతులే/ కందిపోయావివిగో/బండ పనులూ చేసి/బలి అయితి నోయమ్మ//బడికి పోతానమ్మ/బడికి పోతానే/
బడి నాకు హాయమ్మ/బడికి నను పంపవే//పనులేవి చెప్పకను/పాఠాలు చెబుతారు/ఆటపాటలు నేర్పి/హాయి అనిపిస్తారు//బడిలోన
మాష్టారు/మా మంచి దేవుడే/చదువు రాతల వరము/మాకు ఇచ్చెదరే//చేత పొత్తము పట్టి/చదువుకుంటానమ్మ/కలక్టరునౌతాను/బడికి
పంపవె అమ్మ//ఈ గేయం కూడా సూర్య దినపత్రికలో అదేరోజు వచ్చింది.(సశేషం)