ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
144.కొన్ని స్నేహాలు వికటిస్తాయి:--బెలగాం భీమేశ్వరరావు9989537835.
October 2, 2020 • T. VEDANTA SURY • Memories

స్నేహం చేసినప్పుడు అవతలి వారి గుణగణాలుపరిశీలించాలి.కొందరి స్నేహం స్నేహానికి నిర్వచనంగా ఉంటుంది. కొందరి స్నేహం మనవల్ల లబ్ది పొందడానికి చూస్తుంది. కొందరి స్నేహంమనను నవ్వులు పాలు చేస్తుంది. మన వారిచే
మాట కాయిస్తుంది.మనను నష్టపరుస్తుంది. ఈ అంశమే తీసుకుని "తగని స్నేహం"గేయకథ రాశాను.//గట్టు మీదపుట్ట లోన/చిట్టి చీమ ఒకటి ఉండె/వట్టి మాటలాడుచూను/పనీపాట చేయకుండే//తోటి చీమలన్ని కూడి/మేత కూడ పెట్ట గాను/చిట్టి చీమ ఆరగించి/పోకిరిగా తిరుగ సాగె//మేత కొరకు చీమలన్ని/వెతల నెన్నో పడగాను/పని చేయక చిట్టి చీమ/చెలిమి చేసె ఎలుక తోను//తోటి చీమలదియు చూచి/ఎలుకలకూ చీమలకూ/పొత్తు కుదరదనియు చెప్పె//చిట్టి చీమ వినుట లేదు/ఎలుక చెలిమి మాన లేదు/మూషికాల వీపు
నెక్కి/గర్వంతో తిరగ సాగె//దినము దినముగడువ గాను/వర్ష ఋతువు వచ్చెనంత/పుట్ట లోన చీమలన్ని/ఈ రీతిన మదిన తలచె//
"వానలెన్ని కురిసినను/ఆకలితో బాధపడము/నిల్వ తిండి గింజలతో /కడుపు నింపుకొందుమికను"//చీమ గుంపు ఆలోచన/
మరునాడే భంగమయ్యె/చిట్టి చీమ నేస్తములు/
చీమ కొరకు పుట్ట కొచ్చె//పుట్టలోని దినుసులను/
చూచి అవియు గంతులేసె/చిట్టి చీమ వారింపును/పట్టింపక మెక్కి వేసె/చీమల శ్రమ
అంతయు/ఆ రీతిగ పొల్లు అయ్యె//చూశారా
బాలలూ/విన్నారా కథను మీరు/తగని వారితో
స్నేహము/ముప్పు తెచ్చు ఎవరికైన//ఈ గేయకథ
2008 ఫిబ్రవరి నాని పత్రికలో వచ్చింది.(సశేషం)