ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
145. సింహం మన మీద పడిందా ఇక అంతే : --బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 3, 2020 • T. VEDANTA SURY • Memories

ఒకరోజు పేషంట్ ను చూడడానికి మా ఊర్లోని కర్షక మహర్షి ఆసుపత్రికి వెళ్ళాను.రిసెప్షన్ హాలులో గోడకు ఒక ఛార్టు వేలాడదీసి ఉంది. అందులో ఆరోగ్యానికి సంబంధించిన సూక్తికనిపించింది. పిల్లలకు ఆ సూక్తిని కథారూపంలోచెప్పాలనిపించింది.ఆ కథే"భయం"!సంక్షిప్తంగాకథ ఏమంటే...శంకరం మహా భయస్తుడు.ఏ చిన్ననలత వచ్చినా బాధ్యతలు తీరకుండానే ప్రాణాలుపోతాయేమోనని కలతపడేవాడు.ఒక వేసవిలోఅతనికి అనారోగ్యమనిపించింది.గుండె దెబ్బతిన్నదేమోనని కిడ్నీలు పాడయినవేమోనని
మెదడుకు ఏమైనా అయి ఉంటాదని అతడు చాలా గాబరా పడ్డాడు. ఆలోచనలతో అతడికినిద్ర పట్టేది కాదు.ఒక రోజు రామ్ నాథ్ అనే ఒక
పెద్ద వైద్యుని వద్దకు వెళ్ళాడు. అనారోగ్యం గురించి ఏకరువు పెట్టాడు. కుటుంబ పరిస్థితులుచెప్పి తన ప్రాణాలు నిలబెట్టాలని ప్రాధేయపడ్డాడు. ఆ వైద్యుడు శంకరం చెప్పినదంతా విని వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలుచేయించాడు.వైద్య పరీక్షలలో ఏ దోషం కనిపించలేదు. శంకరానికి వచ్చిన నలత వేసవి తీవ్రత వల్లవచ్చే సాధారణ బలహీనతని గుర్తించాడు.అదే విషయం శంకరానికి చెప్పి బలం కోసం మందులు పేర్లు చీటీలో రాస్తున్నాడు. శంకరం అడ్డుపడి "నేను భయపడతానని మీరు ఏదో దాస్తున్నారు.
నిజం చెప్పండి. నాకేదో అయిపోతోంది"వైద్యునితోతన ఆందోళన వెలిబుచ్చాడు.రామ్ నాథ్ వైద్యంచేయడంలో చాలా అనుభవశాలి!శంకరం మనస్తత్వం పసిగట్టాడు!శంకరంతో అతడు"మీరుఏవేవో ఊహించుకుంటూ మరణం వరకు వెళిపోతున్నారు.చావు రావడం అంత తేలిక కాదు.అనవసరంగా భయపడిపోతున్నారు.ఏనుగు అతి బలమైనదైనా సింహం కలలో కనిపిస్తేప్రాణాలు పోగొట్టుకుంటుందని పెద్దలంటారు."రజ్జు సర్ప భ్రాంతి" సూక్తి మీరు వినే ఉంటారు.చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడితేనిజంగా పాము లాగే తాడు కనిపిస్తుంది. సంపూర్ణఆరోగ్యవంతుడు ఒక్క భగవంతుడే!సృష్టిలో ఏజీవికి సంపూర్ణ ఆరోగ్యముండదు.భయం సింహం
లాంటిది. అది మన శరీరంలో ప్రవేశించిందా మనలో ఉన్న అన్ని జీవవ్యవస్థల మీద దాడిచేసి ప్రాణం తీస్తుంది.భయానికి అంతటి శక్తి ఉంది.ప్రతి చిన్న విషయానికి మనం భయపడకూడదు.ధైర్యంగా ఉండాలి. ధైర్యమే మన రక్షణ కవచం"అని హితబోధ చేశాడు. వైద్యుని మాటలు శంకరంమీద పని చేశాయి.ముల్లును తీసేస్తే అంత వరకుఉన్న నొప్పి బాధ పోయినట్లు శంకరం లోని అనారోగ్యం మటుమాయమయింది.ఆ తరువాతశంకరానికి పదే పదే వైద్యుని వద్దకు వెళ్ళే అవసరం రాలేదు... ఇదీ కథ!ఆరోగ్య విషయంలో
భయపడడం వల్ల నష్టమే కాని ప్రయోజనంశూన్యమని పిల్లలకు తెలియజెయ్యడానికి ఈ కథ రాశాను. ఇది 2009 జూలై 20 ఆంధ్రజ్యోతి 
దినపత్రికలో వచ్చింది.(సశేషం)