ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
146.అనుభవం గొప్పది:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 4, 2020 • T. VEDANTA SURY • Memories

పెద్ద వారు జీవితంలో సుఖదుఃఖాలు,లాభనష్టాలు
చవి చూస్తారు. ఏది మంచిది ఏది చెడ్డది తెలుసు
కుంటారు.ఎదురు దెబ్బలు తిని తిని పిల్లలకు
అవి కలగకుండా ఆరాటపడుతుంటారు. ఆ అంశం
తీసుకుని"అల్లరి చుంచులు"గేయకథ రాశాను.
//ఉట్టి మీద చట్టి లోన/కమ్మనైన వెన్న ఉంది/
పసిగట్టిన చుంచు ఒకటి/ఉట్టి కెగర బోయింది//
ఉట్టి ఎత్తు ఎగురలేక/ ఉపాయమ్ము వెదికింది/
చుట్టు తిరిగి చూరు చేరి/ఉట్టి చెంత చేరింది//
చట్టి మీద గట్టి మూత/ఎత్త లేక పోయింది/ఎలా
వెన్న తినాలనీ/బుర్రకు పని చెప్పిందీ//ఒక్కటితో
పని కాదని/తెలుసుకోగలిగిందీ/కలుగులోన
ఎలుకలను/రమ్మనమని పిలిచిందీ//ఎలుకలన్ని
కలసి యంత/ఉట్టి దరిన చేరాయి/చట్టి మూత
ఎత్తుటకు/మంతనాలు ఆడినాయి//చట్టి మూత
ఎత్త లేక/ఉట్టి తాళ్ళు కొరుకుటకవి/నిశ్చయాని
కొచ్చాయి/కొరుక సిద్ధపడ్డాయి//అది తెలిసీ ముసలి ఎలుక/ఉట్టి ఊసు వద్దందీ/కిందకి దిగి
పప్పులతో/కడుపు నింపుకోమంది//"వృద్ధుడవై
కొరక లేక/ చెడ్డ మాట చెప్పావే/మాటాడక 
ఉండుమనీ/ఎలుకలన్ని వెక్కిరించె//ఒక్క ఉదుట
ఎలుకలన్ని/ఉట్టి తాళ్ళు కొరికాయి/దబ్బుమనీ
వెన్న చట్టి/కిందపడీ పగిలిపోయె//సంబరపడి
ఎలుకలన్ని/చూరు దిగీ వచ్చినాయి/కింద పడ్డ
వెన్న నేమొ/ఆరగించ సాగినాయి//దబ్బుమన్న
చప్పుడుకు/తెలివి వచ్చె యజమానికి/వెన్న
మెక్కు ఎలుకలపై/కర్ర విసిరె కోపంగా//కీచుమని
అరిచినంత/ఎలుకలన్ని ఒక్క మారు/కొన్నింటికి
దెబ్బ తగిలె/కొన్నెలుకల నడుము విరిగె//
గాయాలతో ఎలుకలన్ని/చెదరిపోయె అచట నుండి/ముసలి ఎలుక మాట వినక/ఇక్కట్లను
పొందినాయి//అనుభవాన చెప్పు వారి/మాటలనూ వినాలండి/దుడుకు పనులు మాని
వేస్తె/అపాయములు రావండీ// ఈ గేయకథ 
2009 జనవరి నాని పత్రికలో వచ్చింది.(సశేషం)