ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
147.భయంకర సంగీత సాధన :--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 5, 2020 • T. VEDANTA SURY • Memories

గాడిద ఓండ్ర పెడితే మనం చెవులు మూసుకోవలసిందే!అంత కర్ణకఠోరంగా ఉంటాది గాడిద స్వరం!ఈ గాడిదలన్నీ ఒకప్పుడు అడవిలోనే ఉండేవట!అవి చేసే ఒక పొరపాటువల్ల అడవి నుంచి బస ఎత్తేయవలసి వచ్చింది.ఈ విషయాన్ని కథాంశంగా తీసుకుని ఒక కల్పిత
కథను తయారు చేసి ఈనాడు హాయ్ బుజ్జీకిపంపించాను.ఆ కథను హాయ్ బుజ్జీ వారుబొమ్మల కథగా 2009 జూలై 15 న ప్రచురించారు. బొమ్మలు శ్రీనివాస్ గారు వేశారు. ఆరు చిత్రాలతో కథను నడిపారు. ఆ కథలోకి వెళ్తే... పూర్వం గాడిదలు అడవిలోనే ఉండేవి. ఒకానొక గాడిద కోకిల గానం వింది!ఆ కమ్మని స్వరానికి పరవశించిపోయింది."ఆహా...ఏమి స్వరం?!ఎంత బాగా పాడింది?మేం కూడా
నేర్చుకోవాలి"అనుకుంది.మర్నాడే గాడిదలనుసమావేశపరచింది."మనందరం సంగీత కళను నేర్చుకొని కోకిలలా పేరు తెచ్చుకోవాలి"అంది!గాడిదలన్నీ సరే అన్నాయి.సాధన మొదలుపెట్టాయి.అవన్నీ బిగ్గరగా అరవడంతో అడవిలోని
జంతువులన్నీ హడలిపోయాయి."మీ సాధన ఆపండి!వినలేకపోతున్నాం!ఆపకపోతే మృగరాజుకు ఫిర్యాదు చేస్తాం!"అని చెప్పి చూశాయి జంతువులు!"మేం ఆపం!ఏం చేసుకుంటారో చేసుకోండి!"అని జవాబిచ్చాయి.గాడిదల అరుపులు దూరం నుంచి సింహం కూడా
వింది.ఏదో కొత్త జంతువు వచ్చినట్టుంది దాక్కోవడం మేలనుకుంది.ఈలోగా జంతువులన్నీసింహం గుహకు చేరి "ప్రభూ!గాడిదల గానాన్ని
వెంటనే ఆపాలి!"అని వేడుకున్నాయి."వార్నీ అవిగాడిదలన్నమాట!"మనసులోనే అనుకొని సింహంగంభీరంగా గర్జించి"గాడిదలకి దేశ బహిష్కరణశిక్ష వేస్తున్నాను!తరిమికొట్టండి!"అని ఆజ్ఞ జారీచేసింది. ఇక జంతువులు వూరుకుంటాయా వెంటనే అవి గాడిదలను తరమసాగాయి! గాడిదలు మరి అడవిలో ఉండలేక ఊళ్ళు మీదపడ్డాయి. ఆనాటి నుంచి అవి మనుషుల మధ్యఉంటూ అప్పుడప్పుడు సంగీత సాధన చేస్తూఉన్నాయి.ఇదండీ కథ! పిల్లలను వినోదపరచడానికి,ఊహాశక్తిని పెంచడానికిఇలాంటి కథలు దోహదపడతాయి!(సశేషం)