ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
148.మన భయమే దయ్యం:---బెలగాం భీమేశ్వరరావు,9989537835
October 6, 2020 • T. VEDANTA SURY • Memories

దయ్యాలను నమ్మేవారు వాళ్లు మారరు సరికదామనలను నమ్మించడానికి ప్రయత్నిస్తారు.ఒకసారిమాకు అటువంటి సమస్యే వచ్చింది. ఆ సమస్యను ఆధారంగా చేసుకొని"అసలు కారణం"అనే కథను రాశాను.కథలోకి వెళ్తే ....చంద్రయ్యఇల్లు కొనుక్కుని అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికిమారాడు.వీధి చివర్లో ఆ ఇల్లుంది.పరిసరాలలోపెద్దగా అలికిడి ఉండేది కాదు.రాత్రయతే మరీఅధ్వాన్నంగా ఉండేది.అందువల్ల చీకటి పడ్డాకచంద్రయ్య భార్య,పిల్లలు ఇంటి తలుపేసుకొని బిక్కుబిక్కుమంటూ చంద్రయ్య కోసం ఎదురు
చూసేవారు.చంద్రయ్య కచేరీపని పూర్తిచేసుకొనివచ్చేసరికి రాత్రి బాగా పొద్దు పోయేది. భార్యాబిడ్డలు భయపడడం చూసి"మనం అడవిలో లేం!మనకు ఇరుగుపొరుగుంది.వాళ్ళతోమాట్లాడితే భయం తగ్గునుగా!"అని సలహాఇచ్చాడు.అప్పుడతడి భార్య సీతమ్మ "మీకు
చెప్పడం మరచిపోయాను. పక్కింటి వదిన గారుఈ మధ్య ఒక విషయం చెప్పారు. అప్పటి నుంచినా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను"అంది.చంద్రయ్య ఏమి చెప్పారని అడిగాడు. "మన పెరడిలో దయ్యాల  నీడలు కనిపిస్తాయట!రాత్రి
పది దాటాక అర్థరాత్రి వరకు ఒక దయ్యం గీపెట్టిఈల వేస్తుందట!"సీతమ్మ చెప్పింది. చంద్రయ్యకుదయ్యాలు, భూతాల మీద నమ్మకం లేదు.వెంటనేపొరుగింటికి వెళ్ళి దయ్యాలు గురించి అడిగాడు.పొరుగింటామె చంద్రయ్యకు పూసగుచ్చినట్టు 
దయ్యాలు గురించి చెప్పింది. నిజం నమ్మండిఅన్నట్టున్నాయి ఆమె మాటలు. వస్తున్న కోపాన్నిఅదుపులో పెట్టుకుని "అమ్మా ! దయ్యాలు లేవుగియ్యాలు లేవు అంతా మీ భ్రమ! మీరు భయపడడమే కాకుండా మా ఇల్లాలిని కూడాభయపెట్టారు"అన్నాడు. పొరుగింటామె రోషంతో "నేనేమీ అబద్ధం చెప్పలేదు! నేను చెప్పేదిమీరు చూడగలరు!"అని దబాలున తలుపు 
మూసేసింది.చంద్రయ్య మొండివాడు.రాత్రి ఇంటిఅలికిడి పూర్తయింది. పిల్లలను భార్యను మెలకువగా ఉండమని చెప్పాడు. దయ్యాలు అబద్ధమని ఋజువు పరచాలని అతడి పట్టుదల!కాస్సేపయ్యాక అందరూ పెరడులోకి వచ్చారు.అంతలో రెండు నీడలు పెరడులోని ఒక ఇంటిపైపడ్డాయి. అవి నిలకడగా ఉండక అటూఇటూతిరుగాడుతున్నాయి.సీతమ్మ హడలెత్తిపోయింది.భర్తను పిల్లలను ఇంట్లోకి వచ్చేయమంది. చంద్రయ్య నన్ను ఆలోచించుకోనీయ్ అని కసరినీడలను జాగ్రత్తగా గమనించాడు.దయ్యాల నీడలరహస్యం తెలిసిపోయింది. ఫకాలున నవ్వుతూ"సీతమ్మా!అవి దయ్యాల నీడలు కావు!మన ఇంటివాస లోనే ఉంటున్న బియ్యం వ్యాపారి దంపతుల
నీడలు!ఆ ఇద్దరు దుకాణం మూసి వచ్చి వంట చేసుకొనే పనులలో వాళ్ళు తిరుగుతున్నారు.వాళ్ళ వంటింటి లైటు వెలుగుకి
వాళ్ళ నీడలు ఆ ఇంటిపై పడుతున్నాయి"అనిచెప్పి, భార్యను పిల్లలను బియ్యం సాహుకారి ఇంటికి తీసుకు వెళ్ళాడు.నీడలు పెరడులో ఉన్నఇంటి మీద ఎలా పడుతున్నాయో వివరించాడు.సీతమ్మకు పిల్లలకు అసలు కారణం అర్థమైంది."మరి దయ్యం ఈల మాట!" భర్తనడిగింది సీతమ్మ. చంద్రయ్య ఆ ధ్వని వస్తున్న దిశను పోల్చాడు."ఆ శబ్దమా!అది కమ్మరి కొలిమి వద్ద తరిణి
పట్టుతున్న ధ్వని!మన పక్క వీధిలో రాత్రి పూటఇత్తడి సామాను తరిణి పడుతుంటారు!అటువెళ్ళేటప్పుడు అది చూపిస్తాను"దయ్యం ఈల
చిక్కుముడి విప్పాడు చంద్రయ్య!ఆ రోజు నుంచిసీతమ్మలోను పిల్లలలోను భయం పోయింది. పొరుగు ఆమె భయపెడుతున్నప్పుడల్లా ఆమెనుమార్చడానికి అసలు కారణం చెబుతూనే ఉందిసీతమ్మ! ఇదీ కథ...పిల్లల్లో హేతువాద దృక్పథంకలిగించాలంటే ఇటువంటి కథలు చదివించేఅవసరముంది!ఈ కథ 2010 మే 16 ప్రజాశక్తిదినపత్రికలో వచ్చింది.(సశేషం)
.