ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
155.అప్పులు తీర్చే తాయెత్తట!:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 11, 2020 • T. VEDANTA SURY • Memories


అజ్ఞానం,అవివేకం రెండూ జోడుగుర్రాలు!అవి మూఢనమ్మకాల వైపు మనుషులను పరుగులు తీయిస్తాయి!ఎద్దు ఈనిందంటే దూడను గొందినకట్టు అనే ప్రజలు ఎక్కువే అవుతున్నారు!అందుకేసునాయాసంగా ప్రజలను కొల్లగొట్టే మోసగాళ్ళుతయారవుతున్నారు!లోకంలో జరుగుతున్నమోసాలు కళ్ళకు కట్టినట్లు చూపించినా ప్రజలుమారలేదు. ఎప్పటికప్పుడు మోసపోవడం మనం
చూస్తున్నాం!ఈ అంశం తోనే "తాయెత్తు"అనే కథను తయారు చేసి చందమామ పత్రికకు పంపేను!కథ ఏమిటంటే... శివయ్యకు దేశసంచారమంటే సరదా!అప్పులు చేసి దేశంలోని పుణ్యతీర్థాలు,పుణ్యక్షేత్రాలు సందర్శించాడు!అప్పులుతీర్చకుండా దాట వేస్తే వడ్డీలు పెరిగి ఆ అప్పులుప్రాణాలకే ముప్పు తెస్తాయని భయపడ్డాడు. దేశసంచారం వల్ల లౌకికం బాగా అబ్బడంతో కొత్త అప్పులు రహస్యంగా చేస్తుండి డాబుసరిగా కుటుంబాన్ని నడపసాగాడు!ప్రజల్లో " వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక యోగి కొన్ని తాయెత్తులు
ప్రసాదించాడు.ఒక తాయెత్తుకు పూజ చేసిధరించాను.ఫలితంగా నా అప్పులన్ని పటాపంచలయ్యాయి"అని అతడు వ్యాప్తి చేశాడు!శివయ్య మాటలు అప్పుల్లో మునిగున్నవాళ్ళను భ్రమలో ముంచాయి.రుణబాధితులుశివయ్యను కలిసి తాయెత్తులు కోసం ఎగబడ్డారు.
శివయ్య వాళ్ల చేత పూజలు చేయించి దండిగాడబ్బులు దండుకోసాగాడు!దీంతో చుట్టుపక్కలఊళ్ళ నుంచి కూడా జనం వచ్చి శివయ్య కాళ్ళమీద పడ్డారు.ఒకరోజు చిన్ననాటి మిత్రుడుశివయ్య వద్దకు వచ్చి"నీ గురించి విన్నాను. ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో మునిగున్నాను.నాకొక తాయెత్తిచ్చి పుణ్యం కట్టుకో,"అని శివయ్య రెండు చేతులూ పట్టుకునిప్రాధేయపడ్డాడు.మిత్రుడికి ఏం చెప్పాలో అర్థం కాని శివయ్య , కాస్సేపటికి తేరుకొని ఒక తాయెత్తుతీసి ఉచితంగా తీసుకోమన్నాడు.కాని మిత్రుడందుకు అంగీకరించక డబ్బిచ్చి వెళ్ళాడు.ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా శివయ్యభద్రంగా ఉంచాడు.కొన్నాళ్ళ తరువాత ఆ మిత్రుడు శివయ్య వద్దకు వచ్చి ,"అప్పులు తీరలేదు.ఎంత డబ్బయినా ఫర్వాలేదు. మంచితాయెత్తియ్యు!"అడిగాడు. అప్పుడు శివయ్యభద్రంగా దాచిన డబ్బు తెచ్చి మిత్రునికిస్తూ,"తాయెత్తులకు అప్పులు తీరుతున్నాయో లేదో కాని నా అప్పులు మాత్రంతీరిపోతున్నాయి.నా సంపాదనా మార్గం ఇది.
నువ్వెలా గ్రహిస్తే అలా గ్రహించు.నీ డబ్బు తిరిగితీసుకో!"అన్నాడు. నిర్ఘాంతపోయిన మిత్రుడుమారుమాట్లాడక ఇంటికి తిరుగుముఖం పట్టాడు!.. ఇదీ కథ! ఇలాంటి విషయాలు పిల్లలకు తెలియపరచి చైతన్యపరిస్తే మూఢనమ్మకాలు గల వాళ్ల
తల్లిదండ్రులను చైతన్య పరచగలరు!ఈ కథ 2011 ఏప్రిల్ చందమామలో వచ్చింది.(సశేషం)