ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
156. పిచ్చుకల కృతజ్ఞత:---బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 12, 2020 • T. VEDANTA SURY • Memories

 ఇరవై పాతిక సంవత్సరాల కిందట   "అవ్వ-పిచ్చుకలు"పేరుతో ఒక గేయకథనుశ్రీ నిర్మలానంద గారి సంపాదకత్వంలో వెలువడు
తుండే చిరుమువ్వలు పత్రికకు గేయకథ రాసి పంపాను.వారు ఆ గేయకథను వచన వాక్యాలు గా మార్చి చిత్రకథగా ప్రచురించారు. 2011లోఆ గేయకథనే ప్రజాశక్తి దినపత్రికకు పంపితేవారు 2011 జనవరి 8 న ప్రచురించారు. గేయకథలో కొన్ని పిచ్చుకలు ఒక అవ్వ పట్ల చూపినకృతజ్ఞతాభావం చెప్పడమయింది.//అనగనగా ఒక పల్లె/పల్లెలోన ఒక గుడిసె/గుడిసెలోన ఒక అవ్వ/అవ్వకేమొ లేరెవరు//
పిచుక జంట ఒక్కటీ/గుడిసె చూరు చేరింది/అవ్వ అంత ప్రేమతో/వడ్లు జల్లి పిలిచింది//వడ్లు చూచి పిచ్చుకలు/రివ్వునొచ్చి వాలాయి/
ఆహారము చూచి అవి/ఆరగించి నిలిచాయి//
అవ్వ జూపు ప్రేమకవి/సంతసించె మిక్కిలిగ/
అందందె తిరిగి తిరిగి/చేరికయ్యె అవ్వకూ//
అవ్వనొదిలి పోలేక/ఇంటిచూరులోన అవి/
గూడు కట్టి ఉండినవి/గుడ్లు పెట్టి పొదిగినవి//
పిల్లలతో సందడిగ/అవ్వ చుట్టు తిరిగాయి/
పిచుకలను చూచి అవ్వ/మురిసి మోదమందింది//కాలచక్ర గమనాన/అవ్వేమొ 
ముసలిదయ్యె/గుడిసె పై గడ్డి మురిగి/పాకేమొ
బోసిదయ్యె//పాకస్థితికి పిచ్చుకలు/జాలి చెంది
యోచించె/రెల్లుగడ్డి తెచ్చి యవి/అవ్వ గుడిసె
కప్పినవి//అది చూచిన అవ్వేమొ/మిగుల
ముదమునందింది/పిచుకలు చేయు మేలుకు/
పులకరించి పోయింది//ఉపకారికి ఎన్నడును/
అపకారం జరగదూ/ధర్మంబును పాటిస్తే/
అదే మనకు మేలగునూ//ఈ గేయకథ పాదాలన్నీ
11మాత్రలతో ఉన్నాయి.157.అపకారం చేయబోకు:ఒకొక్కసారి సృష్టిలో ఊహించని రీతిలో న్యాయం జరుగుతుంది. ఈ అంశం తీసుకుని "కీడు"గేయకథను రాశాను.ఆ గేయకథ...//చెట్టు పైన కాకి ఒకటి/గూడు కట్టి
గుడ్లు పెట్టె/పసిగట్టిన పాము ఒకటి/చెట్టు పైకి
పాకసాగె//గుడ్లు తినగ ఆశతోను/పక్షిగూడు
పాము జేరె/ఆకసాన ఎగురు గద్ద/చెట్టు మీద
పాము జూచె//గిరికీలు తిరిగి గద్ద/పామునొడిసి
పట్టెనంత/ఆహారం దొరికిందని/సంతసించి ఎగిరె
నంత//కీడు చేయ నెంచ బోవ/హాని కలిగె గమనించుము/అపకారం చేయబోకు/ఆపదలను
తెచ్చుకోకు//ఈ గేయకథ 2011 సెప్టెంబరు భక్తిసమాచారం పత్రికలో వచ్చింది.(సశేషం)