ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
159.గేయ తరంగం:-బెలగాం భీమేశ్వరరావు9989537835.
October 14, 2020 • T. VEDANTA SURY • Memories

 తెల్లవారింది.పాప నిద్రలేవలేదు.చెట్టుపై కోకిల కనిపించింది.తల్లి ఆ కోకిలనుచూసి తన పాపను లేపమని అర్ధించే పాటే
"మేలుకొలుపు"!//గుబురు కొమ్మల చాటు/మావిచివురులు తింటు/నీకు నచ్చిన పాట/పాప మెచ్చగ పాడు//చిన్నారి కోయిలా/పాటలూ పాడవే/పాటలూ పాడుతూ/పాపనూ లేపవే//
చక్కనీ రాగాల/మేలుకొలుపే పాడు/నీ పాట విని
పాప/వేవేగ మేల్కొనును// ఈ గేయం 2011 ఏప్రిల్ 17 వార్త దినపత్రికలో వచ్చింది. మరో పాట"బంగారు పిచ్చుక"!ఒకరోజు నేను ప్రధానోపాధ్యాయుల గదిలో కూర్చుని మార్కుల రిజిస్టర్ లో విద్యార్థుల మార్కులు నమోదు చేస్తున్నాను.అంతలో కిటికీ నుంచి ఒక బుల్లిపిచ్చుక వచ్చి గదంతా ఎగురసాగింది.పాపం ఎలాబయటకు పోవాలో తెలియక బీరువా మీద వాలిభయం భయంగా చూస్తుంది.ఆ సన్నివేశంఅప్పటికప్పుడు నా చేత పాట రాయించింది.
//దారి తప్పి వచ్చావా/బుల్లి బుల్లి పిచ్చుకా//
అమ్మనొదిలి వచ్చావా/బుజ్జి బుజ్జి పిచ్చుకా//
మమ్ము చూచి భయపడకే/చిట్టి పొట్టి పిచ్చుకా//
అందకుండ ఎగరమాకు/అందమైన పిచ్చుకా//
మురిపెంగా చూస్తామే/ముచ్చటైన పిచ్చుకా//
నీ గూటికి చేరుస్తాం/బంగారు పిచ్చుకా//ఈ గేయం
2011జూన్ 3వ తేదీ వార్త పత్రికలో వచ్చింది. ఒకసారి పిచ్చుకలు దినోత్సవ సందర్భంగావాట్సాప్ సమూహం లో ఈ గేయం పెడితే
ప్రముఖ గజల్ గాయని ప్రముఖ రచయిత్రి శ్రీమతిమల్ల జ్యోతిర్మయి గారు ఆ గేయం చదువుతూవెంటనే ట్యూన్ కట్టి పాడి వినిపించారు.బుల్లి బుల్లిపిచ్చుకా బుజ్జి బుజ్జి పిచ్చుకా అనే పల్లవిని నాబాలగేయానికి చేర్చారు.ఒకరోజు గడియారం
మీద పాట రాయాలనుకున్నాను. గడియారంమనకు చేసే సేవను చెబుతూ అది మనకెందుకుఆదర్శంగా ఉన్నదో గేయం లో చెప్పాను. ఈ గేయం 2011 జూన్ నెల భక్తి సమాచారం లో
వచ్చింది.//గోడ మీద గడియారం/మూడు ముళ్ళ
వ్యవహారం/ కీ ఇస్తే చాలునండి/వెనుక కడుగు
వేయదండి//బడికి వెళ్ళు బాలలనూ/బడివేళకు
పంపునండి/పనికి వెళ్ళు పెద్దలనూ/పనివేళకు
పంపునండి//పగలనదూ రాత్రనదూ/పనికెపుడూ
వెరవదండి/పరుల కొరకె ఉన్నానని/పరమార్థం
చెప్పునండి//పైసలేమి ఆశించక/పనిచేయును
గడియారం/క్షణం క్షణం వెన్ను తట్టి/నడిపించును
గడియారం//అలుపెరుగక పని చేసే/గడియారం
ఆదర్శం/క్రమశిక్షణ కోరుకొనే/అది మనకు ఆదర్శం// ఇంకోగేయం "గురుపూజ"! 2011 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాసినది.
ఈ గేయం లో అన్ని పాదాలు "గు"తో ప్రారంభ
మయినట్టు చూశాను.//గులాబీలు గులాబీలు/
గుత్తులుగా గులాబీలు/గుబులు కలుగు గులాబీలు/గుభాళించు గులాబీలు//గులాబీలు
గులాబీలు/గోముగున్న గులాబీలు/గుమ్ముగున్న
గులాబీలు/గుప్పుమన్న గులాబీలు//గులాబీలు
గులాబీలు/గుబురు పొదల గులాబీలు/గుమ గుమలా గులాబీలు/గురుపూజకు గులాబీలు//
ఈ గేయం 2011 సెప్టెంబరు భక్తి సమాచారం లోవచ్చింది.(సశేషం)