ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
166.అసలు సిసలు పనిమంతుడు:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 26, 2020 • T. VEDANTA SURY • Memories

ఒక ఉన్నతాశయం నెరవేర్చడానికి పని అంట వెరవని మనుషులు కావాలి.అప్పుడే ఆ ఉన్నతాశయం నెరవేరగలదు.ఈ అంశంతో  "పరీక్ష లో కిటుకు" కథ రాశాను.ఈ కథ ఈనాడు హాయ్బుజ్జీలో 2012 మే నెల 12 వ తేదీన వచ్చింది. కథ
లోకి వెళ్తే...పరంధామయ్య దంపతులకు పిల్లలు లేరు . వాళ్ళు ఒక అనాధాశ్రమం నెలకొల్పి దిక్కులేని పిల్లల్ని చేరదీసి సాకసాగారు .  కాలగమనంలో పరంధామయ్యకు వయసు మీద పడడంతో అనాధాశ్రమం బాధ్యతలను ఎవరైనా ఒక యువకుడికి అప్పగించాలని అనుకున్నాడు. ఊరిలో దండోరా వేయించాడు. దండోరా విని పాతిక మంది యువకులు వచ్చారు . పరంధామయ్య వారితో , ' ఇది ఒక  ఉద్యోగం కాదు . బాధ్యత . అనాధల బాగోగులు చూసుకునే శ్రద్ధాసక్తులు మీకున్నాయో లేదో పరిశీలించడానికి పది రోజుల పాటు మీకు కొన్ని పనులు  చెబుతాను . అవేవీ ఉద్యోగానికి సంబంధించినవి కానేకాదు . అంగీకారమైతే రేపటి నుంచి రండి అన్నాడు.మర్నాడు పదిమంది మాత్రమే వచ్చారు. వారికి ఆశ్రమంలోనే వసతి,భోజన సదుపాయాలు కల్పించాడు పరంధామయ్య. మొదటి రెండు రోజులు భవన నిర్మాణానికి రాళ్ళెత్తించాడు.తర్వాత రెండు రోజులు కట్టెలు
కొట్టించాడు.మరో రెండు రోజులు వారి చేత తోటపని చేయించాడు.తర్వాత పరంధామయ్య
అత్యవసరంగా పట్టణానికి వెళ్లడంతో వారు కేమీ పని అప్పగించలేదు . అందరూ ఆశ్రమంలో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు . పదకొండో రోజున వారందరినీ విడివిడిగా తన వద్దకు పిలిపించుకుని ఈ పది రోజుల్లో ఏ పని కష్టంగా ఉందో చెప్పు అని అడిగాడు . ఒకరు రాళ్లెత్తడం కష్టమన్నారు . ఇంకొకరు కట్టెలు కొట్టడం కష్టమన్నారు . మరొకరు తోట పని కష్టమన్నారు . ఇలా అందరూ తలో పనీ కష్ట మని చెప్పారు . చివరకు ఒక్కడు మిగిలాడు . అతడు మాత్రం మొదటి ఆరు రోజులు ఏదో పనితో చకచకా గడిచిపోయాయి . చివరి నాలుగు రోజులు మాత్రం ఏ పనీ లేకుండా కాలం గడపడం  కష్టమనిపించింది . ఏమీ తోచలేదు . సోమరినయ్యా ననిపించింది ' అన్నాడు . పరంధామయ్య అతడికే అనాథాశ్రమం బాధ్యత లను అప్పగించాడు. (సశేషం)