ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
169.పసిగీతలే పసిడి గీతలవుతాయి:బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 29, 2020 • T. VEDANTA SURY • Memories

పిల్లల్లో సహజాతాలుంటాయి.పసిప్రాయం నుంచే అవి బయటపడుతుంటాయి.వాటిని మనం గుర్తించి ప్రోత్సహిస్తేనే అవి భవిష్యత్తు లో 
రాణించగలవు.మన పిల్లలకు పేరు ప్రఖ్యాతులు తీసుకు రాగలవు.అలా మనం చేయకపోతేమొగ్గ ప్రాయంలోనే వాళ్ళలోని సహజాతాలు
త్రుంచినట్టవుతోంది.పెద్ద వారికి ఒక సూచనగాపిల్లలకు మార్గదర్శకంగా ఉంటుందని భావించిఒక కథ రాశాను.కథ స్వానుభవమే.కథలో మిల్కీపాత్ర మా మనవరాలే!కథకి"పసి(డి)గీతలు అనిపేరు పెట్టాను.కథలోకి వెళ్తే...మిల్కీ మూడేళ్లపాప.వాళ్ళమ్మతో తాతగారింటికి వచ్చింది.ఇంట్లో అన్ని గదులు తిరుగుతు సందడి చేస్తోంది.ఒకరోజు తాతయ్య పుస్తకాల గదికి వెళ్ళింది. బొమ్మల పుస్తకాలు తీసి చూసింది. బొమ్మలుకనిపించీసరికి ఆనందంతో చప్పట్లు కొడుతోంది.తాతయ్య, అమ్మమ్మ మిల్కీ ఆనందం చూసి
ముచ్చట పడ్డారు. మర్నాడు తాతయ్య ఏదోపుస్తకం చదువుకుంటున్నారు.అమ్మమ్మ వంటపనిలో ఉంది. మిల్కీ వాళ్ళమ్మ తల్లికి సాయంగా ఉంది. మిల్కీ మెల్లగా పుస్తకాలు వద్దకు వెళ్ళింది.అక్కడ కింది అరలో రంగు పెన్సిళ్ళు కనిపించాయి.మిల్కీ వాటిని తీసి హాలులోకివచ్చింది. దివాన్ కాట్ ఎక్కింది. కుదురుగాకూర్చుంది.గోడ మీద రంగుపెన్సిళ్ళతో గీతలుగీస్తూ తెగ ముచ్చట పడుతుంది. ఆమె గీచినగీతలు రకరకాల ఆకారాలుగా రూపుదిద్దు  కుంటున్నాయి.పుస్తకం చదువుతున్న తాతగారుహాలులోకి వచ్చారు. దివాన్ కాట్ మీద కూర్చున్నమిల్కీ ఏం చేస్తుందా అని చూశారు.తెల్లని గోడమీద రకరకాల గీతలు. కోపం ఆపుకోలేకపోయారు."మిల్కీ ఏం చేస్తున్నావు నువ్వు?"అని కేకలేశారు.అనుకోకుండా ఆయనచేయి మీదకు లేచింది. తాతగారి అవతారం చూసిమిల్కీ బిత్తరపోయింది.ఏం చేయాలో తోచక ఏడుపు మొదలుపెట్టింది.ఆ ఏడుపుకి తాతయ్యఅదిరిపోయారు.ఎత్తిన చేయి దించారు.మిల్కీఅమ్మ,అమ్మమ్మ వంటగది నుంచి పరుగెత్తుకొచ్చారు.మిల్కీ చేతిలో రంగు పెన్సిళ్ళు,గోడ మీద గీతలు,కోపంతో ఉన్న తాతయ్యకనిపించారు.మిల్కీ అమ్మమ్మను చూసి"అమ్మమ్మాబొమ్మలేస్తే తప్పా?నా బొమ్మలు బాగా లేవా?తాతయ్యకు నచ్చలేదు. కొట్టడానికి వచ్చారు"అని
అమ్మమ్మను వాటేసుకుంది.మిల్కీ మాటలు వినితాతయ్య దిగ్భ్రాంతి చెందారు."అయ్యో,మనవరాలి కళాతృష్ణను గుర్తించలేక పోయానే" అని చాలా బాధపడిపోయారు.మనవరాలిని దగ్గరకు తీసుకొని"సారీ బంగారూ!బజారు వెళ్లి డ్రాయింగ్
పుస్తకం తీసుకు వస్తాను.అందులో బొమ్మలు 
వేద్దువు!"అని మనవరాలిని ఎత్తుకుని ముద్దాడారు.అంతే. మిల్కీ భలే భలే అంది.ఆనందంతో చప్పట్లు చరిచింది. మిల్కీ
సంబరం చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఈ కథ 2012 జూలై 15 న
ప్రజాశక్తి లో వచ్చింది.(సశేషం)