ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
170.అరుదైన బాలసాహిత్య కార్యశాల:బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 30, 2020 • T. VEDANTA SURY • Memories

ఒకరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు మరియు సెంట్రల్ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్,మైసూరు వారు సంయుక్తంగా        నిర్వహించబోయే బాలసాహిత్య కార్యశాలలోపాల్గొనాలని ఆహ్వానపత్రం అందింది.ఆ కార్యశాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2012 డిశంబరు 3 నుంచి 12 వరకు పది రోజులు నిర్వహించారు. కార్యశాలలో సర్వశ్రీ రెడ్డి రాఘవయ్య, చొక్కాపు వెంకటరమణ,దాసరి వెంకటరమణ, తిరునగరి వేదాంతసూరి,పైడిమర్రి రామకృష్ణ, డా.గంగిశెట్టి శివకుమార్, బెహరా ఉమామహేశ్వరరావు, పెండెం జగదీశ్వర్,పుట్టగుంట సురేష్ కుమార్, నేను అంటే బెలగాంభీమేశ్వరరావు పాల్గొన్నారు. రచయిత్రులలోశ్రీమతి డి.సుజాతాదేవి డా.ఏ.భద్రావతి ఈ ఇద్దరేకాకుండా మరికొంతమంది రచయిత్రులు పాల్గొన్నారు. వారిపేర్లు
గుర్తురాలేదు.మొత్తం 30 మంది రచయితలు రచయిత్రులు పాల్గొన్నారు.కార్యశాలలో నాకుబాలగేయాల మీద వ్యాసం రాసే బాధ్యత అప్పజెప్పారు.వ్యాసం తయారు చేయడానికిసెంట్రల్ యూనివర్సిటీ గ్రంథాలయంలోని పుస్తకాలు ఉపకరించాయి.వేలాది పుస్తకాలకు
కొలువుగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గ్రంథాలయం చూడడం ఒక భాగ్యమే.అక్కడున్న పుస్తకాలు చూడడానికి
రెండు కళ్ళు చాలవు.సాహిత్య, శాస్త్రవిజ్ఞాన పుస్తకాలు,లలిత కళలకు సంబంధించిన పుస్తకాలు బోలెడున్నాయి.అన్ని పుస్తకాలున్న
ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొనే వాళ్ళుసరస్వతీ పుత్రులు ఎందుకు కారు?అనిపించింది.హైదరాబాద్ నగరవాసులకు అది ఒక వరమే.అక్కడ ఎంత మంది పరిశోధన చేసినా తరగనిపుస్తక వాజ్ఞ్మయముంది.గ్రంథాలయాలు నిజమైనదేవాలయాలు.అక్కడ మౌనంగా పఠనం చేస్తున్నపాఠకులు జ్ఞాన వరం పొందబోయే మునీశ్వరులుగా కనిపించారు.నా వ్యాసానికి అవసరమయ్యే పుస్తకాలు తీసుకుని ముఖ్యమైనవిషయాలు రాసుకున్నాను.బాలగేయ సాహిత్యంపై చక్కని వ్యాసం రాసి నిర్వాహకులకు అందజేసేఅదృష్టం నాకు దక్కింది. అంతేకాదు,సెంట్రల్యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్తెలుగు ప్రొ.ఎస్. శరత్ జ్యోత్స్నారాణి గారు,ఆర్.ఆర్.ఓ.మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు చెందిన శ్రీ దేవీప్రసాద్ శాస్త్రి గారు,కార్యశాల కోఆర్డినేటర్గా వ్యవహరించిన డా.ఎం.పరంధామ రెడ్డి గారు,లోకల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించినప్రొ.జి.అరుణకుమారి గారు ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగానికి చెందిన అసోషియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వేంకటేశ్వరరావుగారు ఇచ్చిన ఉపన్యాసాలు వినే గొప్ప అవకాశందక్కింది. కార్యశాలలో హేమాహేమీలైన బాలసాహిత్య రచయితల అనుభవాలు వినేఅదృష్టం కలిగింది. ఇటువంటి కార్యశాలల నుంచే
రచయితలకు ఉద్దీపన శక్తి లభ్యమవుతుంది.కొత్త తరం రచయితలకు ఇటువంటి కార్యశాలలుఏర్పాటు చేయవలసిన అగత్యం ఎంతేని ఉంది.(సశేషం)