ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
171. మన పని మనమే చేసుకోవాలి::-బెలగాం భీమేశ్వరరావు-9989537835.
October 31, 2020 • T. VEDANTA SURY • Memories

ముద్దు ముద్దు చేస్తూ పిల్లలను పెంచితే ఆ పిల్లలుబద్ధకస్తులుగా అయినా మారతారు లేదా మందబుద్ధి కలిగిన వారైనా అవుతారు.పెద్ద చదువులకువచ్చాక బయట చదువులకు వెళ్ళాక అటువంటివారు సమస్యలు, అవమానాలు ఎదుర్కొంటారు.ఈ హెచ్చరిక చెయ్యడానికే "బామ్మగారు బాబిగాడు"కథ రాశాను.2012 మార్చి చందమామలో వచ్చింది. ఈ కథను డా వెలగా వెంకటప్పయ్య 
గారు సాహిత్య అకాడమీ ప్రచురించ తలపెట్టిన బాలల కథా సంకలనానికి  ఎంపిక చేశారు. చందమామ లో నాలుగు పేజీల కథ ఇది!
సంక్షిప్తంగా చెబుతాను... బాబిగాడు అయిదోతరగతి చదువుతున్నాడు.తల్లిదండ్రులు లేరు.అన్ని పనులకు బామ్మ మీద ఆధారపడడం
బాబిగాడికి అలవాటయింది.తనేమయినా అయితే మనవడి గతేమిటని బామ్మ దిగులుపడుతుండేది.మనవడికి పక్షులు, జంతువులను
చూపి వాటి పిల్లలు ఎలా ఇతరులపై ఆధారపడకుండా బతుకుతున్నాయో అర్థమయ్యేలా వివరించేది.బాబిగాడికి అవేవీచెవిన పడేవి కావు.ఒకసారి బాబిగాడు చదివేపాఠశాలలో అరకులోయ పిక్నిక్ వేశారు. అందరితో పాటు బాబిగాడు బయలుదేరాడు.బస్సెక్కిన నుంచి బాబిగాడికి కష్టాలు మొదలయ్యాయి. పిల్లలంతా ప్రకృతి దృశ్యాలుచూసి కేరింతలు పెడుతుంటే బాబిగాడు మాత్రంబామ్మను తలచుకుంటూ బిక్కుబిక్కుమనిసీటుకి అతుక్కుని ఉండిపోయాడు.పిల్లలు బాబిగాడి అవస్థ చూసి"బామ్మ లేకుండా బడికే రావు.అరకులోయకు బామ్మను కూడా తీసుకురావలసింది"అని గేలి చేయడం ఆరంభించారు.బాబిగాడి ముఖం ఉక్రోషంతో ఎర్రబడిపోయింది.బస్సు అరకులోయ చేరాక మరీ ఇబ్బంది పడ్డాడు.ఏనాడు సొంతంగా తినలేదు. భోజనం దగ్గర
తినబోతూ అన్నీ మీద వేసుకున్నాడు."పాపం బాబిగాడు బామ్మ తోడు లేకుండా ఏ పనీ చేసుకోలేడు.బాబీ! ఈరోజు కి అన్నీ కలిపేసుకొని
ఎలాగోలా తిను.రేపటి నుంచి బామ్మతినిపిస్తుందిలే"అని పిల్లలు ఆటపట్టించారు. మర్నాడు తెల్లారయింది.పక్కన బామ్మ లేకపోవడం వల్ల బాబిగాడికి రాత్రి నిద్ర పట్టలేదు.అందరూ బ్రష్ తో చక చక పళ్లు శుభ్రం చేసుకుంటే బాబిగాడికి బ్రష్ మీద పేస్ట్ వేసుకోడం రాలేదు.
బామ్మే బ్రష్ మీద పేస్ట్ వేసి పళ్లు శుభ్రం చేసేది.మరి స్నానం కూడా అంతే.ఎలాగోలా స్నానంఅయిందనిపించుకొని అందరితో బయటకు
బయలుదేరాడు.జలపాతం చూశారు.రకరకాలచెట్లున్న బొటానికల్ గార్డెన్ చూశారు.మ్యూజియం చూశారు. అవన్నీ చూశాక బొర్రాగుహలు చూడడానికి వెళ్ళారు.అక్కడ నుంచి బస్సెక్కి ఊరు చేరారు. మనవడు ఇల్లు చేరీసరికి బామ్మ ఆప్యాయంగా పలకరించింది.స్నానం చేసి వస్తాను,భోజనం సిద్ధం చేయు అన్నాడు బాబిగాడు. "ఒక్క క్షణం ఆగు!స్నానం చేయించడానికి వస్తాను"అని బామ్మ అంది."వద్దు! నేనే స్నానం చేసుకుంటాను!"అన్నాడు  బాబిగాడు.బామ్మఆశ్చర్యపోయింది. స్నానమయ్యాక "భోజనంతినిపిస్తాను, రా "అంది.భోజనం పెట్టు చాలుఅన్నాడు.బామ్మ వడ్డిస్తే తనే స్వయంగా తిన్నాడు.ఎంగిలి చేయి కడుక్కున్నాడు.ఆశ్చర్యపడడంబామ్మ వంతయింది.మర్నాడు బడికి తానేస్వయంగా తయారయి వెళ్ళాడు.బామ్మ కోసంఎదురుచూడకుండా బడి నుంచి తిరిగి వచ్చాడు.బాబిగాడిలో ఇంత త్వరలో మార్పు వస్తుందనిఊహించలేదు బామ్మ. వారం రోజుల తర్వాతఒక ఉపాధ్యాయురాలు బామ్మకు కనిపించి "బామ్మగారూ! అరకు విహారయాత్ర మీ మనవడిలో మంచి మార్పునే తెచ్చింది. మీమనవడు తోటి పిల్లలను బయట ప్రపంచం చూసిఎంతో నేర్చుకున్నాడు.బడిలో ఎంతో చలాకీగాఉంటున్నాడు.మీరు అనుకున్నట్టు మందబుద్ధికలిగిన వాడు కాడు.బద్ధకస్తుడు.ఆ బద్ధకం
విహారయాత్రలో వదిలింది"అన్నారు. బామ్మదిగులు పటాపంచలయింది.స్వయంగాపనులు చేసుకుపోతున్న మనవడిని చూసి ఆమె
మురిసిపోయింది.(సశేషం)