ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
174. గేయలతలు:బెలగాం భీమేశ్వరరావు,9989537835
November 3, 2020 • T. VEDANTA SURY • Memories

చందమామ మీద ఎన్ని
గేయాలల్లినా తనివి తీరదు.మనం చందమామతో
స్నేహం చేసినప్పుడల్లా కొత్త కొత్త ఆలోచనలు 
ముసురుతాయి.స్వచ్ఛమైన ఆకాశంలో వెలిగి
పోతున్న చందమామను చూసి ఒకరోజు
"కడలి తనయ" పేరుతో గేయం రాశాను.ఆ గేయం
చూద్దామా!//వెన్నెలను విరజిమ్ము/వెలిగేటి దీపమా/అందాల నింగిలో/అలరించు దీపమా//
పిల్లలను నిను మించి/లాలించు వారెవరు/కడలి
తనయవు నీవు/కరుణ చూపుము మిగుల//నిశి
రాత్రి వేళకు/రేరాజువయ్యావు/తళుకు తారల కేమొ/తోడువై నిలిచావు//చల్లనీ వెన్నెలను/నేలపై
కురిపించు/అమృతం విరజిల్లి/ఆదరించుము భువిని//ఈ గేయం 2013 మార్చి 24 వార్తలో 
వచ్చింది. మరో గేయం "విరిసే ప్రకృతి"! ప్రకృతి
గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు గేయవస్తువులకు కొరతుండదు. ఆ ఆలోచనల 
నుంచి పుట్టేదే ఈ గేయం. గేయాన్ని చూద్దామా
మరి!//రంగుల హంగుల రెక్కల తోడను/పొందుగ
అమరెడి ముక్కుల తోడను/కువ కువ అరుపుల
సవ్వడి తోడను/ఎగిరే పక్షులు నా కిష్టం//బిర బిర
పారే వాగులు తోడను/గుబురుగ పెరిగే పొదల
తోడను/చెంగున దూకే మృగములు తోడను/విరిసే విపినం నా కిష్టం//అపార వినీల జలములు
తోడను/తీరపుటంచుల సొగసుల తోడను/పడి పడి లేచే కెరటాల్ తోడను/ఉరికెడి జలనిధి       నా కిష్టం//దిక్కులు ఎరుగని శూన్యం తోడను/
అనంత దూరపు దారుల తోడను/మెరిసే తళుకుల తారల తోడను/వెలిగే గగనం నా కిష్టం//
ఈ గేయం 2013 జూన్ 9 వార్తలో వచ్చింది. పక్షులు మనకు ఏమైనా సందేశాలు ఇస్తున్నాయా
అని ఆలోచించాను.అప్పుడు తయారయింది
"మేలు పలుకులు"గేయం!//వేకువ కోడి ఏమన్నాది/వేకువ వేళన లెమ్మన్నాది/కావ్ కావ్ 
కాకి ఏమన్నాది/కాలయాపన వద్దన్నాది/కువ కువ
గువ్వ ఏమన్నాది/హాయి హాయిగ బతకమన్నది/
నటనల నెమలి ఏమన్నాది/చీకూ చింత మానమన్నది/వసంత కోకిల ఏమన్నాది/స్వేచ్ఛగ
పాటను పాడమన్పది/ఎగిరే పావురమేమన్నాది/
శాంతి గీతికను పాడమన్నది//ఈ గేయం 2013
జూన్ 22 న వార్తలో వచ్చింది.(సశేషం)
.