ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
175.అక్షర పరిచయ గేయాలు:బెలగాం భీమేశ్వరరావు,9989637835
November 4, 2020 • T. VEDANTA SURY • Memories

ఉపాధ్యాయవృత్తి లో ఉన్నప్పుడు 1వ తరగతి
చెప్పే అనుభవం కొంత ఉండడం వల్ల అక్షరాలు
పరిచయం చేయడానికి ఆ అక్షరం గుర్తుపెట్టు
కోడానికి సరదా పాటలు రాశాను.అటువంటి
పాటలకు బుడుగు పాటలు అని పేరు పెట్టాను.
//అమ్మ చేసిన కోవా/అందలేదు బావా/అందుకొనీ
రావా/అందించి పోవా//ఆదివారం సెలవు/ఆటలకు నెలవు/ఆరుబయట తిరుగుదాం/
ఆటలాడి వద్దాం//ఇరుగు పొరుగు పిల్లలు/
ఇసుక దిబ్బ చేరిరి/ఇసుక లోని ఆటలు/ఇష్టం తో
ఆడిరి//ఈన పుడక సన్నన/ఈద గాలి చల్లన/
ఈగ జబ్బు తెచ్చును/ఈల హెచ్చరించును//
ఉల్లి మేలు చేయును/ఉన్ని వేడినిచ్చును/ఉడుత
చెట్టు ఎక్కును/ఉడుము పట్టు పట్టును//
ఊయలూగును పాప/ఊత కోరును తాత/ఊళ
వేయును నక్క/ఊరు కాయును కుక్క//ఋషులు
తపము చేతురు/ఋణము కొంప ముంచును/
ఋతువు మారుచుండును/ఋక్కు వేద భాగము// ఎడ్లబండి పరుగురా/ఎంత జోరుగుందిరా/ఎడ్లు గొప్ప చురుకురా/ఎవరు
ఆపగలరురా//ఏకదంతుడి పూజ నేను చేశాను/
ఏరువాక దున్ని అయ్య వచ్చాడు/ఏతమెక్కీ నీరు
అమ్మ తోడింది/ఏపుగానూ పెరిగి పంట పండింది//
ఐశ్వర్యములే సిరిసంపదలు/ఐకమత్యమే ఇచ్చును బలము/ఐరావతము ఇంద్రుని ఏనుగు/ఐదుగురండీ పాండవులు//ఒకానొక ఊరుంది/
ఒంటరి కోతి అచటుంది/ఒబ్బట్లంటే ఇష్టం అంట/ఒప్పుగ దొంతులు కావాలంట//ఔదార్యమున్న ఒక
రాజు/ఔచిత్యంగా పాలించాడు/ఔషధశాలలు 
నెలకొల్పి/ఔరా అనిపించుకున్నాడు//అందమైన
బాలలన్న/అందమైన పూవులన్ళ/అందమైన పక్షులన్న/అందరికీ ఇష్టమే// ఇలా వర్ణమాల లోని
అన్ని అక్షరాలతో చిన్న చిన్న గేయాలు తయారు
చేశాను.ఏ గేయానికి ఆ గేయమే ప్రత్యేక లయ కలిగి ఉంటుంది. ఈ గేయాలు 2013 అక్టోబరు భక్తి సమాచారం పత్రిక లో వచ్చాయి.(సశేషం)