ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
176.పిల్ల అందం - ఆమె అల్లరీ అందమే:బెలగాం భీమేశ్వరరావు,9989537835.
November 7, 2020 • T. VEDANTA SURY • Memories

ఇంట్లో తిరుగుతున్న మనవరాళ్ళను చూస్తూ 
గేయమొకటి రాశాను."పూల కానుక"అని పేరు
పెట్టాను.//సంపెంగి పువ్వేమొ/పసిడి ఛాయిచ్చింది/నందివర్ధన పువ్వు/నిగనిగలనిచ్చింది//ఎర్ర గులాబీ పూవు/బుగ్గలను
తాకింది/మందార పువ్వేమొ/అధరాల నద్దింది//
నీలి కలువా పువ్వు/నేత్రాలు చేరింది/మొగలి
రేకుల పువ్వు/అత్తరును పూసింది//తీగె మల్లిక
పువ్వు/నిర్మలత నిచ్చింది/ముద్దబంతీ పువ్వు/
ముద్దుతనమిచ్చింది/పూలిచ్చు కానుకలు/
అందుకొని ఆ పాప/అందాల మెరుపులతో/
ఆడి మురిపించింది//దేవతలు ప్రతి ఇంట్లో ఉండి
పోయి అలరించలేరు కదా.పిల్లల రూపంలో కొలువై ఉంటారు.వాళ్ళ చూపులు,ఊసులు,
నడకలు,మాటలు గమనిస్తే ఎన్నెన్నో మేలిమి
భావాలు కవులకు కలుగుతాయి. పూలకానుక
గేయం 2013 ఆగష్టు భక్తి సమాచారం లో వచ్చింది. పిల్లల మీదే మరో గేయం"అల్లిబిల్లి పాపాయి"!//కిలకిల నవ్వులు నవ్వును లెండి/
జిలిబిలి పలుకులు పలుకును లెండి/గడసరి
చూపులు చూస్తుందండీ//అల్లరి పనులకు అంతే
లేదు/గడుసు మాటలకు లెక్కే లేదు/ఎంత చెప్పినా ఏమి చేసినా/చిలిపి పనులను మానదు
లెండి//మాటల్లోన మంత్రమున్నదో/చేతల్లోన మాయ ఉన్నదో/ఎవరూ ఏమీ అనలేరండీ/
పైగా పాపను మెచ్చెదరండి//అల్లీబిల్లీ అమ్మాయంండి/అల్లరి బాగా చేస్తుందండి/అమ్మతొ మారాం చేయును లెండి/నాన్నకు ముద్దులు ఇచ్చును లెండి// ఈ గేయం 2013
ఆగస్టు 9 వార్త పత్రికలో వచ్చింది.(సశేషం)