ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
179.ఆకతాయి చెలిమి:బెలగాం భీమేశ్వరరావు-9989537835.
November 10, 2020 • T. VEDANTA SURY • Memories

నీ స్నేహితులను చూసి నీవెటువంటివాడివో
చెప్పొచ్చంటారు అనుభవజ్ఞులు!అలాగే మంచి
స్నేహితులతో తిరిగితే మంచి అబ్బుతుంది.చెడు
స్నేహితులతో తిరిగితే చెడు గుణాలలవడతాయి.
ఆకతాయిలతో తిరిగితే మంచి వాళ్ళు కూడా
ఆపదల పాలవుతారు.ఆకతాయిలతో స్నేహం
ఆపదలను కోరి తెచ్చుకోవడమే.ఆకతాయిలకు
ఆలోచన తక్కువ.ఎంత సేపూ వాళ్లు అల్లరిలో
ఆనందమే చూస్తారు.ఆపదను పసిగట్టరు.అందుకే
పిల్లలకు ఎవరితో స్నేహం చేయకూడదో చెప్పాలి.
ఈ అంశంతో "కూడని చెలిమి"గేయకథ రాశాను.
//దట్టమైన అడవి లోన/తల్లి లేడి ఒకటి కలదు/
కోతి తోడ తనదు కూన/చెలిమి చేయ తల్లి చూచె//ఆకతాయి కోతి వలన/చిక్కులలో పడగలవని/కోతి చెలిమి వదలమనుచు/కూనకు ఆ తల్లి చెప్పె//తల్లి మాట వినక కూన/కోతి జట్టు
విడువ లేదు/ప్రతిదినమును కారడవికి/వెళ్ళి
వచ్చు చుండె పిల్ల//ఒక రోజున వేటగాడు/అడవిలోన తిరుగుచుండ/కొమ్మనున్న కోతి చూచి/వేటగాడి పైకి దూకె//బెదరిపోయి వేటగాడు/దబ్బున పడి లేచి చూడ/పరుగుతీయు
కోతి చెంత/ లేడిపిల్ల కనిపించెను//వేటగాడు 
కోతినొదిలి/లేడి వెంట పరుగు తీసె/లేడి కూన
భయము చెంది/వేవేగము దౌడు తీసె//వేటగాడి
కన్ను కప్పి/అచటనున్న గుట్ట ఎక్కి/బండ మాటు
దాగె నంత/లేడిపిల్ల సాహసించి//వేటగాడు గుట్ట
దరిన/పొదలన్ని వెతకి వెతకి/లేడికూన కాన రాక/
విసిగిచెంది వెడలిపోయె//ఆకతాయి కోతి వచ్చి/
లేడికూన చెంత చేర/బెదరి ఉన్న లేడికూన/కోతి
తోడ ఇట్లు పలికె//"చాలు చాలు నీదు జట్టు/నేటి
నుండి రద్దు రద్దు/నీ వల్లన నా ప్రాణం/అపాయమున పడ్డదిగా"//కోతినొదిలి లేడికూన/
తల్లి దరికి చేరిపోయె/నాటి నుండి చెలిమి చేయ/
మంచివారి నెంచ సాగె//... బాధపడితే గాని
బోధపడదుగదా!అదే లేడిపిల్ల విషయంలో జరిగింది.(సశేషం)