ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
185.బుజ్జి బుజ్జి బుడుగు పాటలు:బెలగాం భీమేశ్వరరావు,9989537835.
November 16, 2020 • T. VEDANTA SURY • Memories

చిన్న పిల్లలు చదువుకొని ఆనందించడానికి
బుల్లి బుల్లి గేయాలు రాయడానికి ప్రయత్నించాను.ఆ ప్రయత్న ఫలితమే బుడుగు
పాటలు.కొన్ని బుడుగు పాటలు ఈ రోజున
ముచ్చటిస్తాను.శీర్షిక:అమ్మ!//అమ్మా అని అనగానే/అలసటంత పోవును/అమ్మ లోని
అక్షరాలు/అమృతమును చిలుకును//
శీర్షిక:చినుకు!//చల్లగాలి వీచింది/నల్లమబ్బు
కరిగింది/చినుకు చినుకు రాలింది/మనకు సేద
తీర్చింది//శీర్షిక:బహుమతి!//పిల్లీ పిల్లీ రావే/
ఎలుకను పట్టీ పోవే/ఎలుక బెడద పోతే/గిన్నెడు
పాలు నీవే//శీర్షిక:హాయ్!//కావ్ కావ్ కాకి/
మ్యావ్ మ్యావ్ పిల్లి/క్యార్ క్యార్ చెల్లికి/హాయ్ హాయ్ చెప్పె//శీర్షిక:చెల్లి - పిన్ని//చిట్టి చెల్లి
నవ్విన/మందారం కనబడును/ముద్దు పిన్ని
నవ్విన/మల్లెమొగ్గలగపడును//శీర్షిక: పాపం బావ
//బావగారు వచ్చారు/పాలకోవ తెచ్చారు/
అందరికీ పంచారు/అక్కకేమొ మరిచారు//
శీర్షిక:కోట!//కొండ మీద కోట/కోట లోన పీట/
పీట కింద మీట/మీట నొక్క పాట//శీర్షిక:అట్లు!
//వేడి వేడి అట్లు/వెన్న పూస అట్లు/నాలుకపై
వేయగానే/కరిగిపోయే అట్లు//శీర్షిక:అవ్వ - గవ్వ
//లేగదూడ మెడలోన మువ్వ ఉన్నది/చిట్టి చెల్లి
పొట్ట లోన బువ్వ ఉన్నది/తాతగారి పక్కనేమొ
అవ్వ ఉన్నది/అవ్వ చేతిలో ఐదు గవ్వలున్నవి//
శీర్షిక:అడవి - నది//అడవి అమ్మ వంటిది/నదులు
నాన్న వంటివి/అమ్మ లాగ నాన్న లాగ//ఆదుకొనును మననవి//ఈ గేయాలు 2014 మే
నెల భక్తి సమాచారం లో వచ్చాయి.(సశేషం)