ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
188.గేయ పరిమళం::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
November 19, 2020 • T. VEDANTA SURY • Memories

పూలతోటకు వెళ్తే కనులకు, మనసుకు ఎంత 
హాయో!పిల్లలకది చెప్పడానికి"హాయి హాయి"
గేయం రాశాను.//సిరిమల్లెలు పరిమళించె/బొండు
మల్లె పలుకరించె/చేమంతులు విరగబూసె/గులాబీలు గుబాళించె/సన్నజాజి తీగె ఊగె/
సంపెంగలు తావి జిమ్మె/తోట మధ్య కాసారం/
పద్మాలకు ఆవాసం/మెరిసిపడే తళుకుదనం/
ఆకట్టే సౌందర్యం/బలే బలే ఆనందం/ఎటు చూచిన ఆహ్లాదం//ఈ గేయం 2014 మార్చి
భక్తి సమాచారం లో వచ్చింది.ఉమ్మడి కుటుంబం
లోని అమ్మ , నాన్న , అత్త , బాబాయి , తాత , 
నాన్నమ్మ పదాలను పరిచయం చెయ్యడానికి
"ఉమ్మడి కుటుంబం" గేయం రాశాను.//అమ్మ
చేతి గోరుముద్ద/అదే మాకు వెన్నముద్ద//నాన్న
తెచ్చు తాయిలాలు/మాకు మంచి మిఠాయీలు//
అత్త చేయు గారాబం/మాకు నేర్పుననురాగం//
బాబాయి చేయు పనులు/మాకు తెచ్చు నుత్సాహం//తాతయ్యతో షికారు/మాకిచ్చును
హుషారు//నాన్నమ్మతో ఊసులు/మాకు మంచి
నీతులు//మమతలున్న కుటుంబం/మా మంచి
కుటుంబం//అందరును మెచ్చినట్టి/మా ఉమ్మడి
కుటుంబం// ఈ గేయం 2014 మార్చి 5 వార్త
దినపత్రికలో వచ్చింది. మబ్బుల్లో దాగిన చందమామను పిల్లలు పిలిచే తీరును"వెన్నెల్లో
ముచ్చట్లు"గేయంలో చెప్పాను.//మబ్బుల్లో దాగిన/ఓ చందమామా!/ మబ్బు విడిచీ నీవు/బయటకూ రావా!//కొబ్బరాకుల నడుమ/ఓ చందమామా!/వెండి వెన్నెల నిచ్చి/మురిపించ రావా!//తారకల మధ్యలో/ఓ చందమామా!/మా మంచి మామవుగ/మా దరికి రావా!//నీ వెలుగులో మేము/బోనము చేయుదుము!/నీకు కూడా కొంత/మేముంచుతాము//మా బుజ్జి తమ్ముడిని/లాలించ రావా!/గారాల తమ్మునకు/జోకొట్టి పోవా!//ఈ గేయం 2014 జూన్ మొలకలో
వచ్చింది.(సశేషం)