ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
190.ఆరోగ్య రాజ్యం రావాలంటే: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.
November 21, 2020 • T. VEDANTA SURY • Memories

:
సమస్య వచ్చినప్పుడు మూలం తెలుసుకొని
వేళ్ళతో పెకలించాలి.అప్పుడే సమస్య సమసి
పోతోంది. అలా చేయనపుడు మనమెంత వ్యయ
ప్రయాసలు పడినా సమస్య అలాగే ఉండిపోతోంది.ఈ ధర్మ సూక్ష్మం పిల్లలకు
అవగాహన పరచడానికే "జబ్బుకు తగిన మందు"
కథ రాశాను.ఇక కథలోకి వెళ్తే...విజయనగర
రాజ్యాన్ని వీరగజపతి పరిపాలిస్తున్న రోజులు!
కళలకు కాణాచిగా విద్యలకు నిలయంగా 
భారతీయ సంస్కృతిక కేంద్రంగా ఆరోగ్యానికి
నెలవుగా విజయనగర రాజ్యాన్ని తీర్చిదిద్దాలని
వీరగజపతి ఆకాంక్ష. అందుకు తగిన విధంగా అతడు నిష్ణాతుల సేవలను ఉపయోగించి రాజ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయసాగాడు.రాజ్యం తను ఊహించిన రీతిలో
ముందడుగు వెయ్యలేదు. కళలు, విద్యలు, సంస్కృతి కొంత విలసిల్లినా రాజ్యాన్ని ఆరోగ్య
నిలయంగా మార్చాలన్న అతని అభిలాష 
నెరవేరలేదు. ప్రజలు రోగాలు రొష్టులతో ఈసురో
మని కనిపించడం మహారాజుకు బాధనిపించింది.
దేశవిదేశాల నుంచి ఘనాపాటి వైద్యులను రప్పించాడు.ప్రజలకు వైద్య సేవలందించాడు.
అయినా పరిస్థితి మారలేదు. వీరగజపతి చాలా
కలతపడ్డాడు.ఆరోగ్య రంగానికి నిధులు ఎక్కువ
కేటాయించడంతో మిగిలిన రంగాలు కుంటుపడ్డాయి.ప్రజల ఆరోగ్యం కూడా కుదుట
పడలేదు. మహారాజు ఆందోళన పడ్డాడు.
పరిష్కార మార్గం సూచించమని పెద్దలను కోరాడు.పెద్దలు సూచించినవన్నీ పరిశీలనలో
అమలవుతున్నట్టుగానే తేలాయి.ఏం చేయాలో
మహారాజుకు తోచలేదు.అతనికప్పుడు రామ
తీర్థాలు కొండ మీద ప్రకృతి వైద్యం చేస్తున్న
నరహరివర్మ గుర్తుకొచ్చాడు.అతడు వందేళ్లు
పైబడి జీవించి ఉన్న అపరధన్వంతుడు.ఆయనను
కలవడానికి రామతీర్థాలు వెళ్లి రోగాలు గూర్చి
చెప్పి నివారణోపాయం అడిగాడు. నరహరివర్మ
కలతతో ఉన్న మహారాజును చూసి," రాజా!రాజ్యం లో ఆహారదినుసులు కల్తీ అవుతున్నాయి.
ప్రాణాలు నిలపవలసిన మందులు కూడా కల్తీ అవుతున్నాయి.వ్యాపారులకు లాభార్జనే ధ్యేయమయింది. కల్తీకి తోడు మత్తుపదార్ధాలు పౌరులకు అందుబాటులోకి వచ్చాయి.కల్తీ,
మత్తుమందులు రెండూ సంఘవినాశనానికి
హేతువులే!ఆ రెండిటిని కట్టడి చెయ్యకుండా
మీరెంత ఖర్చు పెట్టినా రోగాలంతరించవు. ప్రభువులు కఠిన చట్టాలు చేసి చట్టాలమలయ్యేలా
చూడాలి.అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది.
ప్రభువుల ఉదాసీనత వల్ల రాజ్యం బలహీనమవు
తుంది"అని హెచ్చరించాడు.నరహరివర్మ మాటలు
నిజమేనని తోచాయి వీరగజపతికి!నరహరివర్మకు
కృతజ్ఞతలు చెప్పి తిరుగుముఖం పట్టాడు. కల్తీ
చేసేవారిని కఠినంగా శిక్షించాడు.మత్తు పదార్థాలు
సరఫరా చేసేవారికి జీవితశిక్ష విధించాడు.అచిరకాలంలోనే కల్తీ, మత్తుపదార్థాలు
రాజ్యంలో మాయమయ్యాయి.ప్రజల ఆరోగ్యాలు
కుదుటపడ్డాయి.దృఢకాయులయ్యారు.ఆరోగ్యం 
గురించి చేసే ఖర్చులు గణనీయంగా తగ్గిపోయాయి. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకుపోగలిగాయి.రాజ్యం సర్వతో
ముఖాభివృద్ధిని సాధించగలిగింది.రాజ్యానికి
పట్టిన చీడ తొలగినందుకు మహారాజు చాలా
ఆనందించాడు. ఇదీ కథ.ఈ కథ 2014 ఫిబ్రవరి
మొలక పత్రికలో వచ్చింది.(సశేషం)