ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
3. ధృతి: డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
August 26, 2020 • T. VEDANTA SURY • Story

‘‘పరిసరాలు, కుటుంబం మనిషిని తీర్చిదిద్దుతవి. మంచి స్వభావం, ధర్మం, ధ్యానం, ధృతి, దయ, సత్యం లాంటి ఉన్నత గుణాలు గల పౌరునిగా తయారు చేస్తవి.’’ ఉన్నట్టుండి అన్నాడు బుంగి.
‘‘అలాంటి వారు ఎవరో చెప’’ ఎప్పటి లాగే అన్నాను. 
‘‘తన తల్లితో చిన్నపడు కూలికి వెళ్ళి పని విలువ తెలుసుకున్నడు. అమ్మమ్మ, నాయనమ్మలు చనిపోయేంత వరకు పనిచేయడం చూసి మరవకుండా ఉద్యోగ ధర్మాన్ని పూర్తి చేసిండు. అష్టకష్టాలు పడి కుటుంబాన్ని రేవుకు తెచ్చిన తండ్రిని తలచుకుంటూ నిజాయితీగా బతికిండు. అందుకే ఆదాయం వచ్చే కొలువును వదిలి పంతులు నౌకరి చేసిండు. పేదరికం అందించిన అనుభవంతో అనారోగ్యాన్ని, అడ్డుగోడల్ని అధిగమించిండు. చదువుకునే రోజుల్లో ‘‘కరువు మెస్’’ లో గడపడం వల్ల కఠోర క్రమశిక్షణ అలవడింది. రంగు రంగుల సాహితీ రంగం నుండి తెల్లరంగును స్వీకరించిండు. కనుకనే తన పిల్లలకు, బడిపిల్లలకు మార్గదర్శి కాగలిగిండు. చమత్కారాలతో తెలుగు సారు అనిపించుకున్నడు. మొత్తంగా ఉత్తమ పౌరుడిగా మిగిలిండు.’’
‘‘ఎవరి గురించి నీవు చెప్పేది’’
‘‘మంచి హరిదాసు గురించి’’
సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్న ధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండస
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా
నారాయణ శతకం
బమ్మెర పోతన