ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
4. సిరి: - డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
August 28, 2020 • T. VEDANTA SURY • Story

నేను వెళ్ళేసరికి నలుగుర్ని వెంటేసుకుని బుంగి బయల్దేరుతున్నడు.
‘‘ఎటుపోతున్నరు’’
‘‘నాతోరా’’
మాట్లాడకుండా వారితో కలిసి వెళ్ళిన అందరం కలిసి వలసవెళ్ళి వచ్చిన ఒకరింటికి వెళ్ళినం. కుశల ప్రశ్నలయ్యాక అతడు తన గురించి చెప్పడం మొదలు పెట్టిండు.
వర్షాలు పడక దిగుబడి లేకపోవడంతో అపల పాలయ్యాను. పంటల కోసం తెచ్చిన పెట్టుబడి తీర్చడానికి దుబాయి బాట పట్టిన. దుబాయికి వెళ్ళడానికి కూడా అపలు చేయాల్సి వచ్చింది. అక్కడ ఉదయం నాలుగు నుండి రాత్రి పన్నెండు వరకు పనిచేస్తే నెలకు 12,000/- రూపాయల జీతం ఇచ్చారు. కష్టం బాగైనా పెట్టుబడి లేని సంపాదన కదాని అనుకున్నా ఖర్చులు పోగా 000/- రూపాయలు ఇంటికి పంపిన. ఏండ్లు గడిచినయి. అపలు మిగిలినయి. బలం కరిగింది. మనసు ఇంటికి మళ్ళింది. అట్లా వచ్చిన.
‘‘మరి అపలు అట్లనే ఉన్నయా’’ అని అడిగిన.
అక్కడ చేసిన కష్టంల ముప్పావు వంతు ఇక్కడ చేస్తే అప తీర్చవచ్చనిపించి బొప్పాయి, మామిడి తోటలు పెట్టిన రెండు సంవత్సరాలు ఓపికగా వాటిని పెంచి పెద్దచేసి అమ్మిన లాభాలు వచ్చినయి. సిరిపెరిగింది. అని ఒక నవ్వు నవ్విండు.

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ
సుమతి శతకం
బద్దెన