ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
5. నొవ్వక- డాక్టర్ . బి. వి. ఎన్ స్వామి
September 25, 2020 • T. VEDANTA SURY • Story


రెండు సభలు జరుగుతున్నవి ఎక్కడెక్కడతూర్పు పడమరల్లోఎందుకు
రైతు ఆత్మహత్యలకు సంఘీభావంగానిర్వాహకులెవరు
కుడి, ఎడమల వారు
పేరు భలేగుందే
వాళ్ళ సభలు కూడా అలానే ఉంటవి
మరి నీ వెటుపోతున్నవు
రెండు సభలకు పోతున్న
రెండు ఒకే సమయానికి ఉన్నవా
అవును
ఎట్ల వెళ్ళుతవు
కారులో
ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా...?
మొదటి గంట ఒక చోట, రెండో గంట మరో చోట
అట్ల వెళ్ళడం వల్ల లాభం ఏంటి?
లాభ, నష్టాల పట్టింపు నాకెందుకు
నీకు దేనితో సంబంధం
నొవ్వించని సభలతో నాకు సంబంధం - అంటూ నవ్విండు బుంగి.
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి,యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు, ధన్యుడు సుమతీ
సుమతి శతకం
బద్దెన