ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
67. బొర్రాగుహలు ప్రయాణం (రెండవ భాగం)--మధ్యాహ్నం భోజనాలయ్యాక కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాం.చిన్న కునుకు పట్టింది. విసురుగా గాలి ఒంటికి తాకడంతో మెలకువ వచ్చింది. లేచి పరిసరాలు చూశాను. మేఘాలు వీధిలో నుంచి పోతున్నాయి.ఆ వింత చూడడానికి ఇంటి బయటకు వచ్చాను. ఎదురుగా కనిపిస్తున్న కొండలు మీద , చెట్ల మీద మేఘాలు ముసురు కున్నాయి.అంతెందుకు ఎదురువాసలో ఇళ్ళుస్పష్టంగా కనిపించలేదు. మేఘాల తెరలు కప్పేశాయి.అంతలో పిల్లలు "భలే! ఇంట్లోకి మేఘాలు వచ్చేశాయి!"అని అరిచారు.వెనుతిరిగిచూశాను. పెరడు గుమ్మం నుంచి మేఘాలు ఇంట్లోకి వచ్చి వీధిలోకి పోతున్నాయి.అవన్నీ మధురానుభూతులే!అందుకే ఈ ప్రాంతాన్ని ఆంధ్రా ఊటీ అని అంటారనుకున్నాను!చూస్తుండగానే దబ దబ వర్షం పది నిమిషాలు పాటు పడింది! కొద్ది సేపటి లోనే ఎండ భళ్ళున కాసింది!వర్షం పడే ఆనవాలు మరి కనిపించలేదు! పరిసరాలు పొడి బారి పోయాయి!సాయంత్రం టీ తాగేక అలా ఊరిబయటకు నేను మా బావమర్దులు వెళ్ళాం! మాతో మా అబ్బాయి వెంటపడ్డాడు!ఊరికి దగ్గర లోనే చిన్న సెలయేరు! గల గల పారుతుంది ! దగ్గరకు వెళ్ళాం!"ఆ ఒడ్డునే ప్రేమకానుక సినిమా షూటింగ్అ యింది!ఈ వాగులో కూడా షూటింగ్ జరిగింది!" అని నాగభూషణం బావ గారు చెబుతున్నారు అంతలో ప్రదీప్ చేప పిల్లలు అని కేకేశాడు! ప్రదీప్ చూస్తున్న వైపు చూశాం!బోలెడు చేపలు ఈదుకుంటూ వెళ్తున్నాయి!ప్రదీప్ ను ఆపలేకపోయాం! వాగు లోతుగా లేదు!వాగులో దిగి కాస్సేపు చేప పిల్లలతో ఆడుకున్నాడు! ప్రకృతి ఆస్వాదనయ్యాక ఇంటి ముఖం పట్టేం! రాత్రి చల్లదనం మరీ ఎక్కువయింది!ఎండుపుల్లల మంట కాచి నిద్ర పోయాం! తెల్లవారింది!ఉదయం9 లోపే బొర్రాగుహలు చూడడానికి బయలుదేరాం!మౌళీబావ గారు, నాగభూషణంబావ గారు ఐదుసెల్సులుండే టార్చిలైట్లు పట్టుకున్నారు!అవెందుకని అడిగాను!నవ్వుతూ వీటి అవసరంఉంటుంది అన్నారు! పావుగంటలో గుహలుచేరుకున్నాం! పెద్ద రాకాసి నోరులా గుహ ముందుభాగం కనిపించింది! లోపల అడుగు పెట్టాం!పెద్దహాలులా ఉందక్కడ! బండ రాళ్ళు అక్కడక్కడఉన్నాయి! వాటి మీద సుద్దతో రాసిన పేర్లున్నాయి!అవి సందర్శకులు సరదాగా రాసుకున్న వాళ్ళ పేర్లు! అక్కడ నుంచి మరి కొద్ది దూరం వెళ్ళాం బావగారూ పైకి చూడండి అన్నారు మా బావగారు! మీదకు చూస్తే పెద్దరంధ్రం! దాని నుంచి వెలుగు రేఖలుకింద పడుతున్నాయి! ఆ వెలుగులో చుట్టుపక్కల చూశాం! గుహ పార్శ్వాల మీద రక రకాల ఆకారాలు కనిపించాయి! ఇంకా ముందుకు వెళ్ళాం! కటిక చీకటి! మా ముందుండే వాళ్ళకి కాగడా వెలుగులో గైడుఏవేవో చూపిస్తున్నాడు!అప్పుడు మాకుబేటరీ లైట్లు అవసరం వచ్చింది!ఆ వెలుతురులో మెట్లు కనిపించాయి!టార్చి లైట్ వెలుగులో మెట్లెక్కిమీదకు చేరాం!అక్కడ గుడి ఆకారంలోచిన్న గుహ!అందులో సహజంగా ఏర్పడిన శివలింగం!శివలింగం ముందు దీపం పెట్టి ఒక పూజారి పూజచేస్తున్నాడు!ఆ మీద నుంచి చూస్తే చుట్టూ భయం పుట్టించే చీకటి! టార్చిలైట్ సహాయం తో కిందకు వచ్చాం!అక్కడ నుంచి గబ్బిలాల గుహకు వెళ్ళాం! పెద్ద హాలు! ఎన్నోగబ్బిలాలు!మా అలికిడికి అవి ఎగిరాయి! పెద్ద చప్పుడు వినిపించింది!భయంతో చెవులు మూసుకున్నాం! అక్కడ నుంచి ముందుకువెళ్తే గుహ పార్శ్వాల మీద ఒక చోట మునీశ్వరునిగడ్డం ఆకారం ఇంకో చోట మొసలి ఆకారం మానవమెదడు ఆకారం ఇలాంటి ఆకారాలెన్నో చూశాం!అవేవీ మానవ నిర్మితాలు కావు! కాల్షియంబైకార్బొనేట్ ఇతర ఖనిజాలు కలిగి వున్న నీరు కారుతూ ఘనీభవించడం వల్ల అటువంటి ఆకారాలు ఏర్పడ్డాయట!ఆ ఖనిజ నీరుఇంకా కారుతూనే ఉంది!కొత్త కొత్త ఆకారాలుతయారవుతూనే ఉంటాయి!ప్రకృతి చేసిన అద్భుత సృష్టి ఆ బొర్రాగుహలు! 1807సం.లోబ్రిటీష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ అనేఆయన ఆ గుహలను కనుగొన్నాడట!అవి 10లక్షల సంవత్సరాలు కిందట ఏర్పడినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు!గుహ లోపలచాలా దూరం వరకు వెళ్ళాం!ఒక దగ్గర మనిషిదూరే సందు మాత్రమే వుంది!ఆ సందు నుంచివెళ్తే గోస్తనీ నదీతీరం వస్తాదని చెప్పారు! ఆ పరిసరాలన్నీ అందం అద్భుతం కలబోసిన దృశ్యాల మయం! నాలో ఉన్న కవి మనస్సులోఅవన్నీ నిక్షిప్తమయ్యాయి! నేను రాయబోయేరచనలకు సరంజామా బాగానే దొరికిందక్కడ!అక్కడున్న వారం రోజులు ఆ చుట్టుపక్కలవిశేషాలు చూశాను! ఒకరోజు అరకులోయకూడా చూసి వచ్చాను! మొత్తానికి బొర్రాగుహలుప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు మూటకట్టు కొని పార్వతీపురం చేరుకున్నాం!(సశేషం)--బెలగాం భీమేశ్వరరావు9989537835
July 24, 2020 • T. VEDANTA SURY • Memories