ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
68. ఉపద్రవం తెచ్చుకోకండి!:--1987లో గురుతుల్యులు శ్రీ రెడ్డి రాఘవయ్య గారి వద్ద నుంచి ఒక ఉత్త‌రమందింది.ఫిక్షన్ కథల సంకల నానికి 12 పేజీలకు మించని బాలలకథ పంపించండని కోరారు. పర్యావరణానికి సంబంధించినదైతే బాగుంటుందని కూడా సూచించారు. అప్పటికి నేను చెట్లు మీద, పక్షులు మీద, క్రూర మృగాల మీద, సర్పాల మీద ఫిక్షన్ లు రాశాను.ఇప్పుడు దేని మీద రాయాలి?ఆలోచన లో పడ్డాను.రకరకాల అంశాలు నా కళ్ళ ముందుకదిలాయి!చిన్న కథ ఉండ కూడదు!పెద్ద కథే ఉండాలి!కనీసం 10 పేజీలయినా ఉండాలి!ఆ ఆలోచనల మధ్య పర్వతాలు గుర్తొచ్చాయి! కాగితాలు ముందు పెట్టుకుని రాయడం ప్రారంభించాను! కథ సంక్షిప్తంగా..... అది క్రీ.శ.2050 సంవత్సరం! భారతదేశం అపూర్వ విజయాలను సాధించింది!పెట్రోల్ వాడకం తగ్గించి వాయుశక్తితో ప్రయాణ సాధనాలు నడిపే వ్యవస్థను తీసుకు రాగలిగింది! సౌరశక్తితో కర్మాగారాలు పనిచేస్తున్నాయి!ఇన్ని విజయాలు సాధించినప్పటికి పాత తరాలు చేసే అడవుల విధ్వంసంవల్ల వరదల తాకిడి భారతదేశంలో ఎక్కువయింది. ధన నష్టం జన నష్టం నియంత్రణకష్టమయింది.ఆ సమస్యకు పరిష్కారం చూపమనిభారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.ఆకమిటీ నదీతీరాలు బలహీనపడ్డాయని యుద్ధప్రాతిపదికపై రాళ్లతో నదీతీరాలను దృఢపరచాలని తెలిపింది! ఆ బృహత్కార్యానికిప్రయోగాత్మకంగా వంశధార నదిని ఎంపిక చేసిప్రఖ్యాత అణుశక్తి శాస్త్రజ్ఞుడు డాక్టర్ హరిప్రకాష్ కిఆ బాధ్యతను అప్పజెప్పేరు.వంశధార నదీతీరాలను గట్టి పరచడానికి ఆ ప్రాంతంలో వున్న లక్ష్మీపురం కొండలను ఎంచాడు డా.హరిప్రకాష్! అణుశక్తిని ఉపయోగించి కొండలలోని బండలను ఘనపు మీటర్ల ముక్కలుగావిడగొట్టాలని ఆ ముక్కలు తో నదీతీరాలనుగట్టి పరచాలని ప్రణాళిక వేసుకున్నాడు ఆయన!ఆ రాత్రి హఠాత్తుగా ఆకాశం నుంచి నాశనమవకండి!నాశనమవకండి!! అని హెచ్చరికవినిపించింది!ఆకాశం లోకి చూస్తే ఎవరూకనిపించరు! కాని ఆ మాటలు పదే పదే వినిపిస్తున్నాయి!కొంత సేపు గడిచాక ఆ మాటలుఆగాయి! భారత దేశాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి ఇదో రకమైన విదేశీ కుట్ర అని భావించాడు హరిప్రకాష్!విషయం పై అధికారులకుతెలియపరచి రేపటి కార్యక్రమం గురించి ఆలోచనలో పడ్డాడు!మళ్లీ అర్థరాత్రి ఆ మాటలు వినిపించాయి!ఈసారి హరిప్రకాష్ ఎవరు మీరుఅని వైర్ లెస్ సెట్లో అడుగుతాడు. అప్పుడు అవతలి నుంచి "మేము గ్రహాంతర వాసులం! మీకు మేలు చేసే వారమే! మా ప్రతినిధిని మీదగ్గరకు పంపుతున్నాం! అతడితో మాట్లాడివిషయం తెలుసుకోండి!"అని సమాధానం వచ్చింది. ఆ సంభాషణ జరిగిన కొద్ది సేపటికిఒక ఆకాశ నౌక భూమి మీద దిగింది! ఆ నౌకనుంచి నాలుగు చేతులున్న ఒక మనిషి లాంటి ఆకారం దిగింది! ఏ దేవుడో దిగి వచ్చాడనిఅందరూ చేతులెత్తి మొక్కేరు! అప్పుడు ఆ ఆకారం " నేనేమీ దేవుణ్ణి కాను! మీ లాంటి జీవినే! కొన్ని యుగాల కిందట మా వాళ్లు ఈ భూమి మీదేఉండేవారట! భూమి మీద హఠాత్తుగా జరిగిన వాతావరణం మార్పులు వల్ల మా వాళ్ళిక్కడ ఉండలేక పోయారు! మాకు సరిపోయే గ్రహం వెతికి అక్కడకు చేరుకున్నారు! మీరు పర్వతాలుముక్క ముక్కలుగా చేస్తున్నారన్న విషయం మాకు తెలిసింది! మా గ్రహం లో ఆ పొరపాటు చేసిఎన్నో అన‌ర్ధాలు తెచ్చుకున్నాం! అందుకే మా వాళ్ళు మీ వద్దకు పంపించారు ఆ పని ఆపడానికి!పర్వతాలు లేకుండా చేస్తే వాతావరణ మార్పులెన్నో చోటు చేసుకుంటాయి!ఉపద్రవాలుసంభవిస్తాయి!మా అనుభవం మీద మీకు చెబుతున్నాం!ఇవన్నీ మా కెలా తెలిసాయని అనుకుంటున్నారా?! మా గ్రహం నుంచి వచ్చే ఎగిరే పళ్ళేలు మాకు మీ విషయాలన్నీ చేరుస్తూఉంటాయి!మీరు ఈ భూమి మీద బాగుండాలనేమా తాపత్రయం! నేనింకా ఎక్కువ సేపుండలేను!"అని ఆకాశ నౌక ఎక్కి మాయమవుతుంది! ఇదీకథ! ఈ కథ ద్వారా పర్వతాలు,కొండలు మన మనుగడకు ఎలా ఉపయోగపడతాయో చెప్పడం లక్ష్యంగా పెట్టుకున్నాను!కథ తయారు చేసి రెడ్డి రాఘవయ్య గారికి పంపేను. రాఘవయ్యగారు అనుకున్నట్టు సంకలనం తీసుకురాలేక పోయారు!అప్పుడు బాలరంజనికి హెచ్చరిక పేరుతో కథను పంపేను.1989 ఏప్రిల్ సంచికలోవచ్చింది.(సశేషం)--బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 25, 2020 • T. VEDANTA SURY • Memories