ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
70 . పొట్టి వాడు గట్టి వాడే (రెండవ భాగం)వజ్రాల గుహ కథ ఆసక్తికరంగా ప్రారంభమవ్వాలి.ఎలా ఆలోచించి ప్రారంభించాను.రెండు మూడు సార్లు తిరిగి రాస్తే గాని మొదటి పేరా నాకు సంతృప్తి కలగలేదు. ఆ పేరా ఎలా వచ్చిందంటే వజ్రాలగుహను పూర్వం భూతాలగుహ అని పిలిచే వారు.అది భయంకరమైన కీకారణ్యం మధ్య వుంది.ధర్మపురి పట్టణానికి చాలా దూరంలో ఉంది.వాహనాలేవీ అక్కడకువెళ్ళలేవు. వజ్రాలగుహ చూడాలనే సాహసికులకునడకమార్గమొకటే శరణ్యం.మార్గమంతా రాళ్ళమయం.దానికి తోడు దట్టమైన చెట్లు, బలిసిన అడవి తీగెలు, క్రూరమృగాలు, ప్రాణాలు తీసేవిష సర్పాలు.ప్రయాణం లో రెండు వరుసల పర్వతాలు దాటాలి.చిన్నా పెద్ద వాగులుంటాయి.వాగులను ఒడుపు చూసుకుని దాటాలి. తొందరపడితే దొంగ వాగుల్లో దుర్మరణం తప్పదు.ధర్మపురిప్రజలకు వజ్రాలగుహ అంటే భయం.ఆ గుహలోభూత ప్రేత పిశాచి గణాలుంటాయని వాళ్ళ నమ్మకం.కారణంవజ్రాలగుహకు వెళ్ళే వారెవరూ తిరిగి రాలేదు..ఆ తరువాత అసలు కథప్రారంభించాను.ఇక సంక్షిప్తంగా ఆ కథలోకి వెళ్తే....కిరీటి ఒక మరుగుజ్జు. తల్లీ తండ్రీ లేని అతడిని ఎవరూ లేని ఒక అవ్వ చేరదీసి పెంచింది. లోకులు కాకులు. మరుగుజ్జూ లొట్టెడూ పొట్టోడూ!అని కిరీటిని హేళన చేస్తుండే వారు.ఒక రోజు అవ్వనువాటేసుకొని అవమానాలు నేను భరించలేక పోతున్నాను.చచ్చి పోతానవ్వా.బోరున ఏడ్చాడు కిరీటి.అవ్వ భయపడింది. ప్రేమతో నిమురుతూ ధనం చుట్టూ లోకం తిరుగుతుంది.కష్టపడి ధనం సంపాదించు. నిన్ను గేలిచేస్తున్న వారే అందలమెక్కిస్తారు అని ఊరడించింది.కిరీటిమనస్సు మీద అవ్వ మాటలు పని చేశాయి.సరిగ్గా ఆ సమయం లోనే వజ్రాలగుహలో వజ్రాలున్నాయన్న ప్రచారం ధర్మపురి లో ప్రచారం ఊపందుకుంది.కిరీటి దృష్టి వజ్రాల పై పడింది.వజ్రాల గుహకుప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకుని బయలుదేరుతాడు.మొదటి రోజు పులి బా‌రి నుంచి తప్పించుకుంటాడు.రెండో రోజు దొంగ వాగులోదిగి కొట్టుకుపోతూ వాగు మధ్య వున్న బండరాయిఎక్కి ప్రాణం కాపాడుకుంటాడు.వాగు జోరుతగ్గాక అక్కడ కనిపించిన శివాలయం చేరుకుంటాడు.అప్పటికే చీకటి పడింది. అలసిపోయినకిరీటి శివాలయంలో నిద్ర పోతాడు.తెల్లారింది.లేచి చూచేసరికి కుప్పలా పడి వున్న అస్థిపంజరం కనిపించింది. అక్కడ గోడపై దోపిడీ దొంగలు జయకీర్తి అనే అక్షరాలు రక్తంతో రాసినవికనిపిస్తాయి. జయకీర్తి అనే యువకుడు ఆరు నెలల కిందట జయకీర్తి వజ్రాల కోసం బయలుదేరి దొంగలబారిన పడి చావు తెచ్చుకున్నాడని కిరీటి నిట్టూర్చాడు. ఆ యువకుడి చావుకు వజ్రాలగుహ కు ఏదో సంబంధముందని కిరీటి సందేహిస్తాడు.ఏదో తెలుసుకోవాలన్న పట్టుదల అతడిలోపెరిగింది.మూడో రోజు ప్రయాణం కొనసాగించాడు. చీకట్లు ముసురుతున్న వేళకువజ్రాలగుహ ప్రాంతానికి చేరుకుంటాడు.దూరంనుంచి చూసేసరికి గుహ ముఖ ద్వారం దగ్గరకాగడాలు పట్టుకున్న మనుషులు కనిపించారు.గుహలో ఏదో జరుగుతుందని కిరీటి గ్రహించాడు.గుబురుగా పె‌రిగిన చెట్టెక్కి గుహ వంక చూడసాగాడు. అంతలో గుర్రాల డెక్కల చప్పుడువినిపించింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 27, 2020 • T. VEDANTA SURY • Memories