ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
71. పొట్టి వాడు గట్టి వాడే (మూడవ భాగం)--చెట్టు నుంచి కిరీటి గుహ వైపు చూస్తాడు. కొందరు ముసుగు వీరులు గుహ లోపలకు వెళ్ళడం కనిపించింది. గుహ లోపల ఏం జరుగుతుందోతెలుసుకోవాలన్న కుతూహలం కిరీటిలో ఎక్కువయింది. చెట్టు దిగి గుహ వెనుక వైపు వెళ్తాడు. అక్కడ గుహకు దారి కనిపించలేదు కానిగుహ పై భాగంలో వెలుగు కనిపించింది. పాకురుకుంటూ కిరీటి అక్కడకు వెళతాడు. గుహపై భాగంలో ఒక రంధ్రం చూశాడు. ఆ రంధ్రం నుంచి లోపలకు చూస్తాడు.అక్కడ ఏ వజ్రాలుకనిపించలేదు.కొందరు యువకులు మారణాయుధాలు తయారు చేస్తున్నారు. కొందరుఆ యువకులను తొందరగా పని చేయండని కమ్చీతో కొడుతున్నారు. ముసుగు వీరులు ఒక పక్కననిలబడి ఉన్నారు. అంతలో గుహ నాయకుడు వచ్చాడు. ముసుగు వీరులు ముసుగులు తీశారు.విచిత్రం! ధర్మపురి యువకులందులో ఉన్నారు.ఒకొక్క ముసుగు వీరుడు తెచ్చిన తోలుసంచినినాయకుడు చూస్తున్నాడు. ధనం,బంగారం వుంటే నాయకుడు మరేమీ అనకుండా ముందుకు వెళ్తున్నాడు. అవేవీ లేకపోతే మీ తల్లిదండ్రులు, మీ తోడ బుట్టిన వారు బతకాలని లేదా? ఈసారి డబ్బూ బంగారం తీసుకు రాకపోతే మీ వాళ్ళను నరికి పోగులు పెడతాను అని బెదిరిస్తున్నాడు.అక్కడ పరిస్థితి కిరీటికి అర్థమయింది. యువకులను బందిపోటు దొంగలుగా బలవంతంగామారుస్తున్నట్టు గ్రహించాడు. వజ్రాల గుహ పేరుతో జరుగుతున్న ఘోరాలను అరికట్టాలనుకున్నాడుకిరీటి. గుహ నుంచి దిగిపోయాడు. ధ‌ర్మపు‌రికితిరుగు ప్రయాణమయ్యాడు. క్షేమంగా ధర్మపురిచేరుకున్నాడు. మర్నాడు కిరీటి రాజదర్శనం చేసుకుని ప్రయాణ విశేషాలు చెప్పి వజ్రాలగుహ పేరుతో జరుగుతున్న ఘోరాలు చెబుతాడు.రాజువజ్రాలగుహ వద్దకు సైన్యాన్ని పంపి బందిపోటునాయకుడిని అతని పరివారాన్ని బంధింపజేస్తాడు.ధర్మపురి యువకులను రక్షిస్తాడు. ధరపురి ప్రజలు కిరీటికి జేజేలు పలుకుతారు. ధర్మపురి రాజు రాచమర్యాదలతోకిరీటికి సత్కరించి దివాణంలో మంచి ఉద్యోగమిస్తాడు. అవ్వ , కిరీటి సంతోషిస్తారు. ఇదీ కథ. ఈకథ రాయడానికి శ్రీ ఓలేటి బుచ్చిబాబు గారుఒక ప్రేరణయితే మరో ప్రేరణ మా బొర్రాగుహలుప్రయాణం. అడవి వర్ణనకు,గుహవర్ణనకు బొర్రాగుహలు ప్రయాణం ఉపయోగపడింది.కథను బాలజ్యోతి అనుబంధ నవలల పోటీకిపంపేను. బహుమతి పొందలేదు కాని సాధారణప్రచురణకు అంగీకరించిన మూడిటిలో చోటుచేసుకుంది.1989 జూన్ సంచికలో కథనుప్రచురించారు. నా ఫోటో పరిచయం కూడా వేశారు.ఆ నెల ముఖచిత్రం లో ఒక పక్కనవజ్రాలగుహ అనుబంధ నవల పేరును వేశారు.కథ చదివిన పాఠకులు బాగానే స్పందించారు. ముగ్గురు నా చిరునామాకు ఉత్తరాలుకూడా రాశారు. అందులో ప్రజాశక్తి సత్యాజీ గారుకూడా ఉన్నారు.ఆయనప్పుడు ఉన్నత పాఠశాలవిద్యార్ధి. ఆగష్టు సంచిక పోస్ట్ శీర్షికలో వజ్రాలగుహ గురించి నాలుగు ఉత్తరాలున్నాయి.ఆ కథకు బహుమతి రాకపోయినా బహుమతి పొందినంతఆనందమే కలిగింది. (సశేషం ) బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 28, 2020 • T. VEDANTA SURY • Memories