ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
72. వ్యాస రచన పోటీలో రెండవ బహుమతి:---నేను రాసిన బాలసాహిత్యం - స్వరూపం అనే ఒక చిన్న వ్యాసం 1980 తెలుగు విద్యార్థి లో వచ్చింది.ఆ వ్యాసాన్ని డా. వెలగా వెంకటప్పయ్య గారు తమ పరిశోధనాత్మక గ్రంథం బాలసాహితీవికాసంలో ఉపయుక్త గ్రంథాల సూచికలో ఉటంకించారు.బాలసాహిత్య ప్రయాణం తొలి నాళ్ళలో అది నాకుప్రోత్సాహమే కదా! ఆ వ్యాసం తరువాత జాతీయ పండుగలు ప్రాముఖ్యత అనే వ్యాసం 1981 ఆగస్టు శుభోదయ పత్రికలో వచ్చింది.1982 జూలై తెలుగు విద్యార్థి పత్రికలో తిలక్ కవిత్వం లో యుద్ధ వ్యతిరేకత అనే వ్యాసం వచ్చింది.1990లో జెసిరెట్స్-రాజమండ్రి వారు ఆంధ్ర జ్యోతి వారపత్రిక సహకారం తో వయోజనవిద్య - ఆవశ్యకత అనే అంశంపై రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించారు.ఆ పోటీకి వ్యాసం తయారు చేసిపంపగా రెండవ బహుమతి వచ్చింది. బహుమతులందుకోడానికి రాజమండ్రి లోని దుర్గా కల్యాణ మండపం లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. నేను వెళ్ళలేకపోయాను.పోస్ట్ లో బహుమతి మొత్తాన్నిసర్టిఫికేట్ ను నిర్వాహకులు పంపేరు.వ్యాసాన్ని1991 ఫిబ్రవరి 8 వ తేదీ ఆంధ్ర జ్యోతి వారపత్రికలో ప్రచురించారు. 73. స్నేహం మీద కథలు: 1990లో స్నేహం మీద రెండు కథలొచ్చాయి. సాలూరు అనే ఊర్లో జరిగిన సంఘటన ఒకటి మా చిన్న తనంలో మా నాన్న గారు చెప్పేవారు. ఆ సంఘటన ఒక రోజు గుర్తుకొచ్చింది. డబ్బున్న వారితో సన్నిహితం గా ఉంటే మనం కూడాఆ డబ్బున్న వారి జాబితాకే చెందినట్టు లోకంఅపోహ పడుతుంది. అలాగే అధికారితో స్నేహముంటే చాలు మన వల్ల పనులు చేయించుకో వచ్చని ప్రజలు అపోహ పడతారు. లోగొట్టు పెరుమాళ్ళ కెరుక! ఆ అంశం చెప్పడానికే శ్రీమంతుని స్నేహం కథ తయారు చేశాను. కథ సంక్షిప్తంగా ఏమంటే ... బట్టలు నేసే పద్మనాభయ్య వికటకవి గా ఆ ఊర్లో పేరు పొందాడు.అతడి గొప్పతనం జమీందారు వరకు వెళ్ళింది. రోజూజమీందారు పద్మనాభయ్యను కొలువుకు పిలిచివినోదం పొందే వాడు. కొలువు లో ఉండిపోవడంవల్ల పద్మనాభయ్య చేనేత వృత్తి దెబ్బ తింది.కుటుంబ పోషణ కష్టమయింది. ఎవరిని అప్పుఅడిగినా నీ కేమి జమీందారు స్నేహితుడ వయ్యావు అని తప్పు కొనే వారు.అందరి దృష్టిలోపద్మనాభయ్య ఒక శ్రీమంతుడయ్యాడు. తన ఆర్థిక దుస్థితి లోకానికి తెలియజెయ్యాలను కున్నాడు పద్మనాభయ్య! కొడుకు పుట్టిన రోజుపండగని చెప్పి పద్మనాభయ్య ఊర్లో ప్రముఖులను విందుకు ఆహ్వానించాడు.అందరూ ఏదో ఊహించుకొని మంచి మంచి కానుకలతో విందుకువచ్చారు.పద్మనాభయ్య అందరినీ కూర్చుండబెట్టి పెద్ద విస్తర్లు ముందు వేశాడు.అందులో నాన వేసిన అటుకులిన్ని పడేసి నా తాహతుకు తగిన విందిది.స్వీకరించండి అని కోరాడు.అటుకులు చూసిప్రముఖులు మండిపడ్డారు. కచేరీకి పోయి జమీందారుకు ఫిర్యాదు చేశారు. జమీందారుపద్మనాభయ్యను పిలిపించి ప్రముఖుల తరుపునఅడుగుతాడు.అపుడు పద్మనాభయ్య " మీతోస్నేహం కుదిరిందని నన్ను శ్రీమంతుల జాబితాలో కలిపారు.అవసరానికి అప్పు పుట్టడం గగనమవుతూంది.అందువల్ల లోకానికి నా పరిస్థితి తెలియపరచడానికి ఈ పని చేశాను. ప్రభువులు మన్నించాలి.మీ స్నేహం వల్ల మీ ధనాగారం నుంచినేనెంత లాభపడుతున్నానో మీకు తెలియనిది కాదు!" అని జమీందారుతో మనవి చేసుకున్నాడు.జమీందారుకు కనువిప్పు కలిగింది. ఫిర్యాదుచేయడానికి వచ్చిన వా‌రితో త్వరలోనే పద్మనాభయ్య మీ అందరకు మంచి విందుఏర్పాటు చేస్తాడని చెప్పి పంపివేస్తాడు.అందరూవెళ్ళాక పద్మనాభయ్యతో " నేటి నుంచి నా ఆస్థానకవిగా ఉండు! నెలకు ఐదు వందల వరహాలుపారితోషికం ఏర్పాటు చేస్తాను!" అన్నాడు జమీందారు. తన ప్రయత్నం ఫలించినందుకుపద్మనాభయ్య సంతోషించాడు. కవిత్వం మీదేమనస్సును కేంద్రీకరించి గొప్ప కవిగా పేరు తెచ్చు కున్నాడు. ఈ కథ 1990 డిశంబరు 30 తేదీనఆంధ్రప్రభ దినపత్రిక లో వచ్చింది. మరొక కథ పేరుఅవివేకుల స్నేహం. ఈ కథలో ఒక జింకపిల్ల తల్లిమాట కాదని ఒక తెలివి మాలిన కోతితో స్నేహంచేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది.పిల్లలుమంచీ చెడ్డతెలుసుకోకుండా ఎవరితో పడితేవారితో స్నేహం చేయకూడదు. అవివేకుల తోనుమూర్ఖుల తోను స్నేహం కూడదు.అటువంటి వారివల్ల ఆపదలకు గురి కాగలం అనే సందేశం ఈ కథద్వారా ఇవ్వడానికి ప్రయత్నించాను.1990 డిశంబరు 7 ఆంధ్రజ్యోతి వారపత్రిక లో వచ్చింది.(సశేషం) - బెలగాం భీమేశ్వరరావు పార్వతీపురం
July 29, 2020 • T. VEDANTA SURY • Memories