ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
74.కనిపించని భాగ్యం:ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వీకులుఏనాడో లోకానికి చాటి చెప్పారు. అయినా నేటిమనిషి ఆ విలువైన మాటకు విలువివ్వడు. సంపాదన మీద చూపిన శ్రద్ధ ఆరోగ్యవిషయంలో చూపించడు.తల్లిదండ్రులు మనకిచ్చేశరీరంఅమూల్యం.ప్రకృతి కూడా మన శరీరానికిమేలు చేయడానికి తన బాధ్యతను కొనసాగిస్తూనేఉంటుంది. అయినా లోకం లో అనారోగ్య సమస్యలు పట్టి పీడుస్తూనే ఉన్నాయి. ఆ అనారోగ్య సమస్యలు బాపుకోడానికి మనుషులువ్యయ ప్రయాసలు పడుతూనే ఉంటున్నారు. కిడ్నీదెబ్బతిందని కన్ను దృష్టి తగ్గిందని గుండె బలహీనమయిందని కాలేయం పని తగ్గిందని జీర్ణ వ్యవస్థదారి తప్పిందని ఇలా ఎన్నో ఎన్నో అనారోగ్య సమస్యలు సరిచేయడానికి ఎంత ధనం ఖర్చు చేసినా సంపూర్ణ ఆరోగ్యం మాత్రం మనుషులుపొందలేక పోతున్నారు.ఒక్కొక్క అవయవ మార్పిడికి ఎంతెంత ఖర్చవుతుందో మనం వింటూనే ఉన్నాం.మార్పిడి చేసుకొనే వారుసుఖపడుతున్నారా లేదు.అసలు అసలే. మార్పిడి మార్పిడే.ఎందుకిదంతా చెప్పడమౌతోందంటే ఆరోగ్యవంతుడు కనిపించనిభాగ్యానికి వారసుడు. ఆరోగ్యకరమైన అవయవాలు అమూల్య సంపదలు. ఈ మంచివిషయం పిల్లలకందించాలనే గుప్తభాగ్యం కథనురాశాను.కథ సంక్షిప్తంగా... భాగ్యపురి నగరంలో భాగ్యరాజు,సోమరాజు మిత్రులు. ఇద్దరూ కలిసిపుణ్యక్షేత్రాలకు వెళ్ళారు.తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తూంటే వారికి ఒక గుట్ట మీద దివ్యతేజస్సుతోవెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు.ఇద్దరూ వెళ్లిఆ యోగికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు.ఆ యోగి ఏ కళనున్నాడో ఆ ఇద్దరకు మేలు చేయదలిచాడు."భక్తులారా! ఈ గుట్టకు ఉత్తర దిక్కుగాఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి.తూర్పుదిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యంసమకూరుతుంది.స్నానం చేసే ముందు రెండునియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణంచేసుకోవాలి.ఒకటో నియమం - ఒక సరస్సులోమాత్రమే స్నానం చేయాలి. దురాశతో రెండు సరస్సుల్లో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు.రెండో నియమం - ఇక్కడ నేనున్నానన్న విషయంఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పేరా ఈ వర ఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోతాడు యోగి.అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు. అంతా భగవంతుని లీల అనుకుంటూ గుట్ట దిగారు. భాగ్యరాజు " ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు.ఉత్తర దిక్కు నున్న సరస్సు లో మునుగుదాం రా"అని సోమరాజు తో అన్నాడు. సోమరాజు అప్పుడు " ఆరోగ్యమే మహాభాగ్యం.దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం. తూర్పు దిక్కుకే పోదాం రా" అంటాడుఇద్దరూ ఒక మాటకు రాలేకపోయారు. భాగ్యరాజుఉత్తర సరస్సులోను సోమరాజు తూర్పు సరస్సులోను స్నానం చేసి ఇళ్ళు మొగం పట్టేరు.నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినాఅదృష్టం వరించేది.వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతున్నాయి.అంతా యోగి మహిమని యోగికిమనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.ఇకసోమరాజు విషయానికి వస్తే ఎప్పుడూ మంచం పట్టి మూలుగుతూ వుండే అతడి భార్య ఆరోగ్యంతో కళ కళ లాడి కనిపించింది. పిల్లలు పుష్టిగ తయారయ్యారు. సోమరాజుకు అపుడపుడువచ్చే అనారోగ్యం మాయమయింది. వైద్యులువద్దకు వెళ్ళే అవసరం రాలేదు. సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలచుకున్నాడు.కొంత కాలంగడిచింది. ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. భాగ్యరాజు దిగులుగా కనిపించాడు.ఏమలా ఉన్నావని అడిగాడు సోమరాజు. అప్పుడు భాగ్యరాజు యోగి ఇచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరబడ్డాను.ఆరోగ్యంలేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు.రెండు ముద్దలు తిని అరిగించు కోలేకపోతున్నాను.జిహ్వచాపల్యాన్ని బలవంతంగా అణచుకుంటున్నాను.ఇంట్లో ఎవరికో ఒకరికిఅనారోగ్యం ఉంటూనే ఉంది. సంపాదనంతావైద్యానికే సరిపోతుంది. సుఖశాంతులు లేవు.ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా వుంటుంది మిత్రమా? " అని బాధపడ్డాడు. సోమరాజు నుపట్టుకుని ఏడ్చాడు. సోమరాజు అప్పుడు "సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడానికిప్రయత్నించు. దిగులు పడితే ప్రయోజనం లేదు."అని మిత్రుడిని ఓదార్చాడు.ఈ కథ 1991 జూలైబాలజ్యోతి లో వచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 30, 2020 • T. VEDANTA SURY • Memories