ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
75.ప్రజల బాగే పాలన:--రవీంద్రనాథ్ ఠాగూర్ కు ప్రపంచ గౌరవం తెచ్చింది గీతాంజలి కావ్యం. అందులోని ఒక గేయం లో కవి గుడిలో ఉన్న పూజారి నుద్దేశించి" నీ జప తపాలను, కీర్తనలను విడిచి రా! తలుపులన్నీమూసుకొని ఈ దేవాలయం చీకటి కోణంలో ఎవరి కోసం నీవు పూజ చేస్తున్నావు? నీవు ఏదేవుని ఆరాధిస్తున్నావో అతడు నీ ముందులేడు! అతడెక్కడున్నాడో చూడు? రాళ్ళ మయమైన నేలను దున్నుతూ ఉన్న చోట, రోడ్లు వేసే పనివాడు రాళ్లు కొడుతూ ఉన్న చోట అతడున్నాడు! ఎండనక వాననక పనిచేస్తున్నవారి వద్దనే అతడుంటాడు! ఆ దేవుడి దుస్తులుకూడా వారి దుస్తులు వలెనే దుమ్ముకొట్టుకొనిఉన్నవి!" అని చెబుతాడు. ఆ గేయ ముఖ్యధ్యేయం పిల్లల వరకు కథారూపంలో చేర్చాలనే ఉద్దేశ్యం తో ఒక జానపద కథను తయారు చేశాను.ఆ కథకు జనప్రియుడు అని పేరుపెట్టాను.కథలోకి వెళ్తే ... కళింగ దేశానికి ప్రభువు రామరాజు.దైవభక్తి ఎక్కువ. సమయమంతాపాడుబడ్డ దేవాలయాలను పునర్నిర్మించడానికిదేవాలయాలలో నిత్య నైవేద్యాలు కొనసాగించడానికి దేవతా విగ్రహాలకు విలువైనఅలంకారాలు అందజేయడానికి వినియోగించేవాడు.రాజు గారు పాలన మీదశ్రద్ధ చూపక పోవడంతో మంత్రి లంబోదరుడుమకుటం లేని మహారాజే అయ్యాడు. అతడి అరాచక పాలనలో ప్రజలు బాధలు పడుతున్నారు. కార్తీక మాస సమయంలోరామరాజు పుణ్య తీర్థాల దర్శనార్థం సపరివారంగా బయలుదేరాడు.ఒకరోజు నాగావళినదీతీరం లోని ఒక దేవాలయం సందర్శించాడు.అక్కడున్న దేవుణ్ణి జనప్రియుడని పిలుస్తారు. గర్భాలయానికి గోడలున్నాయి కాని పైకప్పు లేదు.విగ్రహానికి వేసిన దుస్తులు ఎన్ని సార్లు మార్చినా అవి మలినం గానే కనిపిస్తాయి. రామరాజుజనప్రియుడి దీనావస్థకు బాధపడతాడు.అర్చకుడితో భూరి విరాళం పంపుతాను ఆలయం వైభవంగా ఉంచండని కోరతాడు. నగరం వెళ్ళాకఅన్న మాట ప్రకారం విరాళాలు పంపేడు.దేవాలయం బాగుపడింది కాని దేవుడిదుస్తుల మలినం ఆగలేదు. ఆ వింత కనిపెట్టడానికి స్వయంగా వెళ్లి రాత్రి గర్భగుడిలో కూర్చున్నాడు.హఠాత్తుగా ఆ రాజుకు మత్తు ఆవహించి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం లో జనప్రియుడుకనిపించాడు. "రాజా నీవు ఒక్క కళింగ దేశానికేరాజువు కాని నేను సమస్త లోకాలకు ప్రభువును!నా ప్రజలు పేదరికం లో వుండి బతుకు కోసం శ్రమ పడుతుంటే ఈ దేవాలయం లో కులుకుతూ ఉండలేనుగా! ఆ శ్రామికులలో ఒకడినై ఉన్నప్పుడే నాకు తృప్తి కలుగుతుంది. అందుకే నా దుస్తులువారి దుస్తులు లాగే మలినమవుతున్నాయి." అనిఅంటాడు. రామరాజు స్వప్నం కరిగిపోయింది.తెలివి వచ్చాక "భగవంతుడునా బాధ్యతను గుర్తు చేశాడు. పరిపాలన మీదనాకుండే నిర్లక్ష్యం ఎత్తి చూపాడు."అనుకొని రాజధానికి చేరి పరిపాలన మీద శ్రద్ధ పెట్టి మంచిరాజుగా పేరు పొందాడు.మానవసేవే మాధవ సేవఅని కథలో చెప్పడానికి ప్రయత్నించాను.కథ 1992 జనవరి బొమ్మరిల్లు లో వచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు9989537835
July 31, 2020 • T. VEDANTA SURY • Memories