ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
83.కుయుక్తిని చిత్తు చేసే పై ఎత్తు:--అవతలి వారి బలహీనత కనిపెట్టి చిత్తుగా ఓడించాలనుకోవడం కుయుక్తి అనిపిస్తుంది. అది వీరత్వం అనిపించుకోదు. ముల్లునుముల్లుతోనే తీయాలంటారు పెద్దలు. అదే ఆచరించి మాతృభూమిని కాపాడుతాడు ఒక యువకుడు. అదెలా సాధ్యమయిందో కాంభోజరాజు కుయుక్తి అనే కథలో చెప్పడమయింది.సంక్షిప్తంగా ఆ కథలోకి వెళ్దాం! కాంభోజ రాజ్యానికి రాజు విక్రమసేనుడు.కుతంత్రాలు పన్నడంలో మేటి.దురాక్రమణకు దగ్గర దారులు వెతుకుతాడు.ఒకసారి అతడు యుద్ధ విద్యల పోటీకి అన్ని రాజ్యాలను ఆహ్వానించాడు.బిరుదులు, బహుమతులు ఇస్తానని ప్రకటించాడు.అన్ని రాజ్యాలతో పాటు కాశ్మీర రాజ్యం కూడా పాల్గొంది.ఆ పోటీలలో కాశ్మీర రాజ్యం తప్పించి మిగిలినరాజ్యాలన్నీ కొద్దో గొప్పో బహుమతులు, బిరుదులు పొందాయి. కాశ్మీర యుద్ధవీరులకునాయకత్వం వహించిన వీరవర్మ ఏ ఒక్క బహుమతి జట్టుకు తీసుకురాలేక పోయాడు.అవమాన భారంతో యోధులు రాజ్యం చేరుకున్నారు. కొన్నాళ్ళు తరువాత కాశ్మీరరాజుమృణాళ సేనుడికి కాంభోజరాజు దండయాత్ర కు వస్తున్నట్టు వేగులు ద్వారా తెలిసింది. మంత్రి, సేనాధిపతులను పిలిచి మన సత్తా ఏపాటిదోఆ మధ్య నిర్వహించిన యుద్ధ విద్యల పోటీలోనేతేలిపోయింది. ఇక మనం కాంభోజరాజుకు లొంగిపోవడమే మంచిది అని చెప్పి సంధికి ప్రయత్నించమని కోరాడు. అది విన్న వీరవర్మవారి సంభాషణలో జోక్యం చేసుకొని యుద్ధవిద్యలపోటీలో కాశ్మీర యుద్ధవీరు లెందుకు ఓడిపోవలసివచ్చిందో కారణం చెబుతాడు.మృణాళ సేనుడువీరవర్మ సమయస్ఫూర్తికి మెచ్చుకొని ఉత్సాహం తో సైన్యాన్ని సిద్ధం చేశాడు. కాశ్మీరరాజ్యంలో చొరబడిన కాంభోజరాజు కి చుక్కలు చూపించారు కాశ్మీర యోధులు. కాంభోజరాజు కాశ్మీర యుద్ధ వీరుల నైపుణ్యానికి నివ్వెరపడ్డాడు. అతడు ఆశ్చర్యం నుంచి తేరుకొనేలోగా కాశ్మీర సైన్యం చేతిలో బందీ అయ్యాడు.కాశ్మీర రాజు మృణాళ సేనుడు ఆనందించాడు. విక్రమ సేనుని బంధవిముక్తుణ్ణి చేయించి " విక్రమసేనా! కుయుక్తులు మాని నిర్మలంగా బతకడంనేర్చుకో ! యుద్ధ విద్యల పోటీ నెపాన బలహీనరాజ్యాలను కనిపెట్టి ఆ రాజ్యాలను కబళించాలన్న నీ కుయుక్తిని మా యోధులు పసిగట్టారు . అందుకేకావాలని ఓడి నీకిప్పుడు బుద్ధి చెప్పారు. ఇంకెప్పుడూ అటువంటి కుయుక్తులు పన్నకు." అని అన్నాడు. విక్రమసేనుడు సిగ్గుతో తలవంచిమరెన్నడూ ఇలా వ్యవహరించనని అన్నాడు. కాంభోజరాజు లో పరివర్తన కలిగినందుకు కాశ్మీరరాజు ఆనందించాడు. అసలైన వీరుడుఆనుపానులు చూసుకొని రెచ్చిపోవలసివచ్చినపుడు రెచ్చిపోతాడు.తగ్గవలసి వచ్చినపుడు తగ్గిపోతాడు.వీరవర్మ లో ఆ లక్షణం చూపించడానికి కథలో ప్రయత్నించాను.ఈ కథ1993 మార్చి 17 వ తేదీ పల్లకి వినూత్న వారపత్రిక లోని ముంగిట ముత్యాలు శీర్షికలోవచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు9989537835
August 7, 2020 • T. VEDANTA SURY • Memories