ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
85. విరామమిస్తే విఘాతమే::--1992లో విజ్ఞాన వివర్థిని పురస్కారం,1993ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నానుఆ ప్రోత్సాహం నా రచనలపై ప్రభావం చూపించగలదనుకున్నాను.1994లో బాగానే రచనలు చేయగలననుకున్నాను.కాని అనుకున్నట్టు జరగలేదు. అప్పటి పరిస్థితులునా రచనా వ్యాసాంగానికి ఆటంకం కలిగించాయి.అక్షర విజయం క్లష్టరు కోఆర్డినేటర్ బాధ్యత,విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 7వ తరగతికి గణితం, తెలుగు పాఠాలు చెప్పడానికవెళ్ళడం ఈ రెండు పనులు ఒత్తిడి వల్ల రచనలకు దూరమయ్యాను.ఇంట్లో ఊర్లో ఈమధ్య రచనలు రాలేదేమి ప్రశ్నలధికమయ్యాయి. ఆ సమయం లో ఒక అనుభవ పాఠం నేర్చుకున్నాను.మధురమైన పాయసం తింటున్నకొలది తినాలనిపించినట్టు రచన చేయడం కూడా అలాంటిదే అని తెలుసుకున్నాను. రాస్తుంటేనే కొత్త ఆలోచనలు ఊరుతుంటాయి.రాయకుండా కూర్చున్నామా ఆలోచనా సామర్ధ్యంకుంటుపడుతుంది.ఇతరుల విషయంలో ఈపరిస్థితి ఎదురౌతుందో లేదో తెలియదు కాని నా విషయంలో మాత్రం ఇది జరిగింది.ఇతెలుసుకున్నాక రచన చేయడం తప్పనిసరి అలవాటు గా చేసుకున్నాను. రచనలకు దూరమయ్యానని చెప్పాను కదా. దానికి విరుగుడు ఆలోచించాను. అప్పటి వరకు ప్రచురించ బడిన నా రచనలు ఒకసారి తిరగేశాను.బాలల అకాడమీ పుస్తకాలు కొన్ని వుంటే అవిచదివాను. రాత్రి అక్షర విజయం కేంద్రాలనుపర్యవేక్షణ చేసినప్పుడు అక్కడున్న వయోజననూతన అక్షరాస్యులతో మాట కలిపేవాడిని.చదువు ఆవశ్యకత గురించి చెబుతూవారి జీవితానుభవాలు తెలుసుకొనేవాడిని.ఏ పుట్టలో ఏ పాముందో?ఎవరి అనుభవాలు నాకు కథలకు పనికి వస్తాయో ?! వారికి అప్పుడప్పుడుకథలు కూడా చెప్పడం ఆరంభించాను. రచనాలోకం లోకి తిరిగి అడుగు పెట్టడానికి నానా తంటాలు పడ్డాను.రచనలు చెయ్యడానికి మనం విరామ మిచ్చామా ఆ విరామం మనను రచనారంగం నుంచి వేరు చెయ్యడానికి పనిగట్టుకు చూస్తాదని అనుభవంతో తెలుసుకున్నాను.ప్రతికూల పరిస్థితులను మనకనుకూలంగా మార్చుకుంటేనే రచనలు చేయగలమన్న ఆలోచనకు వచ్చాను.అలా పుంజుకుంది నా రచనా వ్యాసాంగం మళ్లీ! 86. కలం మళ్ళీ నడక ఆరంభించింది: 1995 సంవత్సరం వచ్చింది.1994 లా 1995 కాకూడదనుకున్నాను.మనసుంటే మార్గం కరువాఅని నాకు నేనే హెచ్చరించుకున్నాను.ఒక ఆదివారం గ్రంథాలయానికి వెళ్ళాను. పాతపత్రికలుకొత్త పత్రికలు తిరగేశాను. ఆంధ్ర ప్రభ దినపత్రికవారు పిల్లల కోసం ప్రతి శనివారం చిన్నారి పేరుతోఒక అనుబంధం పెట్టారు. అందులో ప్రభ ఆంటీపేరుతో బాలసాహితీవేత్త శ్రీమతి ముంజులూకృష్ణ కుమారి గారు ఒక కాలమ్ నిర్వహిస్తున్నారు. ఆ అనుబంధం లో చిన్న కథలు, బాలగేయాలుకూడా ఇస్తున్నారు.చిరునామా రాసుకున్నాను.చిన్నారి అనుబంధానికి పంపడానికి రెండు గేయాలు సిద్ధం చేశాను.మొదటి గేయానికి భువిలో దైవం పేరు పెట్టాను.ఆ గేయం చూద్దామా?! //ఆడే పాడే పాపల్లారా!/అల్లరి చేసే కూనల్లారా!/అదిగో అదిగో చూశారా!/ఆకాశాన్నిచూశారా!//ఆడే ...//ఏడు వన్నెలా చాపమది/చూడ ముచ్చటగు రూపమది/మింటికి సొంపై నిలుచునది/కంటికి ఇంపై పిలుచునది//ఆడే...//సన్నని తుంపర కురిసే వేళ/వాలుగ కిరణం తాకేవేళ/రవి కిరణాలే ఏడు రంగులుగ/ఇంద్ర చాపమైవెలసిన వేళ//ఆడే...//భువిలో మతాలు ఎన్నిఉన్నను/దివిలో దేవుడు ఒకటేనంటూ/మన కందరకూ చెప్పుటకై అది/గగన తలాన పుట్టిందదిగో//ఆడే...// ఈ గేయంలో ఒక అందమైన దృశ్యం ద్వారా ఒక అపురూప భావనను అందించాలని ప్రయత్నించాను. విశ్వప్రేమ,మతసహనం పిల్లల్లో ఏర్పడాలని నాకోరిక.ఈ గేయం లో ఇంద్రధనుస్సు ఏర్పడే విధంసరళమైన పదాలతో వివరించగలిగాను. ఈ గేయం ఆంధ్ర ప్రభ చిన్నారి అనుబంధం లో1995 ఏప్రిల్ 15 న వచ్చింది. మరొక గేయం పేరుచుక్ చుక్ రైలు. రైలు ప్రయాణం ద్వారా జాతీయసమైక్యతను చెప్పడానికి చూశాను. ఆ గేయంచూడండి.//చుక్ చుక్ రైలు/చలాకి రైలు/చుర చుర చర చర/సాగే రైలు//మతమేదైనా/సమ్మతమే/జాతేదైనా/ సమ్మతమే/టిక్కెట్ ఉంటే/ఎక్కొచ్చండీ/దేశాన్నంతా తిరగొచ్చండీ//చుక్//రాష్ట్ర మేదైన/తనదే నంటూ/భాష ఏదైన/తనకేమంటూ/దేశం అంతా/తనదేనంటూ/బిర బిర జర జర/వెళ్తుందండీ//చుక్//నదీనదాలు/అడ్డవు లెండి/మహారణ్యాలు ఆపవు లెండి/గమ్యం చేరుట/దాని లక్ష్యమూ/ఐక్యత పెంచుట/దాని ఆశయం//చుక్// ఈ గేయం 1995 మే నెల 6వ తేదీ ఆంధ్రప్రభ చిన్నారిఅనుబంధం లో వచ్చింది.గేయం కూర్చడంలోరైలు వేగం ధ్వని ఇమిడేటట్టు చూశాను.(సశేషం)- బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 9, 2020 • T. VEDANTA SURY • Memories