ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
87. చదువు సాగాలి - కథలు కదలాలి:--1995లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఎం.ఇడి.కరెస్పాండెన్స్ కోర్స్ ప్రారంభించారు.ఆ కోర్స్ కుఎంపికయ్యాను.ఫీజు కట్టి ఆ చదువు ఆరంభించాను.ఆ రోజులు తీరిక లేని రోజులయ్యాయి. కథలు,గేయాలు మీదకు మనసు మరలినప్పుడు అశ్రద్ధ చెయ్యలేదు.కథలు,గేయాలు కొన్ని రాశాను.పత్రికలకు పంపేను.ఆంధ్రబాల అనే పత్రిక లో సర్పవనం పేరుతో ఒక పెద్ద కథ , ఆంధ్రప్రభ శనివారం అనుబంధం లోరెండు కథలు , కొన్ని గేయాలు వచ్చాయి. మనవరాలి తీర్పు అనే కథ గురించి రెండు మాటలు చెప్పికథలోకి వెళ్తాను. పురుషాధిక్యత గల కుటుంబాలలో జరుగుతున్న అంశాన్ని కథకవస్తువుగా తీసుకున్నాను.ఇప్పటికీ భర్త సేవపేరుతో పురుషాధిక్యత కొనసాగుతూనే వుంది.భార్యాభర్తలువయసులో కొద్ది తేడా లోనే వుంటారు. వార్ధక్యంఒక్క మగవాడికే వుంటుందనుకుంటారేమో !వార్ధక్యం మీద పడినా సరే ఆ ముసలామె భయభక్తులతో ముసలాయన అవసరాలు అమర్చవలసిందే.అలా జరగక పోయిందా ఆ ఇల్లాలిపై కేకలే కేకలు. ఒక ఇంట్లో అదే తంతుజరుగుతుంటే మనవరాలు నాన్నమ్మ తరుపున "తాతగారూ! మీ వయస్సెంత?నాన్నమ్మ వయస్సుఎంత?"అని అడుగుతుంది.తాతగారు చెబుతారు.అప్పుడు ఆ మనవరాలు " మీ ఇద్దరి వయస్సు తేడా మూడు సంవత్సరాలే. మీ లాగే నాన్నమ్మకూడా ముసలామే అయింది. మరి ఆమెందుకుమీ మీద కేకలెయ్యదు?"అని తాతగారిని అడిగింది.అంతటితో ఆగకుండా " మీ లాగే నాన్నమ్మకు కూడా విశ్రాంతి తీసుకోవాలనే అనిపిస్తుంది.మీరన్న వెంటనే పనులెక్కడ ఆమె చెయ్యగలదు?"అని ఆ మనవరాలు తాతగారితప్పును ఎత్తి చూపింది. అంతవరకు ఆ ఇంట్లోఏ కొడుకు ఏ కోడలు ఆ ముసలాయన తప్పును ఎంచలేదు.తాతగారికి తల తిరిగినంత పనయింది.తాను ఇన్నాళ్ళూ చేసిన తప్పు అర్థమయింది. మనవరాలిని దగ్గరకు తీసుకొని" ఔనమ్మా నీకున్న ఇంగితం నాకు లేకపోయింది."అని అన్నాడు. ఆ నాటి నుంచి ముసలాయనలో మార్పు వచ్చింది.ఆయన పనులు ఆయన చేసుకోడం ప్రారంభించారు. మనవరాలి తీర్పుకునాన్నమ్మ ఆనందించింది. ఈ కథ ఆంధ్రప్రభ శనివారం అనుబంధం లో 1995 ఏప్రిల్ 15 న వచ్చింది.మరొక కథ పేరు పందెం! సరదా కథ! ..గ్రామాధికారి పరంధామయ్యకు పందేల పిచ్చి. అమాయకులను పందెంలో దించి డబ్బు రాబట్టుకొనే వాడు.ఒక రోజతడు "ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే వ్యక్తికి వెయ్యి వరహాలిచ్చి సత్కరిస్తాను.పందెం లో వీగిపోతే వంద వరహాలు పరిహారం గా నాకు చెల్లించాలి."అని చాటింపువేయించాడు.ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడమంటేచిన్న ఆధారం పట్టుకుని జరిగినది ఊహించిచెప్పగలగడమన్న మాట! గణపతయ్య పందెం విని చాలా మంది వచ్చారు.ఓడిపోయి వందేసివరహాలు అప్పనంగా గణపతయ్యకు చెల్లించివెళ్తుండేవారు.ఒకరోజు గణపతయ్య తన ఇంటి ముందు ఒక యువకుడు చాలా సేపటి నుంచి తచ్చాడడం చూశాడు. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావని ప్రశ్నించాడు.ఆ యువకుడు మీ పందెంవిన్నాను. అదృష్టం పరీక్షించుకుందామని వచ్చానన్నాడు.వీగిపోతే వంద వరహాలు ఇవ్వగలవా అడిగాడు గణపతయ్య. అప్పుడుఆ యువకుడు "నేను తెగిన గాలిపటాన్ని!నా దగ్గరఏమీ లేదు. కాని నా మీద నాకు నమ్మకముంది."అని అన్నాడు. గణపతయ్య వంద వరహాలులేకపోతే పందేనికి అర్హత లేనట్టే అన్నాడు."ఓడిపోతే సంవత్సరం కాలం మీ ఇంటి చాకిరిచేస్తాను."అన్నాడు యువకుడు. గణపతయ్యఅంగీకరించాడు." ఆవలిస్తే పేగులు లెక్కపెట్ట గలవు కదా ! గంట నుంచి మా ఇంటి ముందు తచ్చాడుతున్నావు.మా కుటుంబం గురించి ఏమి1256+తెలిసింది?"అని అడిగాడు. యువకుడు వెంటనేమీ కుటుంబ సభ్యుల పేర్లు వారికి మీతో గల సంబంధం చెప్పండని కోరతాడు. గణపతయ్విసుగు చెందుతూ " నా భార్య పేరు కాంతం.నా పెద్ద కొడుకు విశ్వం.రెండవ కొడుకు రామం. పెద్ద కుమార్తె నాంచారి.నా రెండవ కుమార్తెఅలివేలు." అని చెబుతాడు.యువకుడు కళ్లుమూసి కాస్సేపు ఆలోచించాడు.ఆ ఆలోచన ఒక కొలిక్కి రాగానే "నా సమాధానం విని ఆగ్రహించకండి.మీ భార్యకు మీ రెండవ అబ్బాయి కి చెవిటితనం వుంది" ఠపీమని చెప్పాడు. ఆ యువకుడు చెప్పేది నిజమే.గణపతయ్య నిర్ఘాంతపోయాడు. ఎలా తెలుసుకోగలిగావని అడిగాడు.నీ సమాధానం నాకు తృప్తి నిస్తే నీకు వెయ్యి వరహాలతో పాటు రాజుగారి కొలువు లో ఉద్యోగమిప్పిస్తానన్నాడు.అప్పుడు ఆ యువకుడు"మీరు మీ కుటుంబ సభ్యులతో తోటపని చేయించే టప్పుడు మీ శ్రీమతి గారితోను మీ రెండవ అబ్బాయితోను గట్టిగా మాట్లాడడం గమనించాను." అన్నాడు. యువకుడి తెలివితేటలకు గణపతయ్య ఆశ్చర్య పోయాడు.వెయ్యి వరహాలిచ్చి మర్నాడు రాజుకొలువుకుతీసుకువెళ్ళాడు.దారిలో పేరడిగాడు.పందేల పరబ్రహ్మమని అందరూ నన్ను పిలుస్తారని చెప్పాడు యువకుడు. ఇంకా ఆశ్చర్య పోయాగణపతయ్య!ఈ కథ 1995 జూలై 1 న ఆంధ్రప్రభ అనుబంధం లోనే వచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 10, 2020 • T. VEDANTA SURY • Memories