ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
90.ఎలుకలను పట్టని పిల్లి:--మా పొరుగున బియ్యం వ్యాపారం చేసే కుటుంబంవుండేది. వాళ్ళకు బియ్యం వ్యాపారం వల్ల వచ్చే లాభం కంటే ఎలుకలు బియ్యం తినడం వల్ల వచ్చేనష్టమే ఎక్కువయింది.ఎవరో పిల్లి పెంచమంటేపెంచారు.కాని ఆ పిల్లి ఎలుకలను పట్టేది కాదు.పొరుగూరి నుంచి ఒక బంధువు ఆ ఇంటికి వచ్చాడు.అతడితో బియ్యం వ్యాపారస్తుడు పిల్లి ఎలుకలను పట్టడం లేదని చెబుతాడు.ఆ బంధువు ఒక సలహా ఇస్తాడు.ఆ సలహా పాటించడం వల్ల పిల్లి ఎలుకలను పట్టడం ప్రారంభించింది.ఆ బంధువిచ్చిన సలహానే ఇతివృత్తం గా చేసుకొనిమిత్రుని సలహా అనే కథ రాశాను.ఆ కథ సంక్షిప్తంగా... అన్నతో ఆస్తి పంపకమయ్యాక బలరామయ్య బియ్యం వ్యాపారం ప్రారంభించాడు. పల్లెల్లోకి వెళ్లి ధాన్యం కొని మరఆడించి బియ్యం అమ్ముతుండేవాడు.ఒకరోజుపొరుగూరి నుంచి బాల్యమిత్రుడు రంగయ్య బలరామయ్య ఇంటికి వస్తాడు.మాటల్లోరంగయ్య కొత్తగాప్రారంభించిన వ్యాపారం ఎలా వుందని అడుగుతాడు . అప్పుడు బలరామయ్య వ్యాపారమైతే సాగుతుంది కాని ఎలుకలు ఆలాభాన్ని మింగేస్తున్నాయని తనకొచ్చిన కష్టంచెబుతాడు. అప్పుడు ఆ మిత్రుడు పిల్లిని పెంచుఎలకల బెడద మరి ఉండదు అని సలహా ఇస్తాడు.బలరామయ్య ఊరంతా తిరిగి ఒక పిల్లి పిల్లనుఇంటికి తెస్తాడు.భార్యాభర్తలు దానికి పాలన్నంపెట్టి ముద్దు ముద్దుగా పెంచుతారు.బొద్దుగా పెరిగిఅది మరీ గారాబ మయింది.రాత్రి పూట ఇంటి యజమాని పక్కే ఎక్కి నిద్ర పోతుండేది.పని మీదపట్నం వచ్చిన రంగయ్య బలరామయ్యను కలిసిఎలుకల బెడద తగ్గిందా అని అడుగుతాడు.ఎలుకల బెడద తగ్గలేదు మిత్రమా ఇప్పుడు బియ్యం నష్టం తో పాటు పిల్లి పెంపకానికి పాలఖర్చు తోడయింది అని నవ్వుతూ అన్నాడుబలరామయ్య.ఆ రాత్రి ఆ ఇంట్లో వుండి రంగయ్యపిల్లి పరిస్థితి చూశాడు. పాలన్నం పీక మొయ్యాతిని పిల్లి బలరామయ్య పక్క మీదకు చేరింది.రంగయ్యకు పిల్లి ఎందుకు ఎలుకలను వేటాడలేదో అర్థమయింది. మిత్రుడితో పిల్లికి మూడు పూటలా పాలన్నంతో కడుపు నింపితే అదెందుకుఎలుకలను వేటాడుతుంది? రేపటి నుంచి రాత్రిఏమీ పెట్టకండి అని సలహా ఇచ్చాడు. బలరామయ్య మిత్రుడి సలహా పాటించాడు.పిల్లి మరి యజమాని పక్క ఎక్కలేదు.ఆకలి తట్టుకోలేక ఎలుకలను మింగడానికి బియ్యం బస్తాల మాటునుండి వేట ప్రారంభించింది. అంతేఎలుకల బెడద తప్పింది. అతడి బియ్యం వ్యాపారం మూడు కుంచాలు ఆరు పుట్లుగ వర్ధిల్లింది. మన చుట్టూ జరిగే పరిస్థితులనేమనం చక్కగా కథలల్లుకోవచ్చు.ఈ కథ 1998మే నెల బాలజ్యోతి లో వచ్చింది.(సశేషం) --బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 13, 2020 • T. VEDANTA SURY • Memories