ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
91.లయన్స్ క్లబ్ వారి సత్కారం:సెప్టెంబరు 5 గురుపూజోత్సవ సందర్భంగా పార్వతీపురం లయన్స్ క్లబ్ వారు ప్రతి యేడూఇద్దరు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సత్కరిస్తారు.ఆ ఇద్దరిలో ఒకరు పట్టణ ప్రాంతం మరొకరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై వుంటారు.1998 సెప్టెంబర్ 5 గురుపూజోత్సవ సందర్భంగాపట్టణ ప్రాంతానికి చెందిన నన్నూ గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత, కవిశ్రీ గంటేడ గౌరునాయుడు మాష్టారును ఉత్తమఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులం రచయితలమే.ఆ సంవత్సరంలయన్స్ క్లబ్ వారు వర్షాలధికంగా పడడం వల్లగెడ్డ పక్కనున్న లయన్స్ కళ్యాణ మండపం లో కాకుండా టౌన్ లో ఉన్న హోటల్ శ్రీకాంత్ వారిశ్రీనివాస కళ్యాణ మండపంలో సత్కార కార్యక్రమంనిర్వహించారు. ఆ ఉత్సవ కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షులు లయన్ డి.జగదీశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీ పి.వి.రమణమూర్తి , శ్రీ బి.చంద్రశేఖరరావు,డా.డి.రాఘవేంద్రరావు శ్రీమతి లీలా రాఘవేంద్రరావు దంపతులు, శ్రీ సారిపల్లి శివరావు శ్రీ ఎం.శ్రీరాములు గారలు పాల్గొన్నారు.92.పాపంబడాయి బండన్న: సమాజంలో రకరకాల వ్యక్తుల్నిచూస్తుంటాం.కొందరు పని రాక్షసులుంటారు.కొందరు సోమరులుగా ఉంటారు.మరి కొందరుసంపదలు పెంచుకుపోతుంటారు.కొందరు ఉన్నదికరగదీసుకు తింటారు.కొందరు సాధించిన విజయాలను కూడా చెప్పుకోడానికి ఇష్టపడరు.కొందరైతే బడాయిలు చెప్పడానికి వెనకంజ వేయరు. అలాంటి వ్యక్తి కథే బడాయి బండన్న.కథ ఏమంటే... పనీ పాట చేయక పోచుకోలుకబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే యువకుడుబండన్న. ఏమంత చదువుకోలేదు కాని అన్నీతనకే తెలుసునని బడాయిలు పలికేవాడు. ఎవరేది చెప్పినా అది తనకు చాలా ముందుగానే తెలుసునని పలికే వాడు.కొన్నాళ్ళకు అది అలవాటుగా మారింది.కొడుకు ప్రవర్తనకు విసిగిపోయి ఆ తల్లిదండ్రులు ఏదైనా పని నేర్చుకో నిన్ను పెంచడానికి మేమెంత కాలం ఈ భూమిమీద వుంటాం అని అంటుండేవారు.అప్పుడు బండన్న "మీరు చూస్తూ వుండండి. నా తెలివితేటలు జమీందారు వరకు వెళ్తాయి.అందలమెక్కించి నన్ను కోటకు తీసుకు వెళ్తారు. జమీందారు నా తెలివితేటలకు తగిన కచేరీ పనిచ్చి గౌరవిస్తారు"అని తల్లిదండ్రుల తో అనేవాడు.ఆ బడాయి మాటలు వినలేక తల్లిదండ్రులు నీ కర్మ అని వదిలి వేశారు.ఊర్లోవారికి ఆ విషయం తెలిసి అందలమెప్పుడు ఎక్కుతావని ఆట పట్టించేవారు.ఉండండిచూద్దురు అని వాళ్ళ నోళ్లు మూయించేవాడు.ఒక రాత్రి జమీందారు గారి కోటలో దొంగతనంజరిగింది. బంగారు ఆభరణాలు,వజ్ర వైఢూర్యాలుకొన్ని మాయ మయ్యాయి. ఆ వార్త ఆ ప్రాంతమంతా పాకింది.అయ్యో అని కొందరు ఎంత పని జరిగిందని కొందరు ఇలా ఒకొక్కరుఆశ్చర్యం విచారం వెలిబుచ్చుతుంటే బండన్నపెద్ద నోరు చేసి ఆ దొంగతనం జరుగుతుందని నాకు ముందుగానే తెలుసునని అన్నాడు.అంతే! అక్కడ మారువేషంలో తిరుగుతున్న రాజభటులుబండన్నను బేడీలు వేసి బంధించారు.బండన్న అయోమయం నుంచి తేరుకొని వట్టినే అన్నానుదొంగతనం గురించి నాకేమీ తెలియదు అని గోలపెట్టాడు.భటులు బండన్న మాటలు వినలేదు. కాళ్ళకు సంకెళ్లు కూడా వేసి బండన్నను బలవంతంగా ఈడ్చుకు వెళ్ళారు.అందలమెక్కిజమీందారు సంస్థానానికి వెళ్తానని బడాయిలుపలికే బండన్న సంకెళ్లు తో వెళ్ళడం చూసి ఊరివాళ్ళు అయ్యో పాపం ఎలాంటి ఆపదలోపడ్డాడు అని అనుకున్నారు.బడాయి మాటలు ఒకొక్కసారి ఎంత నిందకు గురి చేస్తాయో చెప్పడానికి ఈ కథ రాశాను.1999 మార్చి బాలజ్యోతి లో కథ వచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835.
August 14, 2020 • T. VEDANTA SURY • Memories