ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
93.బాలగీతాలు - రేడియో ప్రసారాలు - ముఖ్య నిర్ణయం:బాలల గురించి ఏదైనా గేయం రాయాలను కున్నాను.ఎటువంటి బాలలు దేశానికి ఉపయోగపడతారు ఆ దిశగా ఆలోచించాను.స్టాంజాకు4 పాదాలున్నట్టు 3 స్టాంజాలు రాసి వార్త ఆదివారం అనుబంధానికి పంపేను.పేరు బాలలు అని పెట్టేను.వార్త ఆదివారం అనుబంధం లో చిన్న గేయాలే ఇస్తుండేవారు.ఆ గేయం ఏమంటే....//చైతన్యం ఊపిరిగ/వెల్లి విరియు బాలలు//భరత మాత ఆశలకు/రూపు దిద్దు శిల్పులు///నవ సమాజ లోగిళ్ళకు/వెలుగు నిచ్చు దీపికలు/ /చిరునవ్వులు చిందించు/చిన్ని పొన్ని బాలలు///శ్రమయే సౌందర్యమని/చూప బోవు బాలలు//భరతమాత సిరులకు/అసలు సిసలు వారసులు//వార్త పత్రిక లో వచ్చిన మొదటిబాలగేయమిది.1999 ఫిబ్రవరి 7 న వచ్చింది.వార్తలో వచ్చే శతాధిక గేయాలకు ఈ గేయం నాందీ పలికింది.ఒక వేసవి రాత్రి కరెంట్ పోయింది.అప్పుడు ఇన్వెర్టర్ల సౌకర్యం అంతగా వ్యాప్తి కాలేదు. చక్కగా విసనకర్రలు పట్టుకుని ఇంటినుంచి బయటకు వచ్చాం.అప్పుడు మా చిన్నమ్మాయి గాయత్రి ఆకాశంలో చుక్కలు చూసిబోలెడు చుక్కలు! లెక్క పెట్ట లేం! అంది. అంతటితో ఆగకుండా పాలపుంతను చూపించింది. అప్పుడామె హైస్కూలు తరగతి చదువుతుంది.కరెంటు లేనప్పుడు, అమావాస్యప్పుడు ఆ చుక్కల కాంతే భూమికి వెలుగు!అని అంది.ఆ మాటలుఆ క్షణం లోనే ఒక గేయానికి నాలో బీజం వేశాయి. గేయం మనసులో రూపుదిద్దుకుంటుంది.అంతలోకరెంటు వచ్చింది. ఇంట్లోకి రాగానే మనసులో రూపుదిద్దుకున్న గేయ పాదాలు వెంటనే కాగితంపైపెట్టాను.గేయం పూర్తయ్యాక చదివి వినిపించానుఅందరూ బాగుందన్నారు.చుక్కలాకాశం పేరుపెట్టాను.ఆ గేయం చూడండి://చుక్కలు చుక్కలు//చక్కని చుక్కలు/లెక్కకు చిక్కని/మిక్కిలి చుక్కలు//ఆకాశంలో/మెరిసే చుక్కలు/ఆనందంలో/ ముంచే చుక్కలు//అంతరాళంలో/అనంత చుక్కలు/పాలపుంతలో/కోట్ల చుక్కలు//చంద్రుడు కానని/చీకటి వేళను/చుక్కల కాంతే/ధరణికి వెలుగు//దిక్కులు తోచని/దారుల లోన/చుక్కల ఉనికే/దిక్కగు మనకు//ఈ గేయం మాత్రాఛందస్సు లో సాగిపోయింది.ఎక్కడో ఒక దగ్గరమాత్రాఛందస్సుకు భంగం కలిగినా గేయం చదవడానికి పాడడానికి ఆటంకం కాలేదు. ఈ గేయం 1999 జూలై 18 తేదీ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో వచ్చింది.అదే సంవత్సరం ఆకాశవాణి సందడి కూడా జరిగింది.కార్మికుల కార్యక్రమంలో 1999 జనవరి 2న బలిఅనే కథానిక ప్రసార మయింది. అదే సంవత్సరంఅక్టోబర్ 17 న తిలక్ కవిత్వం - శాంతి కాముకతఅనే ప్రసంగం సాహితీకౌముది కార్యక్రమంలో వచ్చింది. సూక్తి ముక్తావళికి కూడా ఆకాశవాణివారు పిలిచారు.1999 మే 31 ఆంధ్రప్రభ వారపత్రికలో వారం వారం కథాప్రభ శీర్షికలో వర్షం అనే కథానిక ప్రచురించారు. ఆ తర్వాత నేనుసాంఘిక కథలు రాయ లేదు. బాలసాహిత్యంమీదనే పూర్తి దృష్టి పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఆ సంవత్సరం!(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 15, 2020 • T. VEDANTA SURY • Memories