ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
94.వృత్యంతర శిక్షణ లో పుట్టిన బాలగేయం:2000 మార్చి నెలలో జిల్లా విద్యాశాఖ మండలరిసోర్స్ సెంటర్లలో ఇన్ సర్వీస్ టీచర్ల శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది. మా అర్బన్ రిసోర్స్ సెంటర్ చర్చివీధి హైస్కూలు లో వుంది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఏ. భాస్కరరావుగారు మోడల్ లెసన్ చెప్పవలసి వచ్చింది. ఆ పాఠం పోస్ట్ ఆఫీస్. మధ్యాహ్నం ఆయన పాఠం చెప్పాలి.నన్ను పోస్ట్ ఆఫీస్ పై గేయం ఆయన రాయమన్నారు.మీరు రాయబోయే గేయం నా పాఠానికి ప్లస్ పాయింట్ కావాలన్నారు. ఒక రకంగా నాకది పరీక్షే! పక్కగదికి వెళ్లి గేయంతయారు చేశాను.మాష్టారు గేయం చూసి సరదాపడ్డారు. మీకు ఇబ్బంది పెట్టానని నొచ్చుకున్నారు.ఇలాంటివి ఎదురైతేనే నా లోని సృజనాత్మకత కుసాన పెట్టేటట్టు అవుతుందని గేయం రాసే మంచిఅవకాశం నాకు కలిగించారని ఆ మాష్టారు కుకృతజ్ఞతలు తెలియపరిచాను.మధ్యాహ్నం మాష్టారి పాఠం బాగా సాగింది. ఒక అబ్బాయి మెడలో పోస్ట్ ఆఫీస్ చిత్రం గలఅట్టను వేసుకుని పాట వినిపించడం పాఠం మరీవిజయవంతమయింది.మాష్టారు ఎంతో ఆనందించారు. రచయితగా నాకది తృప్తే కదా.ఆ పోస్ట్ ఆఫీస్ పాటను బాలజ్యోతి కి పంపించాను.ఆ పాట చూద్దామా మరి!//పోస్ట్ ఆఫీసని నన్నంటారు/కవర్లు కార్డులు ధర కిస్తాను/ఆఫీస్ ముద్రలు పడితే చాలు/ప్రపంచ మంతా నాదే నండి//ఏది వ్రాసినా ఏది పంపినా/గమ్యం చేర్చుట నా కర్తవ్యం/జాతులు మతాలుతెలియవు నాకు/ప్రాంతాలన్నీ ఒకటే నాకు//ఇక్కడి వార్తను అక్కడి కిస్తా/అక్కడి వార్తను ఇక్కడి కిస్తా/తక్కువ ఖరీదు కార్డులనైనా/చక చకఇళ్ళకు చేరుస్తాను//అమ్మకు పంపిన డబ్బులనైనా/చెల్లికి ఇచ్చిన కానుకలైనా/వారా ఏమీ లేకుండాను/నమ్మకం గా అందిస్తాను// పోస్ట్ ఆఫీసని నన్నంటారు/కవర్లు కార్డులు ధరకిస్తాను/ఆఫీస్ ముద్రలు పడితే చాలు/ప్రపంచమంతా నాదే నండి//ఈ గేయంలో పోస్ట్ ఆఫీస్ సేవలు తెలిపే ప్రయత్నం చేశాను.ఈ గేయం2000 నవంబర్ బాలజ్యోతి లో వచ్చింది.2000లోనే పార్వతీపురం ఐ.టి.డి.ఏ. వారు లెటర్ టు జి.వి.వి.కె.టీచర్ అనే ఒక చిన్నపత్రికను ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయులుకోసం తెచ్చారు.అందులో వుండే బాలసాహిత్యంఆ టీచర్లు పిల్లలకు చెప్పాలి.ఆ పత్రిక ఆశయమది.ఆ పత్రికకు ఒక కథ పంపించండని ఐ.టి.డి.ఏ.విద్యా విభాగం వారు కోరేరు. మూఢనమ్మకం మీద కథ రాసి పంపేను. ఆ కథను 2000 డిశంబరు పత్రికలో వేశారు. ఆ కథ గురించి సంక్షిప్తంగా.... కథ పేరు అవసరం.మర్రిగూడ ఒక గిరిజన గ్రామం.ఆ గ్రామంలో సాంబయ్య నిత్యావసర దినుసులు అమ్ముతాడు.ఒకరోజు సీతందొర అనే గిరిజనుడు దుకాణానికి వచ్చి"ఈ రోజు కట్టెలెవరూ కొనలేదు. చేతిన చిల్లిగవ్వ లేదు. నూకలు అరువివ్వండి"అని బ్రతిమలాడతాడు. సాంబయ్య చిరాకుగా ముఖం పెట్టి "వేళాలేదు పాళాలేదు. సాయంత్రమయింది.అరువివ్వను" అని కసిరేశాడు.పాపం సీతందొర చిన్నబుచ్చుకొని ఇంటికి తిరిగొచ్చాడు.ఆ రాత్రిసీతందొర కుటుంబం పస్తుతో వుంది. అదేరోజుఅర్థరాత్రి సాంబయ్య భార్య ఏడుపు రాగాలు తీస్తూ సీతందొర ఇంటికి పరుగెత్తింది.సీతందొరనులేపి తన భర్తకు పాము కాటు వేసిందని ప్రాణాలుకాపాడమని వేడుకుంది. సీతందొర కు పాముకాటువైద్యం తెలుసు.క్షణం కూడా ఆలస్యం చేయలేదు.మూలికలు,ఆకులు పట్టుకుని సాంబయ్య ఇంటికిపరుగెత్తాడు.సకాలంలో వైద్యం చేసి సాంబయ్యప్రాణాలు నిలబెట్టాడు.సాంబయ్యకు తెలివి బాగావచ్చే వరకు సీతందొర అక్కడే ఉండిపోయాడు.సాంబయ్య కళ్ళు తెరిచి సీతందొర ను చూశాడు.పాము తనను కాటు వెయ్యడం లీలగా గుర్తుకొచ్చింది.సీతందొరను రెండు చేతులెత్తినమస్కరించి తన వ్రేనికున్న బంగారు ఉంగరంతీసి ఇవ్వబోయాడు.సీతందొర సాంబయ్యను వారించి"వైద్యానికి నేనేమీ తీసుకోనని నీకుతెలియదా? తెల్లవారి నూకలు అరువియ్యు చాలు.రేపు కట్టెలమ్మగానే నీ డబ్బులు తెచ్చి ఇస్తా"అన్నాడు. సాంబయ్య సిగ్గు పడ్డాడు. నూకలు ఒక సంచిలో పోసిచ్చి "మంచి పని చెయ్యడానికి వేళాపాళా చూడరాదని నిన్ను చూసి తెలుసుకున్నాను"అన్నాడు. ఆ రోజు నుంచి సాంబయ్య గిరిజనుల అవసరాలు తీర్చి మంచిపేరు తెచ్చుకున్నాడు.శకునాల పేరుతోను సమయాసమయాల పేరుతోను అవతలివారి అత్యవసరాలు తీర్చడానికి వెనుకడుగు వేస్తారు.ఆ మూఢ నమ్మకం అవతలి వారికి ప్రాణసంకటంకావచ్చు. అది కూడదని చెప్పడానికే ఈ కథ రాశాను.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 16, 2020 • T. VEDANTA SURY • Memories