ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
98.మరపురాని సెమినార్:: -భారత ప్రభుత్వం 2001 ఏప్రిల్ నుంచి 2002 మార్చి వరకు గల పూర్తి సంవత్సరాన్ని గ్రంథాలయ సంవత్సరం గా ప్రకటించింది. ఆ సందర్భంగా నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ వారు మరియు ప్రొఫెసర్ కౌలా ఎండోమెంట్ వారు కలసి "గ్రామీణబాలల్లో చదివే అలవాట్లు పెంపుదల"అనే అంశంపై ఒక సదస్సును 2001 డిశంబరు 16,17 తేదీలలోశ్రీ రామా రూరల్ కళాశాల(గురుకులం),చిలుమూరు, గుంటూరు జిల్లాలో నిర్వహించారు. ఆ సదస్సుకు డా.వెలగావెంకటప్పయ్య గారు కన్వీనర్!సదస్సులో పాల్గొనమని ఆహ్వానం నాకందింది.15వ తేదీఉదయం పార్వతీపురం నుంచి బయలుదేరి రాత్రి 8గం.కి తెనాలి చేరాను.ఆ రాత్రి లాడ్జిలో బస చేసి ఉదయం చిలుమూరు బయలు దేరాను. తెనాలికి దగ్గరే ఆ ఊరు.నేను వెళ్ళేసరికి చాలా మంది వచ్చారు.అందులో వేజెండ్ల సాంబశివరావు గారు రెడ్డి రాఘవయ్య గారు చొక్కాపు వెంకటరమణ గారు ఉన్నారు. వారే నాకు పరిచయస్తులు.మిగిలిన వా‌రిని చూడడం అదేమొదటి సారి.అంతలో డా.వెలగా వెంకటప్పయ్యగారు వచ్చారు.నేను నమస్కారం చేసే లోపుఆయనే ముందు పలకరించారు.1979 తరువాతరెండు మూడు సార్లు సెమినార్ల లో ఆయననుచూశాను. సభ ప్రారంభమయ్యే సమయమయింది.వెలగా వారు సభకు స్వాగతం పలికారు. సెమినార్ లో పాల్గొనబోయే వక్తలనువేదిక మీదకు పిలిచారు. సభకు వచ్చిన వారిని పరిచయాలు చేసుకోవలసిందిగా కోరారు. ఒకొక్కరి పేరు విని ఆశ్చర్య పడ్డాను.బొల్లిముంత శివరామకృష్ణ గారు అక్కడకు వచ్చిన అందరిలోకివృద్ధులుగా కనిపించారు.మనుషులు మారాలిచలన చిత్రానికి ఆయన సంభాషణల రచయిత.ఆ విషయం గుర్తుకొచ్చింది.ఆ తరువాత మద్దులూరి రామకృష్ణ గారు,కవిరావు గారు, సమతారావు గారు, వేజెండ్ల సాంబశివరావు గారు, అలపర్తి వెంకట సుబ్బారావు గారు అందరూ గొప్ప రచయితలే.వారిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది. డా.గంగిశెట్టి శివకుమార్, వేదాంత సూరిగారు,అయినాల మల్లేశ్వరరావు గారలను అదేమొదటి సారి చూడడం!రెండు రోజులు వక్తలుమంచి ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రసంగ పాఠాలుచదివి వినిపించారు.శ్రీ సమతారావు గారు దేశాభివృద్ధికి పునాది అంటూ వుండాలని ఆ పునాది బాలబాలికలతో నిర్మితం కావాలని అందుకు బాలబాలికలకు కొత్త భావాలు అభ్యుదయ భావాలు అందించే దిశగా రచనలుండాలని పేర్కొన్నారు. శ్రీ వేజెండ్ల సాంబశివరావు గారు ప్రాథమిక విద్యాస్థాయి లఆట పాట మాట ప్రాముఖ్యత గా ఉండాలన్నారు.శ్రీ కవి రావు గారు, శ్రీ అలపర్తి గారు పిల్లలనుగేయాలు, గేయకథ లతో అలరింప జెయ్యాలనితద్వారా మాతృభాష మీద మమకారం కలిగించాలన్నారు.శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారపాఠశాలల్లో లలితకళలకు రోజూ ఒక పీరియడ్కే టాయించాలన్నారు .డా.ఎన్.మంగాదేవి గారుఫాంటసీతో పాటు గొప్ప వాళ్ళ జీవితం లోనిసంఘటనలు పిల్లలకు చెప్పాలని రీజన్ కి నిలబడేకథలు రావాలని కోరారు.శ్రీ వేదాంత సూరి గారుగ్రామీణ బాలలకు అవసరమైన సాహిత్యం గురించి మాట్లాడారు.ఆయన వార్త దినపత్రికలోవస్తుండే పిల్లల శీర్షిక మొగ్గకు ఇంఛార్జ్ గా ఉన్నారప్పుడు.ఆయన మాట్లాడుతూ పిల్లల్లో అనిర్వచనీయమైన ఆకళింపు శక్తి ఉంటుందని అది పిల్లల శీర్షిక నడిపే తనకు అనుభవైకవేద్యమేఅని అందువల్ల ఆ శక్తిని పెంపొందించే రచనలురావాలని కోరారు. ప్రసంగం చివరిలో ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవి."దేశ సేవకులు, దేశ ప్రేమికులు ఎప్పుడూ వర్తమానం గు‌రించే ఆలోచిస్తారు,కాని బాలసేవకులు,బాల ప్రేమికులుఒకడుగు ముందు వేసి భావితరం గురించి ఆలోచిస్తారు.ఫలితంగా ఒక తరం తరువాత కూడా వారి గుండెల్లో సజీవులుగా వుండిపోతారు.చిరస్మరణీయులవుతారు.ఆ అదృష్టం బాలసాహితీ వేత్తలకు దక్కుతుంది." ఇంకా ఆయన మాట్లాడుతూ సెలవుల్లో పరీక్ష పేపర్లకుజవాబులను రాసి తీసుకురమ్మనమని చెప్పడంకంటే పుస్తకాలిచ్చి చదివి సమీక్షలు పట్టుకురండనిచెప్పడం విద్యార్థి దశకు చాలా మేలు చేయగలదని సూచించారు. చదివిన పుస్తకం కీలక భావం ఒక దగ్గర రాసే అలవాటును పిల్లలకునేర్పాలన్నారు.నేను కూడా ప్రసంగ పాఠం వినిపించాను. ప్రతి ఒక‌రు వారి వారి భావాలువెలిబుచ్చారు. శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు జానపద కథలను నవీనంగా చెప్పే సామర్థ్యంరచయితలు అలవరచుకోవాలని అవి గ్రామీణపిల్లల్లో కొత్త ఆలోచనలకు తెరలేపుతాయని ఇంకాపొడుపుకథలు గ్రామీణ పిల్లలు ఇష్టపడతారనిసైన్స్ విషయాలు కూడా కథల రూపంలో చెప్పడానికి ప్రయత్నించాలన్నారు.డా.వెలగావెంకటప్పయ్య గారు సెమినార్ ను ఆద్యంతం ఆసక్తిదాయకంగా నడిపారనడంలో అతిశయోక్తిలేదు. ఆ రెండు రోజుల సెమినార్ మరపురానిఅనుభూతే అయింది. సీనియర్ రచయితలతోఆ రెండు రోజులు నేను గడపడం వారితో మాట్లాడడం ఒక బలమైన బాలసాహిత్య టానిక్అ యింది. వేదాంత సూరి గారు నా బాలగీతాలుప్రస్తావన తెచ్చారు.మీ బాలగేయాలు నూతనంగా ఉన్నాయి గేయాలు పంపించమని కోరారు. (సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 20, 2020 • T. VEDANTA SURY • Memories