ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
99.మరో మంచి సెమినార్:బెలగాం భీమేశ్వరరావు-9989537835
August 21, 2020 • T. VEDANTA SURY • Memories

1996లో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో " బుక్స్ ఫర్ రూరల్ చిల్డ్రన్అండ్ బుక్స్ టు ఎయిడ్ అడల్ట్ లిటరసీ అండ్కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ " అంశంపై సెప్టెంబరు17 నుంచి 22 వరకు ఒక సెమినార్ లిటరసీ హౌస్ ఆంధ్ర మహిళాసభ కళాశాల ప్రాంగణం హైదరాబాద్ లో జరిగింది. వివిధ భాషల రచయితలను ఆ సెమినార్ కి ఆహ్వానించారు.ఆహ్వానించబడిన 23 మంది రచయితలలోమన తెలుగు రచయితలు 8 మంది వున్నారు.వారు శ్రీమతి డి.సుజాతాదేవి,శ్రీ పి.చంద్ర శేఖరఅజాద్, శ్రీ బెలగాం భీమేశ్వరరావు, డా.గుడివాడప్రభావతి,శ్రీ నాయని కృష్ణమూర్తి,డా.కాలవ మల్లయ్య, డా.సమ్మెట గోవర్ధన్, శ్రీ శశికాంత్ శాతకర్ణి!సెమినార్ 6 రోజులు నిర్వహించారు.సెప్టెంబర్ 17న ప్రారంభోత్సవ సభ జరిగింది.వందేమాతరంతో సభ ఆరంభమయింది.శ్రీ
ఆర్కే మూర్తి జెనరల్ సెక్రటరీ ఇండియన్ సొసైటీఆఫ్ ఆథర్స్ స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్
ఛాన్సలర్ ప్రొ.రామకృష్ణయ్య గారు వచ్చారు.ఆ రోజు ముఖ్య ప్రసంగం ప్రొ.ఆర్.కృష్ణారావుగారు చేశారు.  బాలసాహిత్య ప్రాముఖ్యత
21వ శతాబ్దం లో బాలసాహిత్య ప్రాధాన్యతగ్రామీణ పిల్లల అవసరాలు గురించి ఆయన మాట్లాడారు.ఆ రోజు సభలో గ్రామీణ పిల్లల
కోసం పుస్తకాలు అన్న అంశంపై చర్ఛ జరిగింది.సెమినార్ కి వచ్చిన రచయితలు పాల్గొన్నారు.అదే రోజు మధ్యాహ్నం వయోజన అక్షరాస్యతకుసంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.వయోజనులకు సంబంధించిన సాహిత్యంగ్రేడ్ వారీగా తయారు చేయాలని వివిధ దశలలోఅక్షర జ్ఞానం కలిగిన వారు వారికి సరిపోయేసాహిత్యం చదవడానికి వీలవగలదని చర్చలోపాల్గొనిన రచయితలు సూచించారు.18 వ తేదీన జరిగిన సభకు శ్రీ కె.రామకృష్ణన్,ఫార్మర్ ఎడిటర్,చిల్డ్రన్ వరల్డ్ పత్రిక వారు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ రోజు సభలో బుక్స్ ఫర్రూరల్ చిల్డ్రన్ కి సంబంధించిన థీమ్స్,ఐడియాస్,బేక్ గ్రౌండ్ గురించి చర్చించడంజరిగింది.19 వ తేదీన రఫ్ డ్రాఫ్ట్ మరియు ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది.20 వ తేదీన రివైజడుడ్రాఫ్ట్ విశ్లేషణ జరిగింది.21వ తేదీన టెస్ట్ ఆన్టార్గెట్ ఆడియన్స్ కార్యక్రమం నిర్వహించారు.22 వ తేదీన జరిగిన ముగింపు సభకు ప్రముఖకవి అప్పటి రాజ్యసభ సభ్యులు డా.సి.నారాయణరెడ్డి గారు ముఖ్య అతిథిగావచ్చారు.చక్కని ఉపన్యాసమిచ్చిరచయితలకుదిశానిర్దేశం తెలిపారు. ఇన్సా వారి మెమెంటోనుడా.సి.నారాయణరెడ్డి గారి చేతులు మీదుగాఅందుకోవడం ఆ సెమినార్ లో కలిగిన మంచి అనుభూతి.ఆ ఫోటో నాకు లభ్యం కాకపోవడంనా సాహిత్య ప్రయాణం లో వెలితి గానే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ ఫోటో గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ సెమినార్ లో బాలసాహిత్యంతో పాటు వయోజన నూతన అక్షరాస్యుల సాహిత్య విషయాలు  తెలుసుకోడానికి అవకాశం కలిగింది.భవిష్యత్ లో వయోజన నూతన అక్షరాస్యుల
కోసం కొన్ని పుస్తకాలు రాయడానికి ఆ సెమినార్ దోహదపడింది.(సశేషం)