ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
:బాలసాహిత్యం ---43(2) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్ : 7013660252
November 5, 2020 • T. VEDANTA SURY • Memories

ప్రముఖ బాల సాహితీవేత్త దాసరి వెంకటరమణ గారు " అద్దంలో చందమామ" అనే లఘు చిత్రాన్ని తీశారు. కథ , మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన 10 నిమిషముల లఘు చిత్రం ఇది.  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లఘు చిత్రాల పోటీలో రెండవ  ఉత్తమ చిత్రంగా రూ. 20,000/- నగదు బహుమతి పొందింది. అలానే " జాగ్రత్త.......స్థిరాస్తి కొనేముందు" అనే లఘు చిత్రాన్ని రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ, తెలంగాణ ప్రభుత్వ నిర్మాణంలో పదిహేను నిమిషముల లఘు చిత్రానికి రచన, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం వహించారు. ఇక దూరదర్శన్ లోమహాకవి భారవి సీరియల్గా 13 వారాల పాటు ప్రసారమైంది. దీనికి కథ, మాటలు పాటలు దాసరి వెంకట రమణ గారే సమకూర్చారు. మహాకవి భారవి సీరియల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నాలుగు నంది బహుమతులను గెలుచుకుంది. ఆకాశవాణిలో "శిక్షా"  "చిన్న చేపను చిన్న చేపే" వంటి నాటికలు తో పాటు అనేక కథలు, కవితలు, వ్యాసాలు కథలు ప్రసారితం అయ్యాయి. 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము4, 5 తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన కమిటీలో సభ్యులుగానియమించారు. మహారాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో దాసరి రాసిన " పల్లెకు పోదాం" అనే కథను పాఠ్యాంశంగా తీసుకున్నారు. అదే మహారాష్ట్ర  ప్రభుత్వం 12వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో వీరు వ్రాసిన "వేగుచుక్క" అనే కథను పాఠ్యాంశంగా  తీసుకున్నారు. 2014లో దాసరి వారు వ్రాసిన "ఆనందం" అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రూ.50,000/-  రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. 2006 సంవత్సరంలో  వీరు వ్రాసిన "అమ్మ మనసు" కథల సంపుటికి పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటీ పురస్కారం ఇచ్చి 20 వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. 2007 సంవత్సరం నుండి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపిక కమిటీ సభ్యుడిగా ఉంటున్నారు. " ఆనందం" కథల సంపుటిలోని ఏడు కథలను విజయవాడ సమీపంలో గల పోరంకి లోని వికాస విద్యావనం హైస్కూలు లో ఆరో తరగతికి పాఠ్యాంశాలుగా తీసుకున్నా రు. 2010వ సంవత్సరం వెంకటేశ్వర బాల కుటీర్ గుంటూరు వారి మంగాదేవి  బాల సాహిత్య పురస్కారం రూ.15000/- నగదుతో సన్మానింపబడ్డారు. 1991 లో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు వీరు వ్రాసిన " భవిష్యత్తును రక్షించండి" అనే నవలకు వెయ్యి రూపాయల నగదు పురస్కారం అందజేసి దాసరి వారిని సత్కరిం చారు.  2008వ సంవత్సరంలో  "చక్రపాణి- కొలసాని " అవార్డుతోపాటుగా రూ. 5000/- నగదు బహుమతి అందుకున్నారు. చంద మామ పత్రికకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా దాదాపు 
15000 చందమామ కథలు నుంచి అరవై కథలు ఎన్నిక చేసి ప్రచురించిన ప్రత్యేక సంపుటిలో దాసరి నారాయణరావు గారి కథ "మంచితనం-- మంచిధనం" అనే పుస్తకం ఇంగ్లీష్ అనువాదం " మిస్ ప్లేస్డ్ హీరోయిజం'' పేరుతో ప్రచురింప బడింది. అవసరాల రామకృష్ణారావు గారు ప్రముఖ దినపత్రిక సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలోతనకు నచ్చిన బాల సాహిత్య రచయిత ఎవరంటే దాసరి నారాయణరావుగారు అని సమాధానం చెప్పారు. విజయపతాక, పాలధార-పంచదార, బాల సాహితీ వైభవం సంచికలకు ఉప సంపాదకత్వం  వహించారు. ఉయ్యాల మాస పత్రిక సంపాదక సలహా మండలి గౌరవ సభ్యులుగా పనిచేశారు. బాల సాహిత్య పరిషత్తు హైదరాబాదు ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన బాలల సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్గా, కిన్నెర ఆర్ట్ థియేటర్స్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలిం మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కిన్నెర పసిడి తెర బాలల నాటకోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్గా పనిచేశారు. దాసరి వెంకట రమణగారు భవిష్యత్తులో బాలసాహిత్యానికి అనేక సేవలు చేసి బాలలను ప్రగతి పథంలో నడిపిస్తారని  ఆశిద్దాం. ( సశేషం )
  .