అమ్మ --బొమ్మ ..:--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ ,వరంగల్ 9866252002

అమ్మకు నేనెప్పుడూ 
బొమ్మనే .....
ముద్దొచ్చినప్పుడల్లా ,
నా ..బంగారు బొమ్మా ..
అంటుంది ....
చక్కని గౌను తొడుక్కుంటే ,
నా ..కొండపల్లి బొమ్మా ...
అంటుంది ....
అమ్మమ్మ వూరు గుర్తొస్తే ,
నా ..నిర్మల్ బొమ్మా ...
అంటుంది ....
లంగా -జాకెట్టు తొడిగి ,
నాముద్దుల లక్కపిడతా ...
అంటుంది ....
నేను అందంగా కనిపిస్తే ,
నా ..ప్రియమైన బాపూ బొమ్మా ..
అని పిలుస్తుంది .
ఇన్ని బొమ్మల పేర్లు చెప్పే 'అమ్మ ',
ఎప్పుడు బొమ్మకొనమన్నా ...
' నువ్వే చక్కని బొమ్మ -ఇక ...
  వేరే బొమ్మలెందుకు ..?'
అనేస్తుంది, పక ..పక ..నవ్వుతూ !!


 


కామెంట్‌లు