స్వస్ధి....: --డా.కె.ఎల్.వి.ప్రసాద్,--హనంకొండ

నా ...
మా .....
అనేపదాలు మరచి 
' మన 'అనేపదం ...
ఉచ్చరించలేని ...
మహా నుభావులుగా 
చెలామణి అయ్యే ...
స్వార్థ జనావళికి ,
వారి స్నేహా నికీ ,
స్వస్తిపలికేస్తా !


ముఖస్తుతితో 
మునగచెట్టు ఎక్కించి ,
పొగడ్తల మత్తుతో 
వళ్ళు పులకింపజేసి ,
నా వీపువెనక ...
నా శీలాన్ని వెక్కిరించే ,
నక్కజిత్తుల ___
నాగన్నల స్నేహానికి 
స్వస్తిపలికెస్తా !


అవసరానికి ఒకలా ,
అవసరం తీరాక మరోలా ,
మనిషిని లెక్కగట్టే ,
మాయమనుష్యుల _
స్నేహానికి ,
మరోఆలోచన లేకున్డా,
స్వస్తి పలికేస్తా !


హోదాల గర్వంతో,
'మనీ'ఉందన్న మదంతో 
స్నేహాన్ని _
చిన్నచూపు చూసే ,
ఇరుకు బుద్ది ..
మకిలి మనస్సుల _
మురికి స్నేహానికి,
స్వస్తి పలికేస్తా !


కులంతో ...
మతంతో ...
ప్రాంతంతో ...
భాషతో ....
స్నేహాన్ని ముడిపెట్టే ,
కుచ్చిత బుద్దుల ,
దొంగస్నేహానికి ....
స్వస్తి పలికేస్తా !
నిండు హృదయంతో ,
నన్ను నేనునమ్ముతూ _
నిజాయతీగా బ్రతికేస్తా ..!!



కామెంట్‌లు