నడుస్తున్న చరిత్ర :--డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ ..

కులాంతర వివాహాలు 
మతాంతర వివాహాలు ,
కొత్తవేమీ కాదు ...!


మానవ చరిత్ర మొదలై,
నాగరికతను 
జీర్ణం చేసుకున్న క్షణం నుంచీ 
ఈ ప్రేమబంధాలు 
ముడిపడడం ..
మొదలు పెట్టాయి ...!


మనిషి ...
చాలా మట్టుకు...
తనకోసం కాక ...
సమాజంలో 
పరువుగా బ్రతకటం కోసం ,
విమర్శను 
తట్టుకోలేనివాడుగా,
పొగడ్తలకు బానిసగా ,
బ్రతకటం.మొదలు పెట్టాడు !


ఈ నేపథ్యంలో ...
తన వాళ్లు ..తన మనసు కంటే,
కులం నెత్తిమీద 
శీర్షాసనం వేసింది !


మతం ...మతిని ,
స్థాన భ్రంశం చేసి ...
మస్తిష్కం నిండా ...
మత్తు అల్లుకుపోయింది !


మనిషిలో ....
కౄరత్వం ..కక్ష ..పగ ,
హింస ..
పడగెత్తిన త్రాచులవుతున్నాయ్ !


యువతీ ..యువకుల్లారా ..
ప్రేమించుకోడం తప్పుకాదు,
దానికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు !


ప్రేమను ..ఒప్పించుకోవడం 
తెలుసుకోండి ...
అది పెద్ద కళ సుమా ..!


అది చాతకానప్పుడు ..
మీ బ్రతుకులు ...
బహు భద్రం సుమా ...!


పదునెక్కిన కత్తులు ,
గురిపెట్టిన ...
తుపాకీ గుళ్ళూ ...
ఆమ్లం నింపిన ..
అత్తరు సీసాలు ..
మీ చుట్టూ ..
ప్రదక్షణం చెస్తుంటాయ్ !


మీ నెత్తురు కళ్ల చూసేవరకూ 
ససేమిరా ...
అవి నిద్ర పోనంటాయ్ !



భద్రం ..యువకుల్లారా ..!
బహు భద్రం ..
యువతీ ..యువకుల్లారా !!



కామెంట్‌లు