వెన్ను పోటు : ------డా.కె .ఎల్ .వి.ప్రసాద్ .--హనంకొండ.

వెన్ను పోటు అంటే 
తెలీని వాడికి ...
ఎన్నికల సమయంలో ,
తప్పక అర్థం అవుతుంది ,
అది ఒక అస్త్రం గా ..
మారుతుంది ...!


వ్యక్తిగత వెన్నుపోట్లు 
ప్రచారంలో ..
అగ్రస్థానంలో ఉంటాయి ..కానీ ,
సామజిక వెన్ను పో ట్లు,
అంతగా ...
జనంలోకి రాలేవు !


ఎవరొ ..ఎవరినో 
వెన్ను పోటు పొడిస్తే ...
అది వారి వ్యక్తిగతం,
మనకు అనవసరం !
కా ని ....
సమాజానికే ..
వెన్నుపోటు పొడిచిన వాడు,
క్షమార్హుడు కాదు ...
ప్రజల శిక్షకు అర్హుడు !!



కామెంట్‌లు