ఆడపిల్ల ---------- ఆడపిల్ల జీవితంలో ఎప్పుడూ ఒకరిమీద ఆధారపడి ఉండాలా? పుట్టినప్పుడు అమ్మ కాపాడుతుంది పెరుగుతున్నప్పుడు నాన్న కాపాడుతాడు స్కూల్లో,కాలేజీల్లో అన్నయ్య కాపాడుతాడు పెళ్లయ్యాక భర్త కాపాడుతాడు మరి మాకు మేము ఎప్పుడు కాపాడుకోవాలి? ఎప్పుడూ ఒకరిమీదనే ఆధారపడి బతకాలా? మాకు చదువు,సంస్కారాలతోపాటు మాకు స్వేచ్ఛనివ్వండి స్వాతంత్రాన్నివ్వండి మగవారితో సమానంగా హక్కులను బాధ్యతలనివ్వండి మమ్మల్ని ఆత్మ గౌరవంతో బతకనీయండి. మేమేమిటో నిరూపించుకుంటాం. -బి.పూజ రోహిణి హైదరాబాద్


కామెంట్‌లు