🙏🏾 ఆదిగురువు🙏🏾 .🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఎవరు నేర్పేరు మేఘానికి/ వాన చినుకుగా మారమని పుడమిసంరక్షణ నీభాద్యతని/ ఎవరు చెప్పేరు నదులకు/ పల్లానికి ప్రవహించమని భూమిని సశ్యశ్యామలం చేయమని/ ఎవరు చెప్పేరు పంటచేలకు/ ప్రాణికోటికి ఆకలి తీర్చమని/ ఎవరు చెప్పేరు పళ్ళిమ్మని/ చెట్టుకు విత్తును వివేకంతో నీలో దాచుకొని మరల మొలకెత్తమని/ పక్షికేగురువు నేర్పేడు / గూడు కట్టుకొమ్మని సంతును రెక్కలొచ్చేవరకుా పోషించమని/ పశువు కెవరు నేర్పారు/ పనికిరాని గడ్డిని మేసి పాలుగా మార్చే విద్య/ సాలెపురుగుకు ఎవరునేర్పేరు/ అందమైన గూడునల్లి ఆహార సముపార్జనకు పురుగులనాకర్షింపజేసుకోవాలని/ పైన ఒకడున్నాడు/ అందరి క్షేమం చూచేవాడు అందరికీ అన్నీ నేర్పేవాడు అనంతరూపాలుగలవాడు ఆదిగురువు అతడొకడే/ సత్యవాణి కుంటముక్కుల


కామెంట్‌లు